పరాయి మహిళతో డేటింగ్ తప్పుకాదట...
posted on Feb 17, 2015 @ 9:39PM
పరాయి మహిళతో డేటింగ్ తప్పుకాదట.. ఈ విషయాన్ని అన్నది మరెవరో కాదు.. ఇటీవలి కాలంలో బాగా వార్తల్లోకి వచ్చిన బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ. ఈమధ్యకాలంలో ఆయన సంచలన వ్యాఖ్యలు బాగా చేస్తు్న్నారు. ఆయన వ్యాఖ్యలు ఆయనకు ఆనందాన్ని కలిగిస్తున్నాయేమోగానీ జనానికి మాత్రం చిరాకు పుట్టి్స్తున్నాయి. సమాజంలో ఉన్న పురుషులలో 10 శాతం మంది పురుషులు మాత్రమే సొంత భార్యతో బయట తిరుగుతున్నారట.. మిగతా 90 శాతం మంది మగాళ్ళు పరాయి వాళ్ళ భార్యలతో తిరుగుతున్నారట. అది కూడా బీహార్‌లో అయితే ఈ ధోరణి చాలా ఎక్కువగా వుందట... ఈయన ఇక్కడితో ఆగాడా... భార్యాభర్తల మధ్య పరస్పర అంగీకారం వుంటే ఇలా తిరగటం తప్పుకూడా కాదట. మొత్తానికి భలేవాడే... నరేంద్రమోడీ గెలిచినందుకు ఫీలైపోయిన నితిష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ పదవి మీద ఈయనగార్ని కూర్చోపెట్టాడు. ఇప్పుడు ఈయన ఏకు కాస్తా మేకులా మారి నితిష్ కుమార్‌కే గుచ్చుకున్నాడు. బీహార్ రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపుకుదిపి.. జేడీయు పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన త్వరలో బీహార్ అసెంబ్లీలో బల పరీక్షకు నిలవబోతున్నారు.