60 ఏళ్ళ అత్త బర్త్ డే కి.. 60 రకాల వంటకాలు చేసిన కోడలు..
posted on Jul 28, 2021 @ 10:31AM
అత్తా కోడళ్లు అంటేనే పోట్లాట, అత్త, కోడలు అంటే బద్ద శత్రువులు, వాళ్ళ ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటాది అని అటు సీరియల్ లోను ఇటు సినిమాల్లోనూ దంచి కొడుతుంటారు. సినిమాలు, టీవీ సీరియల్స్‌లో అత్తా కోడలికి, కోడలు అత్తకి ఇచ్చి వార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజానికి అందరూ అత్తలు ఆలా ఉండరు కోడలు కూడా అలా ఉండరు. అదంతా రీల్ లైఫ్‌లో సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలిచే అత్తా కోడళ్లు ఉన్నారు. అత్తమామలను సొంత తల్లిదండ్రులుగా చూసుకునే కోడళ్ళు కూడా ఉన్నారు. తాజాగా ఓ కోడలు తన అత్తా పై తనకు ఉన్న ప్రేమను అలాగే చూపించింది. పుట్టిన రోజు నాడు ఎవరూ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. అత్తగారిపై కోడలు చూపించిన ప్రేమను చూసి నోరెళ్లబెడుతున్నారు.
అది పశ్చిమగోదావరి జిల్లా. ఆ జిల్లాకు చెందిన కోడలు తన అత్తగారి పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 60 రకాల వంటకాలను తయారు చేసింది. అన్ని రకాల వెరైటీలు మెనూలో చేర్చేశారు. వంటకాలను డబ్బాల్లో నింపి వాటిపై పేర్లు రాసి పెట్టింది. పులిహోర నుంచి నూడిల్స్ వరకు.. ఇడ్లీ నుంచి పెరుగు వరకు చెప్పుకుంటూ పోతే చాలా వెరైటీలే ఉన్నాయి. అత్తగారిపై కోడలు చూపించిన ప్రేమను చూసి అంతా షాక్ అవుతున్నారు.. ఆ వెరైటీ వంటలు చూసి నోరెళ్లబెడుతున్నారు.60 వంటలు చేయడం వెనుక మరో సర్‌ప్రైజ్ కూడా ఉంది. అత్తకు 60 ఏళ్లు కావడంతో ఆ కోడలు.. 60 రకాల వెరైటీ వంటలను చేసి గిఫ్ట్‌గా ఇచ్చారు. కోడలి ప్రేమకు అత్త కూడా ఫిదా అయ్యారు.. ఈ వంటకాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.అత్తా కోడళ్ళ అనుబంధం ఇదే అంటున్నారు. చూస్తుంటేనే నోరూరిపోతుందంటున్నారు.
అందరూ చెపుతుంటారు.. ఎవరు చెప్పింది నమ్మొడు అని.. అది కొంత వరకు నిజమైతే.. అత్తాకోడళ్ల విషయంలో మనం నిత్యం సినిమాలోనో , సీరియల్ లోను చూసేది కూడా నిజం కాదు.. ఇంకా ఎవరైనా అత్తతో గొడవలు ఉన్న కోడళ్ళు ఇప్పటికైనా మరి వారి వారి అత్తలను సొంత అమ్మలుగా చూసుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో వస్తున్నాయి..