రేవ్ పార్టీ : అమ్మాయిలు దొరికిపోయారు!
posted on Apr 5, 2014 @ 4:19PM
పూణేలోని లోనావాలా ప్రాంతంలో ఓ పెద్ద బిల్డింగ్‌లో 20 మంది కాలేజీ అమ్మాయిలు రేవ్ పార్టీ చేసుకుంటున్నారు. పీకలదాకా తాగి, తమతోపాటు వచ్చిన 26 మంది తమ కాలేజీ అబ్బాయితో కలసి డాన్స్ చేస్తున్నారు. ఆ కుర్రాళ్ళు కూడా బీభత్సంగా తాగి వున్నారు. ఇంతలో అనుకోకుండా పోలీసులు ఆ ఇంటి మీద దాడి చేశారు. పోలీసులు దాడి చేసిన అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతమాత్రం పట్టించుకోకుండా డాన్స్ చేస్తూనే వున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు పూర్తిగా మత్తులో మునిగిపోయి వచ్చింది పోలీసులు అని కూడా అర్థం చేసుకోలేని స్థితిలో వున్నారు.
వాళ్ళ ఒంటిమీద వున్న బట్టల పరిస్థితిని మనం ప్రస్తావించుకోకపోవడమే మంచిది. వాళ్ళందరికీ మత్తు వదిలాక తామందరూ పోలీస్ స్టేషన్‌లో వున్నామని అర్థం చేసుకున్నారు. అమ్మాయిలతో డాన్స్ చేసిన మగ గాడిదల సంగతి అలా వుంచితే, సదరు అమ్మాయిలందరూ పూణేలో ఉన్నత కుటుంబాలకు చెందిన అమ్మాయిలే. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా మామూలుగా లేదు. అయినా పోలీసులు భయపడకుండా ఈ విషయాన్ని మీడియాకి వెల్లడించారు.
ఈ అమ్మాయిలందరూ రేవ్ పార్టీ చేసుకోవడానికి ఆ బిల్డంగ్‌ని బోలెడంత అద్దె చెల్లించి అద్దెకి తీసుకున్నారట. కాలేజీ జరుగుతున్న సమయంలో కూడా అక్కడకి వచ్చి పార్టీ చేసుకుని వెళ్తారట. బిల్డింగ్ అద్దె, పార్టీకి అయ్యే ఖర్చు మొత్తం అమ్మాయిలే పెట్టుకుంటారట. పోలీసులు అమ్మాయిలందరికీ బెయిల్ ఇచ్చేసి వాళ్ళ ఇళ్లకి పంపేశారు. రేపో మాపో కోర్టులో కాస్తంత జరిమానా విధించి వాళ్ళకి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తారు. మరి ముళ్ళదారిలో ప్రయాణిస్తున్న యువతరాన్ని ఎవరు కాపాడతారు?