2000 నోటుకు నీటి పరీక్ష.. నో టెన్షన్..
posted on Nov 14, 2016 @ 3:04PM
నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ఒక పక్క పాత నోట్ల మార్పిడి పై ప్రజలు బ్యాంకుల దగ్గర క్యూ కడుతుంటే మరోపక్క కొత్త నోట్లు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కొత్తగా వచ్చిన 2000 నోటు. ఇప్పటికే ఈ నోటుపై పలు వదంతులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రూ.2000 నోటుకు కొందరు వ్యక్తులు రకరకాల పరీక్షలు పెడుతున్నారు. కొందరు పూర్తిగా నలిపేస్తూ.. మరికొందరు నీటిలో నానబెడుతూ చేస్తున్న ప్రయోగాలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే... ఓ వ్యక్తి రెండు వేల నోటును కడుగుతూ తీసిన వీడియో తీశాడు. పొరపాటును నోటు నీటిలో పడినా టెన్షన్ పడొద్దు.. ఈ రెండు వేల నోటుకు ఏమీ కాదు అని వీడియోలో తెలిపాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ వీడియోకి 50 లక్షల వ్యూస్ రావడం.