వీడని మర్డర్ మిస్టరీ..
posted on Jun 9, 2021 @ 5:37PM
అన్ని సీడీలు ఒకేలా ఉండవు అన్నట్లు.. మర్డర్ చేసిన క్రిమినల్స్..మర్డర్ సంబందించిన వివరాలు ఒకేలా ఉండవు.. ఒక్కొక కేసుకు ఒక్కొక స్పెషల్ విచారణ ఉంటుంది.. ప్రాధాన్యత ఉంటుంది.. ఒక్కోసారి ఎన్నో కేసులు సాల్వ్ చేసిన పోలీసులు కూడా తలలు పట్టుకుంటారు.. కొంత మంది పోలీసులు ఎలాంటి కేసు అయిన ఇట్టే తేల్చేస్తారు.. ఆ ఏరియా చాలా కాస్ట్‌లీ ఏరియా. ఒక్క మాటలో చెప్పాలంటే బడాబాబులు ఉండే ఏరియా. ఎక్కడ చూసిన సిసి కెమెరాలు.. అంతా సెక్యూరిటీ అలాంటి చోట ఒక అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి ఎలా చనిపోయింది. ఎవరైనా చంపారా..? లేదంటే ఆ అమ్మాయి ఆత్మ హత్య చేసుకుందా.. ? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఆ మిస్టరీ క్రైమ్ స్టోరీలో ఏ ట్విస్ట్ ఉందో చూద్దాం.
ఓపెన్ చేస్తే.. ఉదయం సమయం 8 గంటలు అవుతుంది. ఎస్సై పోలీస్ స్టేషన్ కి రెడీ అవుతుంటే...మొబైల్ మోగింది. లిఫ్ట్ చేయగానే.. అవతలి నుంచి ఆరిన గొంతు ఏదో చెప్పింది. అతను చెప్పిన మాటలు వినగానే.. ఎస్సై కళ్లు పెద్దవయ్యాయి. వస్తున్నాం అంటూ అక్కడి నిండి ఇద్దరు కానిస్టేబుల్ ని వేసుకొని బయల్దేరాడు. పావుగంటలో స్పాట్‌కి చేరుకున్నారు.. అది వెసు ఏరియా. పెద్దగా రద్దీగా లేదు. అంత అపార్టుమెంట్లో ఉన్నారు. పోలీసులు రాగానే అపార్ట్‌మెంట్ పనులన్నీ పక్కన పెట్టేసి... చిల్లుకు పడ్డ చొక్కాల కళ్ళు వేసుకుని భయం భయముగా చూడసాగారు. పోలీసులు అటూ ఇటూ చూస్తుంటే అంతలో ఒక వ్యక్తి వచ్చాడు. మీకు కాల్ చేసింది నేనే సార్.. అని ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేశాడు.. మా పక్క ఫ్లాట్‌లోనే అనగానే ఎస్ఐ ఒకే పదా అంటూ... ఆ వ్యక్తితో కలిసి ఆ ప్లాట్ వైపు నడిచాడు.. ఆ ఫ్లాట్ డోర్ క్లోజ్ చేసి ఉంది. లోపల గడియ వేసి ఉంది. కానిస్టేబుల్ వచ్చి గట్టిగా కొట్టారు. రాలా. అదిమారు, గుద్దారు... వెంటనే ఫైర్ డిపార్ట్‌మెంట్‌కి కాల్ వెళ్లింది. వాళ్లు వచ్చే లోపు స్థానికులు పోలీసులకు టీ ఇచ్చారు. అది తాగుతూనే ఎస్సై... ఆమె ఎవరు అని తమకు కాల్ చేసిన వ్యక్తిని అడిగారు. "సార్... ఆమె ఇక్కడి ఆమె కాదు. మిజోరం అమ్మాయి. ఏజ్ ఓ 20 ఏళ్లు ఉండొచ్చు. ఎవరి తాలూకో, పేరేంటో మాకేమీ తెలియదు. ఎందుకంటే తాను మాతో ఎప్పుడూ మాట్లాడదు. అలా వస్తుంది... తన ఫ్లాట్‌లోకి వెళ్తుంది. అంతే... అందుకే మాకు ఏ వివరాలూ తెలియవు" అన్నాడు. ఓకే ఓకే... నో ప్రాబ్లమ్ అంటూ... టీ లాగేశాడు ఎస్సై. ఇంతలో... ఫైర్ డిపార్ట్‌మెంట్ వచ్చేసింది. కళ్లుమూసి తెరిచేలోపు డోర్ బద్దలు కొట్టారు. ఫ్లాట్ లోపలికి వెళ్లారు. లోపల వెళ్లి చూడగానే సోఫాపై ఆమె పడిపోయి ఉంది. పోలీసులు పల్స్ చెక్ చెయ్యగా... అప్పటికే ఆమె చనిపోయి ఉంది. ఆ శవం ఒక రకమైన దుర్వాసన వచ్చింది. నిన్న లేదా మొన్న చంపేసి ఉండాలి అని ఎస్సై అనగానే... సార్... ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవచ్చుకదా... డోర్ కూడా లాక్ చేసి ఉంది. అని ఒక పాయింట్ పట్టుకున్నాడు ఓ కానిస్టేబుల్.
అనగానే ఎస్ఐ కానిస్టేబుల్ వేసిన ప్రశ్నకు తలా ఆడిస్తూ ఇలా అన్నాడు కావచ్చు... కానీ... ఎదురుగా ఉన్న ఆ విండోస్ చూశావా... ఒకటే ఓపెన్ ఉంది.. మరొకటి క్లోజ్ లో ఉంది. నువ్వు అన్నట్లు అదే నిజం అందానికి ఆధారాలు లేవు. ఆమె కిటికీని తెరిస్తే... రెండు తలుపులూ తెరిచి ఉంచేది కదా... లేదా.. రెండూ మూసి ఉంచేది. ఎవరో ఈమెను గొంతు నొక్కి చంపేసి... కిటికీ లోంచీ ఎస్కేప్ అయ్యాడని నేను డౌట్ పడుతున్నాను అని ఎస్సై అన్నాడు. అంతేకాదు... ఒక వేళ తను సూసైడ్ చేసుకునుంటే.. ఏ మత్తు మందుతోనో. ఫ్యాన్ కి హ్యాంగ్గింగ్ లాంటివి ట్రై చేసి ఉండాలి.. కదా... అవి అలా జరిగినట్లు ఇక్కడ ఎలాంటి ఆధారాలు లేవు అని ఎస్ఐ అనడంతో... మిగతా వారంతా కూడా మీరు చెపింది కరెక్ట్ కావచ్చు సార్ అని అన్నారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తరలించారు. అలాగే... తాము పిలిచినప్పుడు రావాలని పక్కింటి వారికి చెప్పారు. అలాగే... ఆమె ఇంట్లో సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపారు. ఇంకా... ఆమె తాలూకు వారికి ఫోన్ చెయ్యడం కోసం ప్రయత్నిస్తున్నారు. అలాగే అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. త్వరలోనే మిస్టరీని ఛేదిస్తామని పోలీసులు చెప్పారు. కానీ ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తమ పోష్ ఏరియాలో ఇలా ఎప్పుడూ జరగలేదనీ... తమకు చాలా భయం వేసిందని స్థానికులు చెప్పారు.