చాటింగ్ చేశారు అంతే.. చితకొట్టారు..
posted on Jul 6, 2021 @ 11:13AM
తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష తప్పదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి చేసిన తప్పుకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. పెద్ద పెద్ద తప్పులు చేస్తే శిక్షించడానికి పోలీసులు ఉన్నారు. కోర్టులు ఉన్నాయి. గ్రామాల్లో చేసిన తప్పును శిక్షించడానికి పంచాయితీ పెద్దలు ఉంటారు. అదే ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే శిక్షించడానికి ముందు ఇంట్లో వాళ్ళే శిక్షిస్తారు. అది ఎక్కడైనా మనం చూస్తూనే ఉంటాం.. కానీ తమ మేనమామ కొడుకుతో చెల్లెల్లు మాట్లాడుతున్నారు అని ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఎవరైనా పెళ్లి చేస్తారు.. కానీ వీళ్ళు మానవత్వం మరిచి.. మృగాళ్ల ప్రవర్తించారు. ఆ ఇద్దరు అక్కచెల్లెలు రాళ్లతో కర్రలతో దాడిచేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు పది మంది దాకా ఆడవాళ్లపై దాడిచేశారు.. ఏం జరిగింది ఎలా జరిగింది అని తెలుసుకోవాలంటే ఈ మొత్తం వార్త చదవండి.
వాళ్లిదరు అక్కాచెల్లెళ్లు. రెగ్యులర్ గా తమ మేనమామ కుమారుడితో బావ మరదళ్ల సరసంగా ఫోన్‌లో మాట్లాడేవాళ్లు.. తమ మేనమామ కుమారులతో చాటింగ్ చేస్తున్నారని ఇద్దరు అక్కచెల్లెళ్లలను సొంత కుటుంబ సభ్యులు కర్రలతో దారుణంగా చావబాదారు. మహిళలు, పురుషులు కలిసి అమ్మాయిల జట్టు పట్టుకున్నారు. రాళ్లు, కర్రలతో కొడుతూ దాడి చేశారు.. ఆ దెబ్బలకు భరించలేని ఆ అమ్మాయిలు తమను క్షమించండి.. అని కాళ్ళు పట్టుకున్నారు. ఆయినా వాళ్ళు వినిపించుకోలేదు, వాళ్ళను వదలలేదు. వారు వేడుకోవడం వీడియోలో కనిపిస్తోంది. గత నెల 22న పీపల్వా గ్రామంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. బాధితుల వయసు 19, 20 సంవత్సరాలు. బాధిత యువతులు తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడ్డారు. తర్వాత ఓ యువతిని పోలీస్ స్టేషన్‌కు రప్పించి వాంగ్మూలం నమోదు చేశారు. వారిపై దాడి చేసి చితకబాదుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
గ్రామంలోని ఓ స్కూలు వద్ద తమను అడ్డుకున్న బాబాయి కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు దాడికి పాల్పడినట్టు వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. యువతులిద్దరినీ వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇదే రాష్ట్రంలోని అలీరాజ్‌పూర్ జిల్లాలో ఇటీవల ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. అత్తారింటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన ఓ మహిళను చెట్టుకు కట్టేసి తల్లిదండ్రులు, సోదరులు దాడిచేశారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.