పండంటి ఆరోగ్యానికి 1 6 సూత్రాలు

ఊసురోమని మనుషులుంటే దేశమేగతి  బాగుపడు నోయ్!  అన్నాడు  మహా కవి గురజాడ.  అది నిజమే కదా. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే  సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్య వంతమైన సమాజంతోనే అభివృద్ధి  అన్నది నిజం అయినా  ఏ కార్యం సాధించాలన్నా  మొదట ఉత్సాహం ఉంటేనే ఏ పనైనా చేయగలం ఇది నిజం . శారీరకంగా గానీ, మానసికంగా కానీ శరీరంలో శక్తి హరించుకుపోయినట్లుగా నీరసంగా అలసటగా ఉంటే ఆవ్యక్తి ఏపని  చేయలేడు దీనినే వైద్య పరిభాషలో  fatigue అంటారు. జీవితంలో ప్రతి వాళ్ళూ ఎప్పుడో ఒకప్పుడు fatigue  తో సమస్యలు ఎదుర్కోడం సహజం. అలా ఉండకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి. శరీరంలో నీరసంగా అలసటగా వున్నట్లు అనిపించడానికి  రకరకాల కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్య కారణం సరైన పోషక ఆహారం తీసుకాకపోవడం, తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవడం లేదా మానసిక ఒత్తిళ్లకు లోనుకావడం కారణమని వైద్యులు అంటున్నారు.  శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు లేకపోతే శరీరంలో శక్తి  సరిపడా ఉత్పత్తి కాదు. దీని వల్ల జరిగే మొట్టమొదటి నష్టం జీవితం పట్ల ఉత్సాహం చచ్చి పోవడం. చర్మంలో మృదుత్వం పోతుంది. రోమాలు రాలిపోతాయి. గోళ్ళలలో  పగుళ్ళు వస్తాయి. ఇవన్ని ఆ మనిషి అనారోగ్యానికి గురౌతున్నడానికి  ప్రధమ సూచనగా  భావించాలి. ఇందులో నుండి బయట పడాలంటే  నిత్య జీవితంలో కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి.

1)   వారానికి ఒక్క రోజైనా పళ్ళు ఫలాలు తీసుకోవాలి.                                                                                                                                                                
1) అరుగుదలకు ఎక్కువ సమయం తీసుకునే మాంసం కొవ్వు, జున్ను లాంటి ఆహారాలను తప్పుడు కాంబినేషన్లో  రెగ్యులర్  గా  ఎక్కువ తీసుకుంటే మనిషిలో అలసట అనిపిస్తుంది. దురదృష్టం  ఏమిటి అంటే  చాలా మంది వారం పొడుగునా  నాన్ వెజ్ లేకపోతే ముద్దే దిగదు. అలా తింటేనే వాళ్ళకు భోజనం సంతృప్తిగా తిన్నట్లు ఉంటుందని అంటారు.                                                                                                              
 2)  వారంలో  ఒక్క రోజైనా మరి ఏ ఇతర ఆహారానికి పోకుండా కేవలం తాజా పళ్ళు ఫలాలను , మంచి నీళ్ళతోనూ మాత్రమే తీసుకుంటే వారమంతా తిన్న ఆహరం అరగడానికి పేగులు పడ్డ శ్రమకు కాస్త రెస్ట్  ఇచ్చినట్లు ఉంటుంది. శరీరంలో కొత్త ఉత్తాహం వస్తుంది.                                                                                                                                

 2 )   ప్రేరక  పానీయాలు వద్దు.                                                                                                      
ఉప్పు, పంచదార, కాఫీ, టీ  మసాల కూరలు  ఆల్కాహాల్ , సిగరెట్ లాంటివి మీ ఒంట్లో శక్తిని హరిస్తాయి, అలాగే అతిగా  సెక్స్ కార్య క్రమాలలో పాల్గొంటున్న పైన చెప్పిన వన్నీ అతిగా తీసుకుంటే అడ్రినాల్  వ్యవస్త  చిన్నా భిన్నమవుతుంది.                                                                                                                                                                            

3)  ఉదయం తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి.                                                          
 ఉదయాన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం  చాలా ముఖ్యం తప్పనిసరి. బ్రేక్ ఫాస్ట్ తీసుకోకుంటే రక్తంలో గ్లుకోజ్  శాతం తగ్గిపోయి హై పోగ్లైసీమియా  సంభవించే ప్రమాదం ఉంది. దాని మూలంగా కళ్ళు తిరగడం, చెమటలు పట్టడం మనస్సుకు శరీరానికి సమన్వయము లోపించి వ్యక్తి పూర్తిగా నీరసించిపోతారు. ఈ లక్షణాన్ని  గుర్తించి సత్వరం  ఆహరం తీసుకోడం అవసరం.                                                    

4 )  రిలాక్స్ - రిలాక్స్                                                                                                          
  చాలా మంది  అన్నం తిన్న వెంటనే బయటికి వెళ్ళిపోవడం లేక పనుల్లో నిమజ్ఞ మవ్వడం లాంటివి అలవాటుగా వుంటాయి. అలా కాకుండా భోజనం చేసిన  తరువాత తప్పకుండా కొద్ది సేపు రిలాక్స్ కావాలి . లేదా కొద్ది సేపు రెస్ట్ తీసుకోవాలి  ఆ తరువాత మాత్రమే  పనుల్లో పాల్గొనాలి.          భోజనం  తరువాత ఎంత సేపు రిలాక్స్ కావాలి తక్కువలో తక్కువ  పావుగంట అని వైద్యులు సూచించారు.                                          
5)  బాగా నీళ్ళు తాగాలి.                                                                                                    
 నిజం చెప్పాలంటే చాలా మంది రోజూ తమకు సరిపడే నీటిని తాగుతూ ఉంటారు. మరీ తక్కువగా నీళ్ళు తాగడం వల్ల శరీరం లో మల బద్ధకం పెరుకుతుంది. శరీరంలోని  వ్యర్ధ  పదార్ధాలు బయటికి వెళ్ళక  అదే శరీరానికి అలసటకి దారితీస్తుంది.                                                                                                                                      
6 ) పరిశుభ్ర మైన ఆహారం.

                                                                                          
ఈ రోజుల్లో కూరగాయలలో క్రిమిసంహారక మందులు చల్ల బడని  పళ్ళు , కాయగూరలు  ఉండడం  లేదంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా  ఈ క్రిమిసంహార మందులు  పళ్ళు కూరాగాయలలో సైతం  లోపలికి  ఇంకిపోతాయి.అయినా వాటిని  శుభ్రంగా తుడిచి కదగకపోతే వాటి  వల్ల మన శరీరానికి  హాని చేస్తాయి. వీటిలో దుమ్ము ధూళి బ్యాక్టీరియా లాంటివి శుభ్రంగా  కడిగిన తరువాతే కూరగాయలు, పళ్ళను తినడానికి ఉపయోగించాలి. పళ్ళు ముఖ్యంగా  కృత్రిమ రసాయనలతో  పండిస్తారు ఎర్రగా కనపడడానికి వివిధ రసాయనాలు పూస్తారు.  అందుకే వాటిని కొనేటప్పుడు, వాడేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం అవసరమని డాక్టర్లు సూచిస్తున్నారు.

                                                                         
7 ) ఉదయాన్నే  గోరు వెచ్చటి నీరు తీసుకోవడం.


 ఉదయాన్నే అంటే నిద్రనుంచి లేవగానే  మొహం కడుక్కొని ఒక గ్లాసు గోరు వెచ్చటి నేటిలో  తాజా నిమ్మకాయ రసాన్ని పిండుకుని తాగితే అది నిద్రమత్తును వడిలించి శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుంది.                                                                    
 ఇక్కడ గమనించాల్సిన  విషయం ఏమిటి అంటే  బాయిల్ చేసి  చల్లార్చిన  నీటిని గోరు వెచ్చటి ఉన్నపుడే తాగితే మంచింది . ముందే పిండుకున్న రసాన్ని లేదా నిల్వ ఉంచిన  నిమ్మ రసాన్ని కాకుండా అప్పుడే పిండుకుని తాగి తేనే  అందులో పోషక విలువలు నశించి పోకుండా వుంటాయి. అదే శ్రేష్టం. అంటున్నారు వైద్యులు.                                                                            

8)  పళ్ళు ఫలాలు                                                                                                            

కొందరు అన్నం తిన్నాక ఆకర్లో అరటి పండు తినడం లేక ఆయా సీజన్లో వచ్చే పళ్ళు  ముఖ్యంగా ఎండా కలంలో మామిడి పండ్లు  తింటారు. అన్నంతో గానీ , అన్నం  తిన్న వెంటనే గానీ  పళ్ళు  తీసుకుంటే అజీర్ణం , తేన్పులు , గుండెల్లో మంట లాంటి  వాటికీ దారితీస్తుంది.                                                                                                                                                          
వేగంగా జీర్ణమయ్యే పళ్ళు ఫలాలను నిదానంగా జీర్ణమయ్యే ప్రోటీన్ లు, కార్బో హైడ్రేట్లు ఉన్న ఆహారంతో పాటు తీసుకుంటే  వాటిలో ఏది సరిగ్గా జీర్ణం కాదు. అందుకని పళ్ళను  అన్నం తినడానికి బాగా ముందు కాని , భోజననికి, భోజనానికి మధ్య   సమాయంలో గాని  తీసుకోడం మేలు అంటున్నారు వైద్యులు.                                                                      
 

9) ఆహారాన్ని బాగా నమలండి

                                                                                                 
 ఆహారం జీర్ణం కావడం మొదట నోటిద్వారా ప్రారంభమౌతుంది.  అందుకని ఆహారంలోని ఉత్తమ విలువలు శరీరానికి లభించాలంటే  ఆహారం  బాగా నమిలి మింగాలి. మన నోటిలో దంతాలు ఉన్నది లాలాజలం ఊరుతోంది ఇందు కోసమే అందుకే ఆహారం లాలాజలంలో కలిసి  జీర్ణమయ్యేందుకు సహాకరిస్తుంది. సో.. ఆహారం గబాగబా మింగేసి పరుగు పెట్టకుండా  పూర్తిగా  నమిలి తినండి అంటున్నారు వైద్యులు.

              
10) వొంటికి నలుగు                                                                                                                                

శరీరానికి బాగా అలసట వచ్చినప్పుడు  శరీరానికి మర్దనా చర్మానికి మర్దన జరగడం వల్ల లోపల రక్త ప్రసరణ సక్రమంగా సజావుగా జరుగుతుంది. చర్మాన్ని మర్దనా చేయడం వల్ల శరీరంలో ని లింఫ్ గ్రంధుల వ్యవస్త రీచార్జ్ అవుతుంది శరీరం లోపల ఉన్న విషపూరిత పదార్ధాలు త్వరగా విస్తరించి  దీని వల్ల శరీరానికి కిక్ ఇస్తుంది గేర్ వేసినా బండిలా మనిషి దూసుకు పోతాడు.                                                                                                                    
1 1 ) బరువు తగ్గండి                                                                                                            
 ఒళ్ళు చేయడం మంచిదే  అయితే ఒంటికి తగ్గబరువు ఉండాలి. అయితే వొళ్ళు  ఊబాకయంతో ఉంటే  త్వరగా అలిసిపోతారు. మరీ తక్కువ తిన్న కూడా అంతే జరుగుతుంది. అధికా శరీరాన్ని తగ్గించుకోడానికి తెలికైన మార్గం ఏమిటి  ఆహారంలో  గుజ్జు ప్రోటీన్లు కలిపి తీసుకోకూడదు.               ఉదాహరణకు ప్రోటీన్లతో కూడుకునివుండే   చేపలను స్ట్రాచ్ తో కూడుకుని ఉండే వరి అన్నంతో కలిపి ఒకేసారి  తీసుకోకూడదు. అందుకు బదులుగా చేపలను సలాడ్  తో కలిపి  లంచ్ టైంలో తీసుకుని సాయంత్రం వరి అన్నాన్ని కోరాగాయలతో కలిపి తీసుకోవాలి.                                                                                                                        
లేదంటే లంచ్ కింద ఆమ్లెట్ ని తీసుకుని  సప్పర్ కింద అన్నంలో  బంగాళాదుంప కూరని తీసుకోవచ్చు. ఈ రకం ఆహార పద్దతులల వల్ల జీర్ణం తేలికగా జరిగి  మీ బరువు మీ కంట్రోల్ లో ఉంటుంది. శరీరంలో ఉత్సాహం పుంజుకుంటుంది.                                

1 2 ) అవసర మైతే విటమిన్లు.                                                                                                                      
 మీకు మరీ నీరసంగా , అలసటగా ఉంటే డాక్టర్ సలహా మేరకు ఒక కోర్స్ కింద  విటమిన్ మాత్రలు వాడవచ్చు. ఏ విటమిన్ ఎలా తీసుకోవాలి వాటిని వాడాల వద్ద అనేది డాక్టర్ నిర్ణయించాలి. తప్ప మీకు మీ శరీరతత్వాన్ని బట్టి  మిత్రులా సలహా మేరకో, వేరొకరి సూచన మేరకో సొంత నిర్ణయంతో మాత్రలు .వాడొద్దు అవి ఒక్కోసారి వికటించడం లేదా తీవ్ర ఇబ్బందులు వస్తాయి ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించాలి.    

1 3 ) విటమిన్ బి                                                                                                                                    
 శరీరంలో శక్తి పుంజుకోవాలంటే విటమిన్లు బాగా దోహదపడతాయి. అలిసిన శరీరానికి బ్యాలెన్స్ తో కూడుకున్న  బి కాంప్లెక్స్  విటమిన్ ఎంతో మేలు చేస్తుంది. అలసటగా నీరసంగా అనిపించే వాళ్ళు మెగ్నీషియం విటమిన్ సి తో పాటు  బి కాంప్లెక్స్  కల మందులకోసం డాక్టర్ ను సంప్రదించాలి.                                                                                  

1 4 ) దీర్ఘ కాలం  దయిటింగ్  కు దూరంగా ఉండండి.                                                                                          
 బాగా లావుగా ఉన్నాను కాస్త డైటింగ్ చేయచ్చుగా. అని సలహా  ఇస్తే అదే పనిగా డైటింగ్ చేయడం వల్ల ముఖ్యంగా కొవ్వు తక్కువగా వుండే ఆహారాన్ని తీసుకుంటే చర్మం  పొడిబారడం  హార్మోన్ ఉత్పత్తి లోపించడం వల్ల థైరాయిడ్ , మేటాబాలిక్ డిజర్దార్లు  వస్తాయి హార్మోన్ ఉత్పత్తిలో సమాతూకం లేకుంటే స్త్రీలలో జననేద్రియంలో నీటి బుడగలు, సంతాన లేమివంటి సమస్యలు  కీళ్ళ నొప్పులు , అలసట, దీర్ఘకాలంతో  పాటు కొన్ని ఆనారోగ్య లక్షణాలు చోటు చేసుకుంటాయి.  సో సే నో టు డైటింగ్  ఏమంటారు ?                                                                                    

1 5 ) వర్రేలకు దూరంగా ఉండండి.                                                                                              
 ఆధునిక సమాజంలో అన్ని సమస్యలే  వరీలకు  వయస్సుతో సంబంధం లేదు. అయినా మన మనసును క్రుంగదీసే వత్తిళ్ళు ఒత్తిడి మనిషిని హరించివేస్తాయి. మీ ఆందోళనలు సమస్యలు  పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. ఎవరితో అయినా పంచుకుంటే ఆ భారం తగ్గుతుంది. అలా కాకుండా మీ మనసులోనే ఉంచుకుంటే  మానసికంగా కుంగిపోతారు, మామూలు అనారోగ్యానికి చికిత్సా  ఉందికానీ మానసిక అనారోగ్యానికి  చికిత్స లేదు.                                                            

1 6 ) నిదానంగాఘా డ  శ్వాస.                                                                                                                                
 ఒత్తిల్లతో కుంగిపోయే వాళ్ళు  శ్వాసను గాడంగా  తీసుకోకుండా  పై పైన గాలిని పీల్చుకుంటూ సరి పెట్టుకుంటారు. దీనిని హై పర్ వెంటివెంటి లేషన్  అంటారు. శ్వాసను ఇలా పై పైనే పీల్చుకోవడం వల్ల మీరు త్వరగా అలసటకు గురి అవుతారు.

అలాంటి వాళ్ళు అపుడప్పుడూ  గాడ శ్వాసనకు సంబంధించి ఈ క్రింద పేర్కొన్న బ్రీతింగ్ ఎక్సర్ సైజు ను చేస్తూ ఉండడం మంచిది. కడుపును లోపలి లాక్కుంటూ మీలోపల ఉన్న గాలినంతా ముక్కు ద్వారా బయటికినేట్టి వేయండి. తరువాత నేమ్మదిగా గాడంగా ముక్కు ద్వారా గాలిని లోపలి కి  పీల్చుకోవాలి ఇలా పీల్చుకున్నప్పుడు చాతి కదలకుండా వుండి. పొట్ట అలలా పై కి లేవాలి. మీ ఊపిరితిత్తుల నిండా గాలి నిండడానికి 1 ౦ సెకండ్ల సమయం పడుతుంది. తిరిగి గాలి మొత్తాన్ని బయటికి వదిలేస్తూ రిపీట్ చెయ్యాలి. ఈ ఎక్సర్ సైజు ను చేస్తున్నపుడు  మీరు పీల్చేగాలి కలుషితంగా ఉండకూడదు.                         

ముఖ్య గమనిక:-   సాధారణ అలసట విటమిన్ బి 1 2  లేక ఐరన్ లోఫంతో కూడుకున్న రక్త హీనత కారణంకావచ్చు. థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పనిచేయక పోవటమూ కారణం కావచ్చు  పైన చెప్పిన సూత్రాల్నిపాటిస్తూ కూడా మీలో అలసట , నీరసం పోకపోతే డాక్టరు ను సంప్రదించి పరీక్ష చేయించండి. ఇవే పండంటి ఆరోగ్యానికి 1 6 సూత్రాలు.   

వాల్నట్స్ తింటే ఈ వ్యాధులు అన్నీ మాయం..!

ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి.  ధర కాస్త ఎక్కువ అనే కారణంగా సాధారణ ప్రజలు వాల్నట్స్ కు దూరంగా ఉంటారు. అయితే వాల్నట్స్ ఆరోగ్యానికి చాలా బెస్ట్ అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.  వాల్నట్స్ ను తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు సులువుగా నయం  అవుతాయని అంటున్నారు. ఇంతకూ వాల్నట్స్ ను తినడం వల్ల తగ్గే వ్యాధులు ఏంటి? వాల్నట్స్ లో ఉండే పోషకాలు ఏంటి? తెలుసుకుంటే.. వాల్నట్స్ లో పోషకాలు.. వాల్నట్స్ లో  అత్యంత ప్రయోజనకరమైన పోషకాలు ఉంటాయి.  వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ , యాంటీఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి.  వాల్నట్స్ లో చాలా పోషకాలు ఉంటాయి. వాల్నట్స్ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుందని చాలామంది చెబుతారు. అయితే ఇది మాత్రమే కాకుండా చాలా రకాల వ్యాధులు కూడా నయం అవుతాయి. గుండె ఆరోగ్యం.. వాల్నట్స్ ను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందట.  అంతేకాదు ఇది చెడు కోలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుందట. రక్తపోటు.. రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడేవారు రోజు వాల్నట్స్ ను తీసుకుంటూ ఉంటే చాలా మంచిది.  రక్తపోటును నియంత్రించడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది. బరువు.. బరువు తగ్గడానికి ట్రై చేసేవారు వాల్నట్స్ తింటే చాలా మేలు. వాల్నట్స్ లో ఉండే ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు బరువు పెరగకుండా నిరోధిస్తాయి. తర్వాత బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. మానసిక ఆరోగ్యం.. మానసిక ఆరోగ్యం కోసం చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వాటితో పాటు వాల్నట్స్ ను కూడా తింటూ ఉంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది.  ఇది మెదడు పనితీరుకు అవసరమైన ఒమెగా-3 ఆమ్లాలను కలిగి ఉండటం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.  అలాగే అల్జీమర్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ.. జీర్ణవ్యవస్థ సరిగా లేకున్నా, జీర్ణాశయం పనితీరు మందగించినా చాలా సమస్యగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను సరిచేసి తిరిగి ఆరోగ్యంగా చేయడంలో వాల్నట్స్ కీలకపాత్ర పోషస్తాయి.  వాల్నట్స్ లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.  మలబద్దకాన్ని కూడా తగ్గిస్తుంది. వాపులు, నొప్పులు.. వాల్నట్స్ లో ఉంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ల7ణాలు వాపులను, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.  ఇవి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

గ్యాస్ సమస్యను పెంచే స్నాక్స్.. సాయంత్రం 6గంటల తర్వాత వీటిని అస్సలు తినకూడదు..!

సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. ఇంట్లో కుదరక పోతే కనీసం బయట అయినా స్నాక్స్ లాగించేవారు ఉంటారు. అయితే కొన్ని రకాల స్నాక్స్ ను సాయంత్రం 6గంటల తర్వాత అస్సలు తినవద్దని చెబుతున్నారు ఆహార నిపుణులు.  దీని వల్ల గ్యాస్ సమస్య ఎక్కువ అవుతుందని,  రాత్రంతా గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉండాల్సిందే అని అంటున్నారు. ఇంతకీ సాయంత్రం 6 గంటల తర్వాత తినకూడని స్నాక్స్ ఏంటో తెలుసుకుంటే.. సాయంత్రం 6 గంటల తర్వాత కొన్ని స్నాక్స్ తినకూడదని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్లు చెబుతున్నారు.  సమోసాలు, జిలేబీలు, పానీపురి, వడ పావ్, కచోరీలు, వేయించిన మోమోలు,  నామ్కీన్‌లను సాయంత్రం 6 గంటల తర్వాత తినకూడదట. ఎక్కువ బటర్ తో కూడిన  బర్గర్‌లు, పావ్ భాజీలు కూడా సాయంత్రం 6 తరువాత తినకూడదని అంటున్నారు. పైన చెప్పుకున్న  ఆహారాలను అప్పుడప్పుడు తినడం వల్ల ఏమీ కాదని అనుకుంటారు. కానీ అప్పుడ్పుడు తినడం అనేది అలవాటు అయితే చాలా కష్టమట.  ఈ అలవాటు శరీరానికి ఎక్కువ కేలరీలు, కొవ్వు,  చక్కెరను ఇస్తాయి. ఇది బరువు పెరగడం, గ్యాస్, ఎసిడిటీ,  రక్తంలో  చక్కెర స్థాయిలు పెరగడం వంటి సమస్యలకు దారితీస్తుంది. వేయించిన ఆహారాలు,  టైప్ 2 డయాబెటిస్ మధ్య సంబంధం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. వేయించిన ఆహారాలు తినేవారిలో రక్తంలో చక్కెర నియంత్రణ తక్కువగా ఉంటుంది.  ఇన్సులిన్ నిరోధకత కూడా పెరిగే ప్రమాదం ఉంది. వేయించిన ఆహారాలు పేగు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. మంచి బ్యాక్టీరియాను తగ్గిస్తాయి, వాపును పెంచుతాయి.   ఆకలిని, షుగర్ క్రేవింగ్స్ ను నియంత్రించే హార్మోన్లు కూడా తగ్గుతాయి.  దీని వల్ల వీటిని పదేపదే తినాలని అనిపిస్తుంది. ఇది బరువు పెరగడానికి కూడా కారణం అవుతుందట. కాబట్టి  పైన పేర్కొన్న ఆహారాలను అప్పుడప్పుడు తినడం కూడా కాస్త ఇబ్బందే. అలాగే కొన్ని ఆహారాలను 6 గంటల తర్వాత అస్సలు తినకూడదు కూడా.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

రోజూ బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ తింటున్నారా?.. అయితే ఈ నిజం తెలుసుకోండి!

నేటికాలంలో ఆహారం పరంగా చాలా మార్పులు వచ్చాయి.  ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్   తప్పనిసరి. అయితే చాలా కుటుంబాలలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ, పిల్లలను స్కూలుకు పంపిస్తూ చాలా బీజీగా ఉంటారు. ఇలాంటి సమయంలో టిపిన్, వంట అన్నీ తీరికగా చేసే సమయం ఉండదు. ఇలాంటి వారిలో కొందరు బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్, శాండ్విచ్ వంటివి తీసుకుంటారు. దీని కోసం వైట్ బ్రెడ్,  బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు.  ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు.  అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు. ప్రతిరోజూ బ్రెడ్ ను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకునేవారిలో కొన్ని తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయట.  ఇంతకీ అవేంటంటే?.. డయాబెటిస్ వైట్ బ్రెడ్ లో  గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. దీన్ని రోజూ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది . ఇది శరీర ఇన్సులిన్ సమతుల్యతను  దెబ్బతీస్తుంది. బరువు  బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి  బ్రెడ్  అతిపెద్ద శత్రువు. ఇందులో కేలరీలు,  కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి, కానీ ఫైబర్ ఉండదు. దీన్ని తినడం వల్ల  త్వరగా కడుపు నిండదు. ఇది అతిగా తినడం వల్ల శరీరంలో  అధిక కొవ్వు పేరుకుపోతుంది. జీర్ణక్రియ  బ్రెడ్ ను మైదా పిండితో తయారు చేస్తారు. ఇది ప్రేగులలో జిగట పదార్థంగా పనిచేస్తుంది. ఫైబర్ లేకపోవడం వల్ల ఇది  జీర్ణం కావడం చాలా కష్టం. రోజూ బ్రెడ్ తినడం వల్ల తరచుగా మలబద్ధకం,  ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. పోషకాలు గోధుమలలో ఉండే సహజ పోషకాలన్నీ తొలగిపోయాక మిగిలే పిండితో బ్రెడ్ తయారు చేస్తారు. ఈ పిండిలో ఎలాంటి పోషకాలు ఉండవు. ఇందులో చాలా తక్కువ విటమిన్లు, ఖనిజాలు,  ప్రోటీన్లు ఉంటాయి.  బ్రెడ్ తినడం ద్వారా  శరీరానికి కావలసిన పోషకాలు ఏవీ లభించవు.   ఈ కారణంగా బ్రెడ్ తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాహార లోపం ఏర్పడుతుంది. గుండె ఆరోగ్యం మార్కెట్లలో అమ్మే  బ్రెడ్‌లు ఎక్కువసేపు తాజాగా ఉంచడానికి చాలా ప్రిజర్వేటివ్‌లు,  ఉప్పు  వేసి తయారు చేస్తారు. వీటిలో  అధిక సోడియం ఉంటుంది. ఇది రక్తపోటు పెంచుతుంది.  ఎక్కువ కాలం బ్రెడ్ ను కంటిన్యూగా తీసుకుంటూ ఉంటే అది గుండె జబ్బులకు దారితీస్తుంది. -రూపశ్రీ

ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం మంచిదా కాదా? వైద్యులు  చెప్పిన షాకింగ్ నిజాలు ఇవీ..!

చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా ఉండటానికి, రోజంతా చురుగ్గా ఉండటానికి.. బరువు తగ్గడానికి.. శరీరంలో టాక్సిన్లు బయటకు పోవడానికి..  ఇలా ఒక్కొక్కరు ఒక్కో బెనిఫిట్ కోసం ఉదయాన్నే నిమ్మకాయ రసం నీరు తాగుతారు.  అయితే ఈ అలావాటు మంచిదేనా కాదా.. దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారు? తెలుసుకుంటే.. రోజూ నిమ్మకాయ నీరు.. వైద్యుల అభిప్రాయం.. నిమ్మకాయ నీరు  క్రమం తప్పకుండా తాగేవారు ఇది చాలా ఆరోగ్యకరమైన అలవాటు అని అనుకుంటారు. కానీ  ప్రతిరోజూ ఉదయం నిమ్మకాయ నీరు  తాగడం వల్ల  శరీరంలోని ముఖ్యమైన అవయవమైన మూత్రపిండాలకు చాలా పెద్ద  నష్టం కలుగుతుందని అంటున్నారు. ఎక్కువ కాలం ఈ నీరు తాగేవారికి మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని అంటున్నారు. మూత్రపిండాల వైద్యులు ఏం చెప్తున్నారు? చాలా మంది ప్రముఖ నెఫ్రాలజిస్టులు (నెఫ్రాలజిస్టులు అంటే మూత్రపిండ వ్యాధులకు ట్రీట్మెంట్ ఇచ్చే స్పెషలిస్ట్ లు.) శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను దెబ్బతీసే ఏదైనా అలవాటు మూత్రపిండాలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుందని అంటున్నారు.   ఎలక్ట్రోలైట్ అంటే..  పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం క్లోరైడ్,  బైకార్బోనేట్ వంటి వివిధ రకాల ఖనిజాలు ఉంటాయి. వీటిని ఎలక్ట్రోలైట్లు అని అంటారు.  ఈ ఖనిజాలు శరీరానికి గణనీయమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ఖనిజాలను  వివిధ పానీయాల నుండి పొందుతారు. నాడీ వ్యవస్థ నుండి  గుండె పనితీరుతో సహా వివిధ శారీరక విధులను నియంత్రించడంలో అవి కీలకంగా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన మూత్రపిండాలు కావాలంటే రక్తంలో ఎలక్ట్రోలైట్లు సమతుల్యంగా ఉండాలి. ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత.. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఉంటే, మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది.  మూత్రపిండాల మీద ఒత్తిడి పడుతుంది. ఈ అసమతుల్యత అనేక తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుంది, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అంతేకాదు.. ఎలక్ట్రోలైట్లు లేకపోవడం వల్ల  తలనొప్పి, గుండె లయ  గందరగోళంగా ఉండటం,  కండరాల బలహీనత వంటి సమస్యలు వస్తాయి.  అందుకే ఉదయాన్నే నిమ్మకాయ నీరు ఎక్కువ కాలం కంటిన్యూగా తాగడం చేస్తుంటే అది మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని మూత్రపిండ వైద్యులు చెబుతున్నారు.                               *రూపశ్రీ.

ప్రతిరోజూ చికెన్ తింటున్నారా? ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి..!

  సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు.. ఇతర మాంసాలతో పోలిస్తే  జీర్ణం కావడానకి కూడా తేలికగా ఉంటుంది.  చికెన్ లేకుండా భోజనం చేయలేని వారు చాలామంది ఉంటున్నారు.  ముక్క లేకపోతే ముద్ద దిగదు అని చాలా గొప్పగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే రోజూ చికెన్ తినేవారికి చాలా పెద్ద షాకింగ్ న్యూస్.  రోజూ చికెన్ తినడం వల్ల జరిగేదేంటో వివరంగా చెప్పేశారు ఆరోగ్య నిపుణులు. దీని గురించి తెలుసుకుంటే.. వైద్యులు చెప్పేదాన్ని బట్టి కడుపు క్యాన్సర్ మెల్లిగా పెరుగుతూ వస్తుంది.  ఆహారపు అలవాట్లు క్యాన్సర్ కు కారణం అవుతాయని అంటున్నారు. ముఖ్యంగా చికెన్ ను రెగ్యులర్ గా ఎక్కువ రోజులు తినడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుందని చెబుతున్నారు.  చికెన్ ను ఎలా వండుతున్నారనేది చాలా ముఖ్యమని చెబుతున్నారు. అధికంగా చికెన్ తినడం వల్ల కడుపు,  పేగు సమస్యలతో పాటు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, చికెన్ తినడం వల్ల మాత్రమే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వస్తుందని కాదు. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కు చికెన్ రెగ్యులర్ గా తినడం కూడా కారణం అవుతుందని చెబుతున్నారు. కేవలం చికెన్ మాత్రమే కాకుండా ఒకే ఆహారాన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల ఇతర ఆహారాల నుండి లభించాల్సిన చాలా పోషకాలు లోపిస్తాయని. దీని వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా ఒకే ఆహారాన్ని ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల కడుపు లోపల సహజంగా ఉండే రక్షణ పొర బలహీనం అవుతుందని చెబుతున్నారు. రోజూ చికెన్ తినడం, అది కూడా బయట తినడం, వేయించిన చికెన్,  లేదా వేయించిన ఆహారాలు,  బయటి ఆహారాలు తినడం, తక్కువగా కూరగాయలు తీసుకోవడం వంటి ఆహారపు అలవాట్ల వల్ల క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. చికెన్ తింటే క్యాన్సర్ ఎలా వస్తుంది? శాకాహారాలతో పోలిస్తే చికెన్ జీర్ణం అవడం కాస్త కష్టం. రోజూ చికెన్ తినడం వల్ల జీర్ణాశయం మీద ఒత్తిడి ఎక్కువ పడుతుంది. అధికంగా నూనె లేదా కారం వంటివి తిన్నప్పుడు కడుపులోపలి పొరకు మంట కలుగుతుంది. దీని వల్ల వెంటనే సమస్య కనిపించకపోయినా ఎక్కువ కాలం కంటిన్యూగా చికెన్ తింటే కడుపు లోపలి రక్షణ పొర దెబ్బతింటుంది. మరీ ముఖ్యంగా ఎక్కువ మంట మీద వండిన చికెన్ ను, ఎక్కువ మసాలాలు, ఎక్కువ నూనెతో తయారు చేసిన చికెన్ ను రెగ్యులర్ గా తీసుకుంటే హెటెరోసైక్లిక్ అమైన్స్ అనే హానికరమైన రసాయనాలు ఏర్పడతాయి. ఈ పదార్థాలను చాలా కాలం పాటు పదే పదే తీసుకుంటే, అవి కణాలను దెబ్బతీస్తాయి. కాబట్టి రోజూ చికెన్ తినేవారు.. దాన్ని ఎలా వండుతున్నారు, ఎలా తింటున్నారు అనే విషయాన్ని గమనించుకోవాలి.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని ప్యాక్ చేస్తున్నారా? ఈ నష్టాలు తెలుసా?

అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది. అంతే కాకుండా ఆహారాన్ని వేడి చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు.  ఆహారాన్ని ప్యాక్ చేయడానికి, వంట చేయడానికి, ఆహారాన్ని తిరిగి వేడి చేయడానికి ఇలా చాలా రకాలుగా సిల్వర్ పాయిల్ వాడతారు. అయితే ఇన్ని రకాలుగా ఉపయోగించే సిల్వర్ ఫాయిల్ ఆరోగ్యానికి చాలా చేటు చేస్తుందని తెలుసా? అందరూ సిల్వర్ ఫాయిల్ వల్ల ఎన్ని ఉపయోగాలో అనుకుంటారు. కానీ సిల్వర్ పాయిల్ ను వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా నష్టాలు కూడా ఉన్నాయి. అసలు సిల్వర్ ఫాయిల్ ను ఎందుకు వాడకూడదు? సిల్వర్ ఫాయిల్ వాడటం వల్ల కలిగే నష్టాలేంటి? తెలుసుకుంటే.. అల్యూమినియం ఫాయిల్ ఎందుకు ప్రమాదం.. అల్యూమినియం ఫాయిల్ లో వేడి ఆహారం లేదా నిమ్మకాయ,  టమోటా లేదా స్పైసీ సాస్ వంటి ఆమ్ల గుణాలు ఉన్న పదార్థాలను ప్యాక్ చేసినప్పుడు అందులో మైక్రోస్కోపిక్ అల్యూమినియం కణాలు ఆహారంలోకి విడుదల అవుతాయి. ఆమ్ల గుణం ఉన్న పదార్థాలు వాడినప్పుడు ఇలా విడుదల అయ్యే తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. దీని వల్ల అల్యూమినియం శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరంలో సాధారణ స్థాయిల కంటే ఎక్కువ అల్యూమినియం ఉన్నప్పుడు అది తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. అల్యూమినియం ఫాయిల్ వాడటం వల్ల కలిగే నష్టాలు.. మెదడు, నాడీ వ్యవస్థ.. అల్యూమినియం ఒక న్యూరోటాక్సిన్. అంటే ఇది నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. శరీరంలో అల్యూమినియం అధిక స్థాయిలో ఉండటం వల్ల మెదడు కణాలపై ప్రభావం పడుతుంది. మెదడులో అల్యూమినియం పేరుకుపోవడం వల్ల  అల్జీమర్స్ వ్యాధి వంటి న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల ప్రమాదం పెరగడం జరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎముకలు, మూత్రపిండాలు.. శరీరంలో అల్యూమినియం అధికంగా చేరడం వల్ల కాల్షియం,  ఫాస్ఫేట్ శోషణకు ఆటంకం కలుగుతుంది. ఇది ఎముక సాంద్రత తగ్గడానికి దారితీస్తుంది.  ఇది ఎముక బలహీనతకు దారితీస్తుంది. మూత్రపిండాల ప్రాథమిక విధి శరీరం నుండి అదనపు అల్యూమినియంను తొలగించడం. కానీ అధిక అల్యూమినియం మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుంది. వేడి, ఆమ్ల ఆహారం.. అల్యూమినియం లీచింగ్ అనేది ఉష్ణోగ్రత,  ఆహారం  స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. నిమ్మకాయ, టమోటా,  వెనిగర్ వంటి వేడి ఆహారం లేదా ఆమ్ల ఆహారాలను ఫాయిల్‌లో ప్యాక్ చేసినప్పుడు అల్యూమినియం కణాలు ఆహారంలోకి వేగంగా లీచింగ్ అవుతాయి. వంట కోసం ఫాయిల్ ఉపయోగించినప్పుడు కూడా ఈ లీచింగ్ తీవ్రమవుతుంది. ప్రత్యామ్నాయాలు.. అల్యూమినియం ఫాయిల్‌కు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా గాజు, సిరామిక్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్‌లను ఉపయోగించాలి. ఫాయిల్ తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తే, చల్లని,  పొడి ఆహారాన్ని మాత్రమే ప్యాక్ చేయడం మంచిది.  ఆమ్ల ఆహారాలను అల్యూమినియం ఫాయిల్ తో డైరెక్ట్ గా టచ్ చేయకూడదు.  మరీ ముఖ్యంగా ఎల్లప్పుడూ ఫుడ్-గ్రేడ్ బటర్ పేపర్‌ను ఉపయోగించాలి. ఆ తరువాత దాన్ని సిల్వర్ పాయిల్ లో ప్యాక్ చేయాలి.                            *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఉప్పు ఎక్కువ తినకపోయినా బీపి ఎక్కువ ఉంటుందా? అసలు నిజం ఇదే..!

ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు. అయినప్పటికీ వారి బీపి నార్మల్ గా కాకుండా ఎక్కువగా ఉంటుంది.  భారతదేశంలో ప్రతి ముగ్గురు వ్యక్తులలో ఒకరు హై బీపి తో బాధపడుతున్నారని ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. అసలు ఆహారంతో తక్కువ ఉప్పు తీసుకున్నా బీపి ఎందుకు ఎక్కువ ఉంటుంది? అసలు శరీరంలో సోడియం పెరిగితే ఎందుకు ప్రమాదంగా మారుతుంది? ఆరోగ్య నిపుణులు  ఏం చెబుతున్నారు తెలుసుకుంటే.. ఉప్పు డేంజర్ ఇందుకే.. ఉప్పులోని సోడియం శరీరంలో నీటిని నిలుపుకుంటుంది. ఇది రక్త నాళాలలో ఒత్తిడిని పెంచుతుంది.  దీని కారణంగా గుండె కష్టపడి పనిచేయవలసి వస్తుంది. సోడియం ఎక్కువ కాలం శరీరంలో ఎక్కువగా ఉంటే రక్త నాళాలు దెబ్బతింటాయి.  గుండెపోటు, స్ట్రోక్, గుండె వైఫల్యం,  మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.  అన్నింటికంటే షాకింగ్ పాయింటే ఏంటంటే.. ఎక్కువ ఉప్పు తింటున్నాం అనే విషయం తెలియకుండానే శరీరంలోకి అధిక ఉప్పు వెళ్లిపోతుంది.  దీన్ని చాలామంది తెలియకుండానే చేస్తారు. బ్రెడ్, బన్.. బేకరీ.. రోజూ బ్రెడ్ లేదా బన్   వంటివి తినేవారు చాలామంది ఉంటారు.  ఇవి ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు.  మరీ ముఖ్యంగా చాలామంది మల్టిగ్రైన్ బ్రెడ్,  బ్రౌన్ బ్రెడ్ వంటివి ఆరోగ్యానికి చాలామంచివి అనుకుంటారు.  కానీ ఈ బ్రెడ్ లేదా బన్ లు  శరీరానికి చాలా సోడియంను అందిస్తాయి. అలాగే బేకరీలలో లభించే ప్రతి ఆహార పదార్థంలో చాలా సోడియం,  సుగర్ ఉంటాయి.  ఇవి మాత్రమే కాకుండా బయట ప్యాకెట్స్ లో లభించే స్నాక్స్, బిస్కెట్స్,  చిప్స్ వంటి ఆహారాలలో సోడియం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇంట్లో వండే ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకున్నా,  బయటి ఆహారాల ద్వారా సోడియం ఎక్కువగా శరీరంలోకి వెళుతుంది. వీటిలో చాలా ఎక్కువ.. టొమాటో కెచప్, సోయా సాస్, చిల్లీ సాస్, శాండ్‌విచ్ స్ప్రెడ్‌లు,  ప్యాక్ చేసిన చట్నీలు,  ఏడాది పాటు నిల్వ ఉంచే భారతీయ సాంప్రదాయ పచ్చళ్లు..   వీటి షెల్ఫ్ లైఫ్‌ను పెంచడానికి ఉప్పు ఎక్కువ జోడి్స్తారు. వీటిని ఎంత తక్కువ మొత్తంలో తీసుకున్నా సరే.. శరీరంలోకి వెళ్లే సోడియం మాత్రం ఎక్కువగా  ఉంటుంది. అదేవిధంగా చిప్స్, భుజియా, సాల్టీ మిక్స్‌లు, క్రాకర్లు,  బేక్ చేసిన లేదా తేలికగా సాల్టెడ్ స్నాక్స్‌లో కూడా ఎక్కువ  మొత్తంలో ఉప్పు ఉంటుంది. ఇవి తిన్నప్పుడు ఉప్పు ఎక్కువ ఉన్నట్టు అనిపించవు. అందుకే తెలియకుండానే తినేస్తారు. చీజ్ ముక్కలు, చీజ్ స్ప్రెడ్‌లు,  ఫ్లేవర్డ్ బటర్ లో  కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తక్కువ మొత్తంలో తీసుకున్నా చాలు.. శరీరంలో సోడియం పెరుగుతుంది.   అది విదంగా రెడీ టూ ఈట్ ఫుడ్స్ లో రుచి కోసం,  టెక్చర్ కోసం  కోసం ఎక్కువ ఉప్పును వాడతారు. నిమిషాలలో రెఢీ అయ్యే ఆహారాలలో కూడా ఉప్పు తో పాటు చాలా రకాల ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఇవన్నీ కలిపి శరీరంలో సోడియం స్థాయిలను పెంచుతాయి.   కాబట్టి ఆహారంలో ఉప్పు అంటే కేవలం ఇంట్లో వండే ఆహారం గురించే కాదు.. బయట నుండి తీసుకునే ఆహారం గురించి కూడా ఆలోచించాలి. వీటితో జాగ్రత్తగా ఉంటే సోడియం స్థాయిలు కూడా తగ్గి బీపి తగ్గుముఖం పడుతుంది.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఆరోగ్యానికి మంచిది కదా అని పల్లీలు తెగ తినేస్తుంటారా? ఈ నష్టాలు తప్పవు..!

ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు, ప్రోటీన్ ఉంటాయి. వీటిని పేదవారి బాదం అని అంటారంటే వీటిలో ఎన్ని పోషకాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.  అయితే అతి సర్వత్ర వర్జయేత్ అనే మాటకు తగ్గట్టు పల్లీలు అయినా సరే.. ఎక్కువగా తినడం చాలా చెడ్డదని ఆహార నిపుణులు అంటున్నారు. రుచిగా ఉంటాయి కదా అని పల్లీలను అతిగా తింటే.. ఆరోగ్యానికి మేలు చేయకపోగా చేటు చేస్తాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా పల్లీలు అంటే తెగ ఇష్టపడేవారు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి.  పల్లీలను ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుంటే.. బరువు.. పల్లీలు అతిగా తింటే బరువు కూడా అతిగా పెరుగుతారట.  పల్లీలలో కేలరీలు, కొవ్వులు అధికంగా ఉంటాయి.  100గ్రాముల పల్లీలలో దాదాపు 567కేలరీలు ఉంటాయట.  ఎక్కువగా పల్లీలు తింటూ ఉంటే కేలరీలు కూడా పెరిగి బరువు పెరగడం కూడా వేగంగా జరుగుతుందట. జీర్ణ సమస్యలు.. పల్లీలు వేడి కలిగించే గుణం కలిగి ఉంటాయి. వీటిలో ఫైటేట్ లు ఉంటాయి.  పల్లీలు ఎక్కువగా తింటే ఉబ్బరం,  గ్యాస్,  కడుపులో యాసిడ్ ఫీలింగ్,  గుండెల్లో మంట వంటివి పెరుగుతాయి. పోషకాలు.. వేరుశనగలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే పోషకాల శోషణకు ఆటంకం కూడా కలుగుతుంది. ముఖ్యంగా వీటిలో పైటిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది.  దీన వల్ల శరీరంలో ఐరన్,  జింక్ లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎన్ని తినాలి.. ఆరోగ్య నిపుణులు,  ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు ఒక గుప్పెడు పల్లీలు తినడం మంచిది.  అంతకంటే ఎక్కువ తినడం వల్ల పైన చెప్పుకున్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఈ చిన్న అలవాట్లే మానసిక ఆరోగ్యానికి శ్రీరామ రక్ష..!

శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు.  మానసికంగా బలంగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే ఆఫీసు ఒత్తిడులు,  జీవిత సమస్యలు, లక్ష్యాలు చేరుకోవడంలో పడే సంఘర్షణ.. ఇలా ఒకటేమిటి.. చాలా విషయాలు మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.  కానీ కొన్ని సాధారణ అలవాట్లు మానసిక ఆరోగ్యానికి శ్రీరామ రక్షలా పనిచేస్తాయి.  ఇంతకీ ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. కృతజ్ఞత.. కృతజ్ఞత భావం మనిషిని చాలా స్వచ్చంగా ఉంచుతుంది.  ప్రతి వ్యక్తి మొదటగా గడిచే ప్రతి రోజు పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి.  రోజు తన జీవితంలో జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకోవాలి.  ఇలా చేస్తే చాలా పాజిటివ్ మైండ్ సెట్ అలవాటు అవుతుంది. ఇది మానసికంగా బలంగా ఉండటానికి సహాయపడుతుంది. వ్యాయామం.. శరీరంలో ఒత్తిడి హార్మోన్ తగ్గడానికి వ్యాయామం మంచి మార్గం.  ప్రతి రోజూ 20 నుండి 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి.  ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. శ్వాస వ్యాయామం.. శారీరక వ్యాయామమే కాకుండా మానసికంగా దృఢంగా ఉండటానికి శ్వాస వ్యాయామాలు కూడా చాలా బాగా సహాయపడతాయి. రోజూ కొన్ని నిమిషాలు శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది.  ఒత్తిడి కూడా తగ్గుతుంది. శ్రద్ద.. ఏ పని మీద అయినా దృష్టి పెట్టడాన్నే మైండ్ ఫుల్ నెస్ అని అంటున్నారు.  ఇంటి పని చేసినా,  వ్యాయామం చేసినా, ఆహారం తీసుకున్నా, ఆఫీసు పని చేసినా.. ఇలా ప్రతి పని చేసినప్పుడు ఆ పని మీద పూర్తిగా మనసు లగ్నం చేయాలి. ఇందుకోసం ధ్యానం చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. ఇలా చేయడం వల్ల మెయింటైన్ స్కిల్స్ మెరుగవుతాయి. ప్రకృతి.. మనిషిలో ఒత్తిడిని తగ్గించే సూపర్ మెడిసిన్ ఏదైనా ఉందంటే అది ప్రకృతి.  తాజా గాలిలో,  సూర్యరశ్మిలో సమయం గడపడం,  మొక్కలు,  చెట్లు,  పక్షులు,  జంతువుల సమక్షంలో సమయాన్ని గడపడం వల్ల ఒత్తిడి తగ్గి మానసికంగా దృఢంగా మారతారు. మనసు విప్పడం.. ఎలాంటి విషయాలు అయినా కొందరితోనే మనసు విప్పి మాట్లాడగలుగుతారు.  వారిలో స్నేహితులు,  బంధువులు,  ఆత్మీయులు ఇట్లా చాలా ఉంటారు. అయితే ఎవరి దగ్గర ఏదైనా చెప్పుకోగల చనువు ఉంటుందో వారితో ఓపెన్ గా మాట్లాడాలి. దీనివల్ల చాలా విషయాలలో మంచి సలహాలు దొరకడమే కాకుండా క్లిష్ట పరిస్థితులలో మంచి సపోర్ట్ కూడా దొరుకుతుంది. బంధాలు.. స్నేహం అయినా, ప్రేమ అయినా,  వైవాహిక బంధం అయినా, కొలీగ్స్ తో పరిచయం అయినా.. వారితో ఉండే రిలేషన్ పదే పదే తెగిపోతూ ఉంటే అది మానసిక సమస్యలకు దారి తీస్తుంది.  అందుకే బంధాలను కాపాడుకోవాలి.  ఎక్కువకాలం బంధాలు నిలిచి ఉండేలా చూసుకోవాలి. ఎమోషనల్ గా బంధాలతో కనెక్ట్ అయి ఉండాలి. నచ్చిన పని.. మానసికంగా బాగుండాలంటే అన్నింటి కంటే ముఖ్యమైనది నచ్చిన పని చేయడం. చాలా వరకు ఇతరుల సలహాలు,  ఇతరుల కమాండింగ్ మీద చాలా మంది పని చేస్తూ ఉంటారు. కానీ నచ్చిన పని చేయడంలో చాలా తృప్తి ఉంటుంది. ఇది మానసికంగా బలంగా ఉంచుతుంది. ఆత్మ విమర్శ.. ప్రతి రోజూ పడుకునే ముందు ఉదయం నుండి జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకోవాలి.  ముఖ్యంగా మంచి విషయాలను గుర్తు చేసుకోవడం వల్ల చాలా పాజిటివ్ మైండ్ అలవాటు అవుతుంది. పాజిటివ్ మైండ్ ఉంటే అది మానసిక ఆరోగ్యాన్ని కూడా బలంగా ఉంచుతుంది.                                  *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

డయాబెటిక్ ఫుడ్స్.. ఈ ఆహారాలు తింటే చాలా ఈజీగా షుగర్ వచ్చేస్తుంది..!

రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం.   కేవలం తీపి పదార్థాలు,  స్వీట్లు, పంచదార వంటివి తినడమే డయాబెటిస్ కు కారణం అనుకుంటే పొరపడినట్టే.. రోజువారీ ఆహారపు అలవాట్ల మీద డయాబెటిస్ ముడిపడి ఉంటుందని వైద్యులు అంటున్నారు. రోజు వారి తీసుకునే కొన్ని ఆహారాలు.. ఇవి ఏం చేస్తాయి లే అనుకునే పదార్థాలు టైప్-2 డయాబెటిస్ కు కారణం అవుతాయని అంటున్నారు వైద్యులు.  ఈ ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల డయాబెటిస్ ఈజీగా వస్తుందట. డయాబెటిస్ కు కారణమయ్యే ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. డీప్ ఫ్రైడ్ స్నాక్స్.. సమోసాలు, పకోడాలు,  చిప్స్  ఇవన్నీ చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు చాలా ఇష్టమైన స్నాక్స్.  కానీ ఈ ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వు క్రమంగా శరీరంలో పేరుకుపోతుంది.  బరువు పెరగడానికి దారి తీస్తుంది. బరువు పెరగడం  ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది, ఇది టైప్ 2 డయాబెటిస్‌కు ప్రధాన కారణం. ఫాస్ట్ ఫుడ్‌లో ఉపయోగించే నూనెను  పదే పదే వేడి చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్ ఏర్పడుతుంది. ఇది రక్తంలో చక్కెరను మరింత పెంచుతుంది. మార్కెట్ ఫుడ్స్.. మార్కెట్లో అమ్మే గ్రానోలాతో పాటు  అనేక బ్రేకఫాస్ట్  తృణధాన్యాలు ఆరోగ్యకరమైనవని అనుకుంటారు.   కానీ వాటిలో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది.  గ్రానోలా బార్‌లు, ఓట్ బార్‌లు,  రెడీ టూ ఈట్ ఫుడ్స్ లో చాలా ఎక్కువ మొత్తంలో చక్కెరలు ఉంటాయి. వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వేగంగా పెరుగుతాయి. ప్రాసెస్డ్ మీట్.. సాసేజ్, బేకన్,  సలామీ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో సోడియం,  నైట్రేట్లు అధికంగా ఉంటాయి.  ఇవి గుండెకు హాని చేయడమే కాకుండా   డయాబెటిస్‌కు నేరుగా కారణం అవుతాయి. ప్రాసెస్ చేసిన మాంసాలు వాపును పెంచుతాయి,  జీవక్రియను నెమ్మదిస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడం కష్టతరం చేస్తాయి. డ్రింక్స్.. శీతల పానీయాలు,  ప్యాక్ చేసిన సోడాలలో చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక సోడా డ్రింక్ లో  ఉండే చక్కెర పరిమాణం కొన్ని  రోజులు తీసుకునే నేచురల్  చక్కెర కంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పానీయాలు వెంటనే రక్తంలో గ్లూకోజ్‌ను పెంచుతాయి.  క్లోమంపై  ఒత్తిడిని ఎక్కువగా  కలిగిస్తాయి. ఇలాంటి డ్రింక్స్ తీసుకున్న ప్రతి  సారి  శరీరం అదనపు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇది కాలక్రమేణా ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. రిపైండ్ ఫ్లోర్,  బ్రెడ్.. తెల్ల బ్రెడ్, బన్స్, కుకీలు,  నాన్ వంటి ఆహారాలు మైదాతో తయారు చేస్తారు. ఈ ఆహారాలలో గ్లూకోజ్ చాలా త్వరగా విచ్చిన్నమవుతుంది. ఈ రిఫైండ్ ఫ్లోర్ లో  ఫైబర్ ఉండదు.  దీని వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల శరీరం రక్తంలో చక్కెర సమతుల్యతను కాపాడుకోవడానికి కష్టపడి పనిచేయవలసి వస్తుంది. ఈ అలవాటు క్రమంగా మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. వైట్ రైస్.. తెల్ల బియ్యం భారతీయ ఆహారంలో ముఖ్యమైన భాగం. కానీ ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే.  ఇది తిన్న తర్వాత గ్లూకోజ్‌గా మారుతుంది. ఇది నేరుగా రక్తంలో చక్కెరను పెంచుతుంది. రోజూ పెద్ద మొత్తంలో తెల్ల బియ్యం తినడం వల్ల బరువు పెరగడం,  రక్తంలో చక్కెర నియంత్రణ బలహీనపడటం జరిగి, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా చాలా పాలిష్ పట్టిన బియ్యంతో వండే అన్నం ఎక్కువ తినడం మానేయాలి.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...