10 నిమిషాల్లో 10 ఈ జీవోలు

 

సమయం తక్కువగా ఉండటం కేంద్ర నిధులు కీలకం కావడంతో హైకోర్టు రద్దు చేసిన జీవో స్థానంలో కోర్టు సూచనల మేరకే 50శాతానికి పరిమితమవుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం ర‌హ‌స్య‌ జీవోలు జారీ చేసింది. ఈ జీవోలను కాన్ఫిడెన్షియల్ జీవోలుగా పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.

రాష్ట్ర ప్ర‌భుత్వం బీసీ రిజర్వేషన్లను కుదిస్తూ కొత్త రిజర్వేషన్లను 50శాతానికి ఖరారు చేసింది. అయితే దీనిని జీవో ద్వారా లేదా ఆర్డినెన్స్ ద్వారా అమల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. అయితే ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం పొందటం కోసం సమయం పట్టే అవకాశం ఉంది. మ‌రో వైపు ఆర్డినెన్స్ పైన బీసీ సంఘాలు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.

న్యాయపరంగా చిక్కులు లేకుండా ఉండటానికే ఈ జీవోలు పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో లేకుండా చేశారు.

బుధ‌వారం సాయంత్రానికి 13 జిల్లాల్లోను రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. అవి కలెక్టర్ల నుంచి ప్రభుత్వానికి అందగానే ఎన్నికల సంఘానికి నివేదిస్తారు.

ఈనెల 27కల్లా ఎన్నికలు పూర్తి చేసుకుని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

Teluguone gnews banner