జగన్ పార్టీలో చేరిన మోపిదేవి కుటుంబం
posted on Jul 5, 2013 @ 2:28PM
జగన్ అక్రమాస్తుల కేసులో నిందుతుడిగా చంచల్ గూడ జైలులో వున్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. వైఎస్ విజయమ్మ సమక్షంలో మోపిదేవి సోదరుడు హరనాథ్ బాబు, కుమారుడు రాజు, మాజీ మండలాధ్యక్షుడు వాసుదేవలతో సహా రేపల్లె నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, పట్టణంలోని కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి వైఎస్ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరిని విజయమ్మ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ జిల్లా అద్యక్షుడు మర్రి రాజశేఖర్, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కాపాడుతుందన్న భావంతో ఇంతకాలం ఎదురుచూసిన వారికీ నిరాశ ఎదురుకావడంతో జగన్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి రేపల్లె నుంచి మోపిదేవి అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి హాజరుకావడం విశేషం.