టీడీపీ, బీజేపీ పొత్తు: ఫ్రస్టేషన్‌లో టీఆర్ఎస్
posted on Apr 7, 2014 @ 12:30PM
టీడీపీ, బీజేపీ పొత్తు కుదరడంతో రెండు పార్టీల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు కూడ ఈ కలయిక దేశానికి మేలు చేసేదని అంటున్నారు. అయితే రాష్ట్రంలోని మిగతా పార్టీలు మాత్రం ఫ్రస్టేషన్‌లో పడిపోయాయి. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఏడుస్తుంటే, ఉప ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ మాత్రం తెలంగాణలో ఏడుస్తోంది. అలా పొత్తు కుదిరిందో లేదో ఇలా ప్రెస్‌మీట్ పెట్టేసిన హరీష్‌రావు తన ఫ్రస్టేషన్‌ని, టీఆర్ఎస్ నాయకుల ఫ్రస్టేషన్‌ని బయట పెట్టేశారు. ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం అదేదో దారుణం అన్నట్టుగా మాట్లాడారు. కాసేపు చంద్రబాబుని తిట్టి తన బీపీని తగ్గించుకున్నారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకుండా వుంటే బాగుండేదని బీజేపీకి హితవు చెప్పారు. ఇదంతా చూస్తుంటే టీడీపీ, బీజేపీ మధ్య కుదిరిన పొత్తు తెలంగాణలో తమ పుట్టిని పూర్తిగా ముంచేసే అవకాశం వుందని టీఆర్ఎస్ భయపడుతోందన్న విషయం అర్థమవుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.