బిజేపీని ఓడించాలంటే ప్రతి పక్షాలు ఐక్యమవ్వాలి: ఓవైసీ
posted on Apr 15, 2023 @ 12:54PM
ప్రతి పక్ష పార్టీలు బిజేపీ సిద్దాంతాలతో రాజీ పడటం వల్లే ముస్లింల మీద దాడులు పెరిగిపోతున్నాయని మజ్లిస్ పార్టీ ప్రెసిడెంట్ ఆరోపించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అజీజా మదర్సాకు వెళ్లకపోవడం విచారకరమన్నారు. 4,500 మనుస్క్రిప్ట్ లు ఇదే మదర్సాలో తగలపడ్డాయన్నారు. ఇందులో ఖురాన్ కూడా ఉందని ఆయన మండిపడ్డారు. ముస్లింపిల్లలు దేశంలో నిరక్షరాస్యతకు గురవుతున్నారని, ముస్లిం జనాభా వున్న ప్రాంతాల్లో స్కూల్ జోన్స్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముస్లింలు వున్న ప్రాంతాల్లో స్కూల్స్ తెరవడం లేదని, ఫలితంగా ముస్లిం పిల్లలు మదర్సాలలో విద్య నభ్యసిస్తున్నారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం బడుగు, బలహీన వర్గాలకు పాజిటివ్ సంకేతం ఇవ్వడమేనన్నారు. రాజ్యాంగంలో ఈ వర్గాలకు పెద్ద పీటవేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ ముదావహమన్నారు.
బీజేపీ సిద్దాంతాలను అపోజిషన్ పార్టీలు ముక్త కంఠంతో నినదించాలని, అప్పుడే 2024 ఎన్నికల్లో ఆ పార్టీని అధికారంలో రాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. మోడీ ప్రభుత్వం అందరికీ విద్యాహక్కు చట్టం అమలు చేయడంలో విస్మరించిందన్నారు. యుపీఏ ప్రభుత్వం హాయంలో ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ వచ్చేదని మోడీ అధికారంలో వున్న 8 ఏళ్లలో ఈ స్కాలర్ షిప్ విస్మరించిందన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓవైసీ బిజేపీ ప్రభుత్వ పనితీరును తూర్పారబట్టారు. మజ్లిస్ పార్టీ దేశవ్యాప్తంగా బిజేపీయేతర పార్టీలతో జతకడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్న ఓవైసీ కాంగ్రేస్ లేదా బీజేపీయేతర పార్టీలను అధికారంలో తీసుకురావడానికి ఇప్పటికే దేశ వ్యాప్త ప్రచారాన్ని మొదలెట్టారు. బీజేపీని ఓడించడమే పరిష్కారమన్నారు. బీజేపీ సిద్దాంతాలతో అపోజిషన్ పార్టీలు రాజీ పడుతున్నాయన్నారు.