టిడిపి దారిలో 'పవర్ స్టార్'..!!
posted on Oct 22, 2013 @ 10:12AM
గత కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజీకీయాల్లోకి వస్తున్నాడంటూ వస్తున్న వార్తలకు తెరపడటం లేదు. తాజా పరిణామాల దృష్ట్యా చూసుకుంటే పవన్ టిడిపిలో చేరనున్నాడు అనే వార్తలకు మరింత బలం చేకూరుతోంది. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారన్న వార్త అటు రాజకీయ ఇటు సినీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోసిన అన్నయ్య ఆ పార్టీతోనె చేతులు కలపడం పవన్ కు జీర్ణించని పరిణామం అని అందరూ చెప్పుకుంటుదే.
తాజాగా వస్తున్న వార్తల్లో విశేషమేమిటంటే...పవన్ కళ్యాణ్తో పాటు అన్నయ్య నాగబాబు కూడా టిడిపి లో చేరబోతున్నారని టాక్ మొదలైంది. ఈ మేరకు స్వయంగా ఆయన నందమూరి బాలకృష్ణతో భేటి అయినట్లు సమాచారం. ఈ రెండు విషయాలపై అటు పవన్ నుంచి, ఇటు టిడిపి పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కానీ, కామెంట్స్ కానీ రాలేదు. అలాగే ఈ రెండు విషయాల్లో వాస్తవమేమిటనేది పక్కనపెడితే ప్రస్తుతం ఈ ఊహాగానాలు మాత్రం రాష్ట్రం అంతా చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో కాలమే నిర్ణయించాలి.
Video Courtesy ABN ANdhrajyoti