అన్నయ్యకు ఎదురు వెళ్ళాల్సి వస్తుంది: పవన్
posted on Mar 14, 2014 @ 7:32PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సభ వేదిక పైకి వచ్చారు. పవన్ కళ్యాణ్ కు అభిమానులు అరుపులతో, కేకలతో జై పవనిజం అనే నినాదాలతో స్వాగతం పలికారు. సభకి వచ్చిన వేలాదిమంది అభిమానులకు అభివాదం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం బాలగంగాధర్ తిలక్ కవితో మొదలుపెట్టారు. ఢిల్లీలో దొరలకి కాలు మొక్కే పరిస్థితి మన నేతలది. అన్నయ్య చిరంజీవి పైన నాకు కోపం లేదు. ఢిల్లీలో పెద్దలు చేసిన పనికి అన్నయ్య మీద నాకు కోపం ఎందుకు? దురదృష్టం కొద్దీ అన్నయ్యకు ఎదురు వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు వూహించలేదు అని అన్నారు.