తిరుపతి వైకాపా అభ్యర్థి కరుణాకర్‌రెడ్డి ఘాతుకం
posted on May 7, 2014 @ 6:51PM
తిరుపతి వైకాపా అభ్యర్థి కరుణాకర్‌రెడ్డి క్షమించరాని నేరం చేశారు. తన ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకట రమణ మీద చెయ్యి చేసుకున్నారు. తిరుపతిలో ఒకరికొకరు ఎదురుపడిన కరుణాకర్ రెడ్డి, వెంకట రమణ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వుండగానే కరుణాకర్ రెడ్డి వెంకట రమణ మీద చెయ్యి చేసుకున్నారు. దాంతో ఇద్దరికి చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవ సర్దుమణిగేలా చేశారు. కరుణాకర్ రెడ్డి, వెంకట రమణను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. తమ పార్టీ అభ్యర్థి వెంకట రమణ మీద వైకాపా అభ్యర్థి కరుణాకర్ రెడ్డి చెయ్యి చేసుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖండించారు. కరుణాకర్ రెడ్డి ఓడిపోతున్నారన్న బాధతోనే ఇలా ప్రవర్తించారని అన్నారు. కరుణాకర్ రెడ్డి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.