పార్టీ సీనియర్ నేతలకే షాకిచ్చిన జగన్..
posted on Mar 21, 2016 @ 1:02PM
ఈ మధ్య తమ పార్టీలో ఉన్న నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లి షాకిస్తున్న నేపథ్యంలో జగన్ తీసుకున్న ఒక నిర్ణయం ఇ్పపుడు పార్టీలోని సీనియర్ నేతలకు షాకిచ్చింది. అదేంటంటే ఏపీ పీఏసీ చైర్మన్ గా ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ ను ఎన్నుకోవడం. భూమా నాగిరెడ్డి గత కొద్దిరోజుల క్రిందటే టీడీపీలో చేరడంతో ఆపదవి ఖాళీగా ఉంది. దీంతో ఆపదవికి వైసీపీ యువ నేత, కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ ను జగన్ ఎంపిక చేశారు. ఈరోజు జగన్ నివాసం లోటస్ పాండ్లో వైసీఎల్పీ భేడీ జరిగిన నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో పార్టీలోని సీనియర్ నేతలు జ్యోతుల నెహ్రూ, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, అమరనాథరెడ్డిలు ఒక్కసారిగా షాక్ తిన్నారు.
కాగా బుగ్గన రాజేంద్రనాథ్ డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొంది మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలాంటి రాజేంద్రనాథ్ కు ఈ పదవి కట్టబెట్టడంతో పార్టీలో పలువురు విస్మయానికి గురయ్యారు. మరోవైపు ఈపదవి కోసం జ్యోతుల నెహ్రూతో పాటు చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దరెడ్డి రాంచంద్రారెడ్డి, అదే జిల్లా పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డిలు తమవంతు యత్నాలు చేశారు. అయితే వారందిరికీ షాకిస్తూ జగన్... ఫస్ట్ టైం సభలో అడుగుపెట్టిన బుగ్గన రాజేంద్రనాథ్ ను పీఏసీ చైర్మన్ పదవికి ఎంపిక చేశారు. మొత్తానికి పార్టీ ఉన్న సీనియర్ నేతలందరూ తనకు హ్యాండ్ ఇస్తున్నారని చెప్పి జగన్ ఈ రకంగా ప్లాన్ చేసినట్టున్నారు.