షిండే అలా అనలేదు : గాదె

 

 

 

రెండు రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే అనలేదని, అలా అన్నట్లు నిరూపిస్తే, తాను తక్షణం రాజకీయ సన్యాసం తీసుకొంటానని శాసనసభ్యుడు, కాంగ్రెస్ తరపున ఈ సమావేశానికి హాజరయిన గాదె వెంకట రెడ్డి అన్నారు.


అఖిల పక్ష సమావేశంలో ఏమి చెప్పాలనే విషయంలో తమ పార్టీ అధిష్టానం తమకు పూర్తి స్వేచ్చ ఇచ్చిందని, తాను వెల్లడించిన అభిప్రాయం, సురేష్ రెడ్డి చెప్పిన అభిప్రాయాల్లో ఎవరి అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవిన్చిందో త్వరలో షిండే చేసే ప్రకటనతో తెలిసిపోతుందని గాదె వ్యాఖ్యానించారు. నిన్న హైదరాబాద్ లో సిఎల్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.



ఆ సమావేశంలో తాను మాట్లాడుతుండగా తనకు ఎవరూ అడ్డు చెప్పలేదని, తాను మూడు దఫాలుగా మాట్లాడాననీ గాదె వివరించారు. పార్టీ తరపున ఒకే అభిప్రాయాన్ని వినిపిద్దామని తాను ముందుగానే సురేష్ రెడ్డి కి చెప్పానని, అయితే, దానికి ఆయన అంగీకరించలేదని గాదె వివరించారు.ఆ సమావేశంలో జరిగిన వాస్తవానికి భిన్నంగా బయట ప్రచారం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

 

Teluguone gnews banner