త్యాగమయులు జగన్ పార్టీ నేతలు

 

 

 

పండుగనాడు ఇంటిపెద్ద ఏఆసుపత్రిలోనో, జైల్లోనో ఉంటే ఆ కుటుంబము ఏవిదంగా బాధపడుతుందో, అదేవిదంగా వైయస్సార్ కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. అతని జన్మదినం, క్రిస్మస్, నూతన సంవత్సరం వంటి ముఖ్యమయిన మూడు వేడుకలను చంచల్ గూడా జైల్లోనే జరుకోవలసివస్తున్నతమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితిచూసి తల్లడిల్లిపోతున్న, ఆ పార్టీ నేతలు ఈసారీ తాముకూడా నూతనసంవత్సర వేడుకలు జరుపుకోకుడదని నిర్ణయించుకొన్నారు. తమ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని కుట్రపూరితంగా కావాలనే జైల్లో నిర్భందించిన సిబిఐ ఆయనకు ఆరు నెలలయినా కూడా బెయిల్ రాకుండా అడ్డుపడుతోందని వైయస్సార్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.


మాజీ మంత్రి శంకర్ రావు ఇదివరకు కోర్టుకు వ్రాసిన లేఖలో జగన్ పేరు అట్టడుగున ఉండగా, సిబీఐ మాత్రం తమ పార్టీ నాయకుడి పేరును మొట్టమొదటి ముద్దాయిగా పేర్కొనడమే సిబిఐ కుట్రకి నిదర్శనమని కూడా వారు ఒక వింత వాదనచేస్తున్నారు. ఒక మాజీమంత్రి కోర్టుకు వ్రాసిన ఒక లేఖని వారు ప్రామాణికమని ప్రజలకి చెప్పబోవడమే విడ్డూరం. మొన్న హైకోర్టు చేత చివాట్లుతిని బయటపడిన శంకర్ రావు లేఖలో జగన్ ముద్దాయి అని వ్రాసినట్లు వారే చెప్పుకోవడం మరో వింత. ఏది ఏమయినప్పటికీ, జగన్ పార్టీవల్ల, తనకు లాభం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావించినప్పుడు మాత్రమే, చంచల్ గూడా జైలు తలుపులు అలనాడు వసుదేవుడు చిన్నారి శ్రీ కృష్ణుడ్ని బుట్టలో పెట్టుకొని వ్రేప్పల్లె బయలుదేరినప్పుడు వాటంతట అవే తెరుచుకున్నట్లు, రేపు ఎన్నికలముందు తెరుచుకొనే అవకాశం ఉంది. లేదంటే, ఇక జగన్మోహన్ రెడ్డికి సిబిఐ, కోర్టుల దయాదాక్షిన్యాలకోసం ఎదురుచూపులు తప్పవు.   

Teluguone gnews banner