ఆర్టీసీ జేఏసీ నేతల గృహ నిర్బంధం.. యాక్షన్ ప్లాన్ ను భగ్నం చేస్తున్న పోలీసులు

ఆర్టీసీ సమ్మె 43వ రోజుకు చేరింది. ఈరోజు యాక్షన్ ప్లాన్ లో భాగంగా బస్ రోకోలతో పాటు, ఆర్టీసీ జేఏసీ నేతల నిరాహార దీక్ష ఉంది. ఈ ప్లాన్ భగ్నం చేయడానికి పోలీసులు రాత్రి నుంచే ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతల ఇళ్లు.. ఆఫీసు దగ్గర పెద్ద ఎత్తున మోహరించారు పోలిసులు. ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. ఇప్పటికే జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డిలను గృహ నిర్బంధం చేశారు. ఏ క్షణమైనా నేతలను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అది జరగకుండా చూసేందుకు ఆర్టీసీ కార్మికులు సైతం పెద్ద ఎత్తున వాళ్ల ఇళ్లకు చేరుకుంటున్నారు. తలుపులు పగలగొట్టి అశ్వద్ధామ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు.


ప్రస్తుతం అక్కడ కొద్దిగ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక బస్ రోకోను భగ్నం చేసేందుకు డిపోలు, బస్టాండ్ దగ్గర కూడా పోలీసులు మోహరించారు. బస్ భవన్ తో పాటు ప్రతి డిపో దగ్గర 500 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. గ్రూపులుగా ఏర్పడడం.. ఆందోళనలకు దిగడం.. లాంటివి చేస్తే అరెస్ట్ తప్పదని హెచ్చరిస్తున్నారు పోలీసులు.


ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా సిరిసిల్ల డిపో ముందు బైఠాయించిన కార్మికులు అఖిల పక్ష నేతలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.రేపు ఎల్లండీ కూడా అన్ని బస్ డిపోల వద్ద సాముహిక దీక్షను, ఎల్లుండి ( నవంబర్ 18న ) సడక్ బంద్ కూడా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు పరిష్కారం రావట్లేదని టీ జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా వెనక్కి తగ్గేది లేదంటే కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు ముందుకు వెళ్తున్నారు. అందరూ  సామూహిక దీక్షకు కాసేపట్లో  కూర్చుంటారా.. లేదంటే ముందుగా అందరిని అరస్టు చేస్తారా..? అనేది చర్చనీయాంశంగా మారింది.

Teluguone gnews banner