ఎవడు ఆడియో... మగధీర ని బ్రేక్ చేస్తుంది: చిరంజీవి
posted on Jul 2, 2013 @ 11:59AM
రామ్ చరణ్ తేజ నటించిన 'ఎవడు' మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ 'మగధీర' రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. రామ్ చరణ్ ఎవడు ఆడియో రిలీజ్ కి ముఖ్య అతిధి గా వచ్చిన చిరంజీవి...రామ్ చరణ్ చెప్పినట్లు 'మగధీర' ని మించిన సినిమా చరణ్ కి ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదని అన్నారు. ఈ సినిమా మెగా ఫ్యాన్స్ ఉహించిన దాని కంటే ఎక్కువగానే ఉంటుందని అన్నారు. సాయి కుమార్ ఈ సినిమాలో అద్బుతంగా నటించాడని, 'మగధీర' శ్రీ హరి షేర్ ఖాన్ పాత్రని సాయి కుమార్ మళ్ళీ గుర్తు చేస్తాడని చెప్పారు.
ఈ ఫంక్షన్ కి రామ్ చరణ్, అల్లు అర్జున్, శృతి హాసన్, వంశీ పైడిపల్లి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, బ్రహ్మానందం, దిల్ రాజు, అల్లు అరవింద్, సాయి కుమార్, దేవి శ్రీప్రసాద్ తదితరులు ఉన్నారు. చిరంజీవి మొదటి ఆడియో సి.డి ను ఆవిష్కరించి రామ్ చరణ్, అల్లు అర్జున్ లకు అందజేశారు.