సమన్యాయం..మాయం
posted on Feb 27, 2014 @ 2:20PM
ఏపీలో నిన్న.. మొన్నటి వరకు వినిపించిన సమన్యాయం మాయమైంది. విభజన ప్రక్రియకు ఆమోదముద్ర మాత్రమే మిగిలిన దశలో రాజకీయ పార్టీల నినాదాలు మారిపోయాయి. అందరికంటే ముందుగా తెలుగుదేశం పార్టీ తన సమన్యాయ సిద్ధాంతాన్ని సవరించింది.
తెలంగాణా, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాలలో బలమైన కేడర్ ఉన్న టీడీపీ తన పూర్వవైభవాన్ని సాధించేందుకు కార్యరంగంలోకి దూకింది. అధినేత దిశానిర్దేశంలో టీడీపీ సీనియర్లు ఏ ప్రాంత అవసరాలను బట్టి ఆ నినాదంతో ముందుకు వెళుతున్నారు.
తన 9 ఏళ్ళ పదవీకాలంలో హైదరాబాద్ ను హైటెక్ సిటీగా తీర్చిదిద్దిన బాబు.. తెలంగాణను అభివృద్ధి చేసింది నేనే .. రాబోయే రోజుల్లో సామాజిక తెలంగాణా నాతోనే సాధ్యం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా ప్రపంచపటంలో నిలిపానని.. ఇప్పుడు అవషేశాంద్ర ప్రదేశ్ తానే పునర్ నిర్మించగలనని సవాల్ చేసి చెబుతున్నారు.
టీడీపీ ఏమి చేస్తుందో చెబుతున్న బాబు.. ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే ఏమవుద్దో వివరించి చెబుతున్నారు. జగన్ పార్టీ అధికారంలోకి వస్తే సీమాంద్రకు చక్కని రాజధాని బదులు ...చంచల్ గూడ జైలు నిర్మిస్తాడని బాబు వ్యగ్యంగా వ్యాఖ్యానించారు.
విజయనగరం లో టీడీపీ నిర్వహించిన ప్రజగర్జనలో బాబు సమన్యాయం నుంచి ..న్యూ టర్న్ తీసుకోవడం నేతలు, కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపింది. దిక్కులేని అక్కుపక్షిలా మారిన సీమాంద్రకు బాబు నాయకత్వమే కరెక్ట్ అని కొందరు విశ్లేషిస్తుంటె .. విజన్ 20-20 రూపకర్త,, స్వర్ణాంద్ర సారధి అవశేషా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపగలడని, హైదరాబాద్ కు ధీటైన రాజధాని నిర్మించగలదని విస్వసిస్తున్నారు.