ప్రజల కోసమే రాజధాని... చంద్రబాబు
posted on Mar 5, 2015 @ 4:48PM
ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు అవసరమా అన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడు పరోక్షంగా తప్పుబట్టారు. రాజధానిని ఎన్ని ఎకరాల్లోనైనా నిర్మించుకోవచ్చని, రాజధాని అంటే నాలుగు బిల్డింగ్ లు కాదని అన్నారు. వారి నుండి మేము కావాలని భూములు లాక్కోవడం లేదని, రైతులు తమ ఇష్ట్తంతోనే భూములు ఇస్తున్నారని, ప్రజల భవిష్యత్ కోసమే ఈ రాజధాని నిర్మాణమని పేర్కొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలకు పది ఎకరాలు కావాలి కానీ, అదే రాజధాని నిర్యాణానికి వేల ఎకరాలు అవసరం లేదా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి తనకు తెలియదని చెప్పారు.