భూమాకి బుజ్జగింపులు.. ఎవరి ఆఫర్ కి ఓకే అంటారో..?
posted on Feb 20, 2016 @ 11:40AM
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వేడి వాతావారణం నెలకొంది. దీనంతికి కారణం భూమా నాగిరెడ్డి, భూమా అఖిల ప్రియ టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు రావడమే. రెండు రోజుల క్రితమే వైసీపీ అధ్యక్షుడు జగన్ తమ పార్టీ నేతలు ఏ పార్టీలోకి వెళ్లరని.. ఇదంతా టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని.. ఇంకా చెప్పాలంటే టీడీపీ నేతలే మాతో టచ్ లో ఉన్నారని గట్టిగానే చెప్పారు. అయితే జగన్ అలా చెప్పాడో లేదో రెండు రోజులకే భూమా నాగిరెడ్డి టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు రావడంతో జగన్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. దీంతో ఇప్పుడు ఆయన భూమాని బుజ్జగించే పనిలో పడినట్టు తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి టీడీపీలోకి జంప్ అవుతున్నారు అన్న వార్తలు రాగానే విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి భూమా నాగిరెడ్డితో చర్చలు జరపగా ఆయన వారికి తమకు పార్టీలో జరిగిన అన్యాయాన్ని వివరించారట. ఇదే విషయాన్ని వారు జగన్ కు చెప్పారంట. ఈ నేపథ్యంలోనే ఆయన కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలని ఉన్నపళంగా హైదరాబాద్ కు రమ్మని.. హడావుడిగా భేటీ అయి భూమా వ్యవహారంపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా భూమా మాత్రం తాను పార్టీలోకి చేరేది లేదు అని ఒక పక్క చెబుతూనే.. ఆయన జరపాల్సిన చర్చలు ఆయన జరుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు టీడీపీలోకి వచ్చే భూమా నాగిరెడ్డికి కాని, కూతురు అఖియ ప్రియకి కాని మంత్రి పదవి ఇస్తామని టీడీపీ ఆఫర్ ఇచ్చినట్టు తెలిసిందే. అయితే నాగిరెడ్డి మాత్రం టీడీపీలోకి రానూ అంటూనే గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారంట. ఇప్పటికి అన్ని పదవులు అనుభవించాను.. మంత్రి పదవి వద్దు కానీ.. ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే తాను టీడీపీలోకి వస్తానని ఆయనే టీడీపీకి రివర్స్ ఆఫర్ ఇచ్చారంట.
మరోవైపు భూమా నాగిరెడ్డి వ్యవహారంపై అటు వైకాపా నేతలు.. ఇటు టీడీపీ నేతలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. జగన్ ఇప్పటికే కర్నూల్ ఎమ్మెల్యేలతో భేటీ అయినట్టు తెలుస్తోంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు భూమా నాగిరెడ్డితో పాటు ఇతర శాసనసభ్యులు పార్టీలో వస్తున్న నేపథ్యంలో ఏ విధమైన ఆటంకాలు లేకుండా చూడడానికి కర్నూలు జిల్లా పార్టీ నేతలతో ఈరోజు సాయంత్రం 3 గంటలకి సమావేశం కానున్నారు. మరి ఇప్పటికే టీడీపీ భూమాకి ఒక ఆఫర్ ఇచ్చింది. మరి భూమా నాగిరెడ్డి కర్నూల్ జిల్లాలో కీలకమైన నేత కాబట్టి అతని వదులుకోవడానికి జగన్ సిద్దంగా ఉండరని రాజకీయ పెద్దలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అతను పార్టీలో ఉండాలంటే వైసీపీ కూడా ఏదో ఒక ఆఫర్ ఇవ్వాలి.. మరి వైసీపీ ఏం ఆఫర్ చేస్తుందో.. భూమా కి టీడీపీ ఆఫర్ నచ్చుతుందా.. లేక వైసీపీ ఆఫర్ నచ్చుతుందో..? పార్టీ మారుతారో.. లేదో..? తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.