ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్
posted on Mar 5, 2014 @ 10:56AM
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వి.ఎస్.సంపత్ 16వ లోక్ సభ ఏర్పాటుకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రెండు విడతల్లో ఎన్నికల జరగనున్నాయి. లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం వున్న లోక్ సభ, శాసన సభ సీట్ల ఆధారంగానే ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణ:
1. తెలంగాణలో ఏప్రిల్ 2 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
2. ఏప్రిల్ 9 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.
3. ఏప్రిల్ 10న నామినేషన్ల పరీశీలన.
4. ఏప్రిల్ 12 నామినేషన్ల ఉపసంహరణకు గడువు.
5. ఏప్రిల్ 30 తెలంగాణలో పోలింగ్ వుంటుంది.
6. తెలంగాణలో 17 ఎంపీ, 119 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
సీమాంధ్ర:
1. సీమాంధ్రలో ఏప్రిల్ 12 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
2. ఏప్రిల్ 19వరకు నామినేషన్ల స్వీకరణ వుంటుంది.
3. ఏప్రిల్ 21న నామినేషన్ల పరీశీలన.
4. ఏప్రిల్ 23నామినేషన్ల ఉపసంహరణకు గడువు
5. మే 7న సీమాంధ్రలో పోలింగ్ వుంటుంది.
6. సీమాంధ్రలో 25ఎంపీ, 175 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
మే16న ఇరుప్రాంతాలలో ఓకే రోజు ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు.