Read more!

నైన్త్ స్టాండర్డ్ ప్రశ్నపత్రంలో కోహ్లీపై ప్రశ్న!

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై తొమ్మదో తరగతి ప్రశ్నపత్రంలో ఒక ప్రశ్న పొందుపరిచారు. టీమ్ ఇండాయా మాజీ కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

భారత దేశంలో ఒక మతం లాంటి క్రికెట్ లో మకుటం లేని రారాజులా వెలుగొందుతున్నకోహ్లీ  ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు సాధించాడు.  

విద్యార్థులకు క్రీడల పట్ల ఉన్న ఆసక్తి, అవగాహనపై తొమ్మిదో తరగతి పశ్నపత్రంలో కోహ్లీపై ఒక ప్రశ్న ఇచ్చారు.   ఆసియాకప్ లో ఆప్ఘనిస్థాన్ జట్టుపై విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. అందుకు సంబంధించి 100-120 పదాల్లో వ్యాసం రాయాలన్నదే ఆ ప్రశ్న. ఈ ప్రశ్నాపత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.