"నేనూ వరండాలోనే పడుకుంటాను పద" అన్నాడు చలపతి.
మంగమ్మ సగంవేసిన పక్కమీద కూచుంది. గడ్డాన్ని మోకాళ్ళమీద అనిపించింది.రెండు చేతులూ కాళ్ళకు చుట్టవేసి, చలపతి కేసి చూస్తూ కూచుంది.
"నేనక్కడికేడితే అక్కడికే వస్తారన్నమాట!" అన్నది మంగమ్మ.
చలపతి కూడా, ఆవిడ ప్రక్కనే కూచున్నాడు, మంగమ్మ ముఖాన్ని తనవేపుకు తిప్పుకున్నాడు.
"ఏమిటి చెప్పండి?" అన్నది మంగమ్మ.
"నన్నలా కొంచెంసేపు నీ ముఖం కేసి చూడనివ్వు మమ్గమ్మా!"
"ముఖంచూసి వెడతానంటే చూడనిస్తాను. కానీ, మీరలా వెళ్ళారుగదా!..... అదుగో, ముందాచెయ్యి అక్కణ్ణించి తీసెయ్యండి బాబూ, నాకసలే చక్కలిగిలి.... చెబుతున్నా వినిపించుకోకపోతే ఏం చెయ్యను చెప్పండి? మీరసలే కైపులో ఉన్నారు. ఇలా మరో పదినిమిషాలు తాకనిచానంటే- ఆ తరువాత మిమ్మల్నాపడం బ్రహ్మవల్ల కూడా కాదు అంచేత - నేను వెళ్లేమో మంచంమీద బాబ్బుంటాను..... వింటున్నారా?...... నీరిలాగే ఇక్కడే నిద్రపోవాలయునని నేను కోరుచున్నాను."
మంగమ్మ చరాలున లేచి నాలుగడుగులు వేసింది. ఠక్కున ఆగిపోయింది. ఆవిడ పమిటచెంగు చలపతి చేతుల్లో ఉండిపోయింది. మరో అడుగు కూడా పడకుండా, చలపతి ఆవిణ్ణి ఆలింగనం చేసుకొన్నాడు. అతనిలోంచి తనలోకి నిప్పుచినుకులు దూకుతున్నట్లనిపించింది. మంగమ్మకు ఇకతను చలపతి నిగ్రహించలేదు. తనేం చెప్పినా అతను వినేదశలోలేడు, అయినా మరోచిన్న తమాషా చేదాంమనుకుంది మంగమ్మ.
"అబ్బబ్బా!..... అంత లైటేమిటండీ" అన్నది మంగమ్మ.
చలపతి లైటు ఆర్పేశాడు. ఆకుపచ్చని డిర్మార్ కాంతి, గదిలో పలచా పరుచుకొంది. చలపతి, ఓ నిమిషంపాటు మంగమ్మను నిలువునా చూశాడు.
"అలా చూస్తారేం?" అన్నది మంగమ్మ మెల్లిగా.
"నమిలిమింగితే రేపటికి ఉండవనిగానీ, లేకపోతే అమాంతం తినేసి ఉందును" అన్నాడు చలపతి.
మంగమ్మ ఏమీ మాట్లాడలేదు చలపతి, ఆవిడ పెదవుల కోసం వేదుకుకొంటూ "ఎంత బావున్నావమ్మా నువ్వు!"అన్నాడు.
చట్టుక్కున ఆవిడకు రామచంద్రం జ్ఞాపకం వచ్చాడు. అతను కూడా మొదటిసారి తనను రిహార్సల్ రూంలో కలుసుకొన్నప్పుడు ఈమాటే అన్నాడు. ఈ జ్ఞాపకంతో, ఆవిడ మనసంతా దిగులుతో నిండిపోయింది. శరీరంలోంచి శక్తి జారిపోయినట్లనిపించింది. చలపతి కివేమీ తెలియవు. వేటక్కుక్కలాగా, మంగమ్మను తనకేసి పోదుపుకున్నాడు. ఆవిడకూడా రబ్బరు బోమ్మాలాగా అతనిచేతుల్లో ఆడింది....
ఆవిడకు మెలకువ వచ్చేసరికి ఎంతరాత్రియిందో తెలిదు. తెలుసుకోవాలంటే, లేచి వెళ్ళి, అలమరా తలుపు తెరిచిచూసి రావాలి. ఆపని చేయబుద్ది కాలేదు. ఆ ప్రక్క మీద పడుకోంటే గండుచీమలు పుట్టమీద పడుకున్నట్టుగా వుంది మంగమ్మకు, మెల్లిగా లేచి వెళ్ళి తనపక్కమీద పడుకొంది. అక్కణ్ణుంచి చూస్తే చలపతి కనిపిస్తున్నాడు. కాస్సేపు అతనిముఖంలేపే చూసింది. తనకోసం ఆ శరీరం పడిన యాతన తలుచుకొని, తనలో తనే నవ్వుకొంది.
"నువ్వంటే నాకు చాలా ఇష్టం మంగమ్మా?" అన్నాడు ఇందాక.
"కావాలంటే నీకోసం చచ్చిపొమ్మన్నా చచ్చిపోతాను" అన్నాడు.
ఇటువంటిమాటలు ఇవేమాటలు, తనిప్పటికి లక్షా తొంబై సార్లు విన్నది. తన దగ్గరకొచ్చిన ప్రతి వెధవ సన్యాసి ఈ మాటలన్నాడు. ఇకముందు రాబోయ్యేవాళ్ళు కూడా అంటారు అవన్నీ పచ్చి అబద్దాలనీ వాళ్ళకూ తనకూ తెలుసు. నమ్మమన్నట్టుగా వాళ్ళంటారు. నమ్మినట్టుగా తనూ మాట్లడతుంది. ఈ జీవిత నాటకంలో, ఈ డైలాగు తప్పకుండా వుండాలిసిందే!
అలా కాకుండా - ఒక్కసారిగా మనస్సులో ఉన్నాదంతా కక్కేయ్యాలని పిస్తుందప్పుడప్పుడు కాని ఆపని చేయ్యలేదు. ఇక ముందు కూడా చెయ్యబోదు.
తనేన్నో ఆశలు మూట గట్టుకొని ఇక్కడికొచ్చింది మూట విప్పి నప్పుడు, అందులో వజ్రాలు, కెంపులు మేరవాలిగానీ, రాళ్ళు రాప్పలుండకూడదు. ఏమీ ఉంటాయే ఇప్పుడే తను చెప్పలేదు కూడాను....
నన్ను చాలా అమాయకురాలని చలపతి ఉద్దేశం ఇందాక "నిన్ను నేను జయించాను కాదూ?" అన్నాడు వాడు. అందులో వాడు జయించిందేమిటో తనకు బోధపడలేదు. నాలుకు రోజుల తరువాత గానీ, తనను తాకటానికి గుండెలేనివాడు, తనను జయించాననడంలో ఖర్మ. వాడితో మద్రాసు బండిక్కినప్పుడే అనుకొంది ఈ ముష్టి పనికోసం నాలుగు వస్తాయించా డన్నప్పుడే వాడంటే తనకు తెలిసిపోయింది. ముందు ముందు అవసరాలకు పనికొచ్చే మనిషి గనక, కాస్సేపు నాటకం ఆదాలిసోచ్చింది. ఇదంతా నిజమేనని చలపతి నమ్మివుంటే- వీడూ అందరిలాంటి వాడే! నమ్మాకపోతేమాత్రం, తను జాగ్రత్తాగా వుండటం అవసరం!
ఎక్కడో గడియారం రెండు గంటలు కొట్టింది. మంగమ్మ మేడదాకా దుప్పటి కప్పుకొని ఓసారి కళ్ళు గట్టిగా నులునుకొని పడుకొంది. బుర్రలో రకరకాల ఆలోచనలు మోనులెత్తి క్రమంగా మసకలో కలిసిపోతున్నాయి.తువాటికొక రూపంలేదు. ఒక వరుస లేదు. కళ్ళు బరువుతో వాలిపోతున్నాయి. కప్పుకొన్న దుప్పాటి తీస్తే చలి. కాళ్ళు చేతులు ముణగదీసుకొని కళ్ళు మూసుకొంది. అయిదారు నిమిషాలు గడిచాయే లేదో, చలపతి అక్కడికొచ్చాడు, ఆవిడప్రక్కనే పడుకొని, నడుంమీద చెయ్యివేశాడు.
"ఇక్కడి కొచ్చావేం?" అన్నది మెల్లిగా.
మంగమ్మ శరీరం అసహ్యంతో జలదరించి పోయింది.
"నేనూ ఇక్కడే పడుకొంటాను" అన్నాడు చలపతి.
అతను మాట్లాడుతుంటే పుల్లని వాసన వేస్తోంది.
"ఎలాగైనా చావు" అనుకొంది మంగమ్మ. "ఈ వెధవ మళ్ళా తయారయ్యాడు. తప్పదు"
"నిద్రపోతున్నప్పుడు నువ్వెంత బావుంటావని?" అన్నాడు చలపతి.
"ఓ పదినిముషాల్లో వీడు వొదిలిపోతే బావుణ్ణు సుఖంగా కడుపులో కాళ్లేట్టుకుని పడుకోవచ్చు" అనుకొంది మంగమ్మ.
సాద్యమైనంత త్వరలో చలపతిని వదిలించుకోవాలనుకోంది.
"మీరిక్కడికోస్తారని నాకూ తెలుసు. ఇంత 'ప్రేమ' నా మీద ఉన్నవాళ్ళు. ఈ నాలుగురోజులూ ఎలా నిద్రపోగలిగారో నాకు తెలియకుండా వుంది. మీరు నమ్మండినమ్మకపోండి గానీ నాకుమాత్రం నిద్రపట్టలేదు. ఒట్టువేసి చెబుతున్నాను.... అబ్బా! అలా చంపేయకండి! మీకు పుణ్యముంటుంది. అన్నది మంగమ్మ అతన్నిరేచ్చాగొట్టే సదభిప్రాయంతో.
చలపతి మరోసారి వెతకుక్కలా మారిపోయాడు.
"ఇక హాయిగా నిద్రపోవచ్చు " అనుకొంది మంగమ్మ ఆవలిస్తూ ఈసారి ఆవిడబుర్రలో, ఏ ఆలోచనలూ లేవు, ఓ నిమిషంపాటు అటూ ఇటూ మసిలి గాఢంగా నిద్రపోయింది.
ఆ మరునాడూ మద్యాహ్నందాకా మంగమ్మకు బద్ధకంగానే ఉంది. తాయారు కెరియర్ లో భోజనం తెచ్చిపెట్టింది. చలపతి ఉదయమే వెళ్ళాడు. మద్యాహ్నం టాను రాననీ భోంచేయ్యామనీ మంగమ్మతో చెప్పనే చెప్పాడు.
ఓసారి బరువుగా వోళ్ళు విరుచుకొని, అనవసరంగా ఆవలించి చిటికవేసింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పక్కింట్లొంచి ఏదో పాట సన్నగా ఊ నిముషంపాటు వినిపించి ఆగిపోయింది. కాసేపు కబుర్లు చెప్పకోడానికి ఎవరన్నా ఉంటే బావుండు ననిపించింది మంగమ్మకు. తయారైనా మరో పావుగంట లో వెడుతుంది. ఇక సాయంత్రందాకా తనోక్కతీ ఆ ఇంట్లో బిక్కుబిక్కు మంటూ కూచోవాలి.
పోతున్న తాయారును వెనక్కు పిలిచింది మంగమ్మ.
"ఏందమ్మాయిగారూ!" అన్నది తాయారు, గోదావరిజిల్లా యాసతో.
తనన్ని రోజులనుండి తాయారు మాటలువింటున్నా ఆవిడది గోదావరిజిల్లా అయివుంటుందని మంగమ్మ అనుకోలేదు.
"నువ్వు తొందరగా ఇంటికెళ్ళాలా అసలు మీ ఇల్లెక్కడ తాయారు!" అని అడిగింది మంగమ్మ.
"ఇక్కడేనమ్మా సీతారాం స్తూదియేస్ వెనకాల ఉంటున్నాను." అన్నది తాయారమ్మ.
ఆమాటలంటున్నప్పుడు తాయారు మాటలు తోత్తరపడటం మంగమ్మ గమనించింది.
"తొందరపనులేమీ లేకపోతే కూచో తాయారు! ఒక్కదాన్ని నాకేమీ తోచకుండా ఉంది. ఏదో మాట్లాడుతూ కాలక్షేపం చేయ్యేచ్చు ఇద్దరం కలిసే భోంచేద్దాం" అన్నది మంగమ్మ.
తయారు గేటుకు గడియపెట్టి వచ్చి కూచుంది. తీరా కూచున్నాక ఏం మాట్లాడవలసిందీ మంగమ్మకు తోచలేదు, ముందు చలపతిని గురించి అడుగుదామా? అనుకొంది. కాని అందువల్ల లేనిపోని రగడ చాలా జరగవచ్చునన్న అనుమానంతో అడగడం మానివేసింది. తనకన్నా తయారుకు, చలపతిగురించి, ఎక్కువ తెలిసుంటే తప్ప లేకపోతే తన ప్రశ్నవల్ల ప్రయెజనమేమీ ఉండదు. అదీకాక- అలా అడగడంవల్ల, తనకూ చలపతికి అట్టే సంబంధాలు లేవని తయారు అనుకొన్నా అనికోవచ్చు. అసలన్ని గొడవలు తెచ్చు కోవడమెందుకుట?
"నువ్వెంత కాలంనుండి ఇక్కడ పనిచేస్తున్నావు తాయారు?" అన్నది మంగమ్మ.
"అంతకుముందేం చేస్తుండేదానిని!" అన్నది మంగమ్మ.
తయారు మాట్లాడలేదు.
"నీ ఇష్టం లేకపోతే చెప్పకు, నేనయినా సరదాగా అడిగాను గానీ, అన్నది మంగమ్మ.
"ఎందుకులేండమ్మగారూ! నాదంతా అడవిగోడు చేటట్టేగ్గేసిక పట్టాలాగయింది నా బతుకు ఎంతమంది చెప్పినా యినుకొన్నానుగాదు మూరగంతో ఇట్టేల్లిపోయొచ్చేశాను. నామడం భగవంతుడే అనిచేసినాడు". అన్నది తాయారు.
ఆవిడ గొంతు దుఃఖంతో పూర్తిగా పూడుకుపోయింది. అపుకొందామన్నా ఆగకుండా కన్నీళ్లు పొర్లిపోయాయి. మంగమ్మకు ఆశ్చర్యమూ, అంతకన్నా విచారమూ కలుగాయి. పైకి ఎంతో ప్రశాంతంగా కనిపించే తాయారు లోలోపల కార్చిచ్చులున్నట్లని పించిందామెకు.
"నిన్ను నొప్పించానేమోనమ్మా! పాడుసంగతులు పోనివ్వు ఇంకేమన్నా మాట్లాడుకొందాం.... అన్నట్లు అడగడం మరిచాను. మీ ఆయన ఏం చేస్తుంటాడు?" అన్నది మంగమ్మ.
ఈ ప్రశ్నతో తాయారు దుఃఖం కట్టలు తెంచుకొంది పమిట చెంగును ఉండాలాగా చుట్టి నోట పెట్టుకొని కుళ్లికుళ్లి ఏడ్చింది. అవాంఛనీయమైనా సంఘటనేదో జరిగి ఉంటుందనేది ఖాయమనుకొన్నది మంగమ్మ. అదేమిటో తెలుసుకోవాలని ఆవిడ ఆకాంక్ష కానీ అడిగితేనే బావురుమంటున్న తాయారునుండి అదేమిటో తెలుసుకోవడం ఎలా?
"మీదీప్రాంతంకాదా తాయారు?"
తలతోనే "కా" దన్నది తాయారు.
"గుంటూరు జిల్లానా?"
"కాదండీ ! రాజమండ్రి!" అన్నది తాయారు "దానవాయి పేటలో ఉండేవాళ్ళ మండి! మా అమ్మా, అయ్యా ఇప్పటికీ ఆడనే ఉంటున్నారండీ!"
"మరికేం ? ఇక్కడ ఆపనీ ఈపనీ చేసుకుంటూ, అయుదుకూ పదికీ అవస్థ పడకపోతే హాయిగా మీ అమ్మా నాన్నా దగ్గరికి పోరాదూ ?"
తాయారు కాస్సేపు మెదలకుండా ఊరుకుంది.
వాళ్ళమీదగానీ అలిగివచ్చావా" అనడిగింది మంగమ్మ. "పోనీ- మీ ఆ.నుంటే -అతనేమంటాడుట?"
"అందరూ ఉన్నారమ్మగారూ! పున్నెంచేసుకొని పుట్టినోరు, ఆల్ల కేమండీ ! సలక్షణంగా ఉన్నారు. ఏ పాపం చేసుకొన్నానో తెలీదు అమ్మగారూ -ఈ మురికికూపంలో కొచ్చి పడ్డాను. ఇంటిదగ్గర ఎవరికీ తెలియకుండా రైలెక్కి వొచ్చేశానండీ!" అన్నది తాయారు.
తరువాత అన్ని సంగతులూ వరుసగా చెప్పుకొచ్చింది.
తాయారు మొగుడు, కిళ్ళీకొట్లు పెట్టుకున్నాడు. రోజుకు డెబ్బయ్, ఎనభయ్ రూపాయలదాకా అమ్మకాలు ఉంటూఉండేవి. మొగుడేదన్నా పనిమీద కెళ్ళినప్పుడు తాయారే కొట్లో కూచుండేది. ఆవిడ మొగుడు తయారుకు వ్యాపారంలోని లగువు బిగువు అన్నీ చెప్పాడు. తాయారు కొట్లో కూచోవడంతో, అమ్మకాలు కూడా పెరగసాగాయి. తాయారు జగన్మోహిని కాకపోవచ్చు గానీ, కూరూపికూడా కాదు. అ మగవాడ్నయినా ఇట్టే కట్టివేసుకోగల అందమైన కళ్ళను భగవంతుడామెకు ఇచ్చాడు. పైగా ఇంత ఎర్రతోలు కూడా ప్రసాదించాడు ఆవిడచూపుల కోసమే జనం విరగబడి పోయేవారు. తాయారు కివన్నీ మొదట్లో తెలీదు.
వీళ్ళ కిల్లీకొట్టు ఓ సినిమాహాలుకు ఎదురుగ్గాఉంది. ఇంకో ప్రక్కగా పెద్దహోటలుంది పగలల్లా హోటల్ అమ్మకాలుండేవి. రాత్రిళ్ళు సినిమా అమ్మకాలుండేవి. భార్యా భర్తలిద్దరూ వంతుల ప్రకారం కూచుని వ్యాపారం చూసుకొంటూ ఉండేవారు.
ఒకసారి ఏదో కొత్తసినిమా. ఆ హాల్లోకొచ్చింది. ఆరు వారాలైనా జనం విరజబడి చూస్తూనేవున్నారు. ఆ సినిమా వెంట ఒక రిప్రజెంటేటివ్ వచ్చాడు. అతను సన్నగా పొడుగ్గా తెల్లగా ఉన్నాడు. మంచి మాటకారి అతను అస్తమానం ఆకొట్టుదగ్గరే ఉండేవాడు. రెండు మూడుసార్లు తయారుకు ఉత్తినే సినిమాకూడా చూపించాడు.
"అదే నాకొంపతీసిందమ్మగారూ ! అమాయసచ్చినోడి మాటల్లో పడ్డాను. అరచేతిలో వైకుంఠం చూపించేసినాడండీ! నన్ను స్టార్ ని చేస్తానన్నాడు. సొంతంగా సినిమా తీస్తానన్నాడు. దొంగసచ్చినదాన్ని అన్నీ నమ్మాను, ఇంట్లో ఉన్న నగానట్రాబోరించేసుకొని వాడితో పట్నం వచ్చాను. వారంరోజులకల్లా మా అయ్యా, అమ్మా వచ్చారు నాలుగు రోజులపాటు నన్ను బ్రతిమాలారు. నేను రానంటే రానన్నారు. మా అమ్మా మరీ మరీ ఏడిచిందండి! నాకు వెళ్ళబుద్దికాలేదు వాళ్ళెళ్ళిపోయారు. నాలుగైదు మాసాలు, ఇదిగో అదిగో అంటు నన్ను బులిపించాడువాడు. ఉన్న సొమ్మంతా ఖర్చయిపోయింది. తిండికి గూడా కటకటపడ్డాను. వాడు చెప్పకుండా వెళ్ళిపోయాడు" అన్నది తాయారు.
మంగమ్మ గుండె గుభిల్లుమన్నది.
"పోనీ నువ్వెక్కడన్నా ప్రయత్నం చెయ్యకపోయావా?" అన్నది మంగమ్మ.
"తిరిగానమ్మా! కడుపునాయగట్టుకొని అన్ని కంపెనీల చుట్టూ తిరిగాను. ఇదిగో అదిగో ననడమేగానీ, ఏమీ లాభంలేకపోయింది. ఆఖరికి ఎక్స్ ష్ట్రా వేషాలక్కూడా సిద్ధపడ్డాను. అదీ అంతంత మాత్రంగానే ఉంది. రోజల్లా స్టూడియోలోపల పడిగాపులు గాస్తే అయిదారు రుపాయలన్నా దొరకవమ్మా! అవన్నా వెంటనే చేతుల్లో పడవు. ఆ ముష్టి అయిదురూపాయల కోసం కంట్రాక్టరు చుట్టూ తిరగాలి. వాడు రేపురా మాపురా అంటూ మాసాలకొద్దీ తిప్పుతాడు. పాటికి పదిసార్లడిగితే, "ట్రబుల్ సం ఆర్టిస్టు" అని టాం టాం కొట్టి ఇంకో సారి పిలవడు. అడక్కపోతే అసలే వసూలుకాదు. సంవత్సరానికి అయిదారు చిన్నవేషాలు దొరికితే అక్కడికి అదృష్టమేననుకోవాలి. ఆ డబ్బు లోనూ, రూపాయికి పావలాలు కమిషనుపోను, మిగతావి చేతికిస్తారు. ఈ వేషాలకయినా వొళ్ళొప్పగించాల్సిందేనమ్మా ! నాకు రోత పుట్టింది. ఫల్టును వొగ్గేసినా, పనిచేసుకుబతుకుతున్నాను. నా ప్రాణానికి హాయిగా ఉంది!" అన్నది తాయారు.
మంగమ్మకు చలిజ్వరం కమ్ముకొచ్చినట్లయింది. చెవుల్లో సన్నని రొద ప్రారంభమయింది. తల చిట చిట లాడిపోయింది. ఏదో మైకం కమ్మిన దానిలాగా కుర్చీలో అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోయింది.
"ఏందమ్మా!" అన్నది తాయారు.
మంగమ్మ కామాటలు వినిపించాయో లేదో గానీ, ఆవిడమాత్రం ఏమీ పలకలేదు. మూసుకొన్న కనురెప్పలు తడితడిగా ఉండటం తాయారు చూసింది.
"ఎంత మంచితల్లో!" అనుకొన్నది తాయారు. పమిటతో మంగమ్మకు మెల్లిగా విసురుతూ.
చాలా సేపటిగ్గానీ మంగమ్మ తిరిగి మామూలు స్థితికి రాలేకపోయింది. ఆవిడ మనస్సిప్పుడు కందిరీగల తుట్టేలా వున్నది. రకరకాల భయాలు మోసులెత్తి తక్కిస మక్కిసలాడసాగాయి, తనకూ తాయారుకూ ఏవో దగ్గరి సంబందాలున్నట్టూ, తన భవిష్యత్తు కూడా తాయారు చెప్పినట్లుగానే తయారు కాబోతున్నట్లూ మంగమ్మ కనిపించింది.హఠాత్తుగా ఆవిడకు - చలపతి తనను మోసం చేశాడన్న ఊహ తట్టి గిజగిజ లాడిపోయింది. తను తిండికి గుడ్డకూ ముఖం వాచి, బస్సుగ్గూడా డబ్బులేక, కాలినడకన సినిమా కంపెనీలచుట్టూ తిరిగినట్టూ, వాళ్ళు "ఇదిగో-అదిగో" అంటూ తిప్పినట్లూ, చివరికి ఏ గతీలేక, తిరిగీ గుంటూరు చేరుకొన్నట్లు -ఓ చిన్న "చలనచిత్రం" మరోవీధిలో మెరిసి మాయమైంది.
"జరగదు-జరగదు-అలా ఎన్నటికీ జరగదు" అన్నది మంగమ్మ.
"ఏం దమ్మాయిగారూ! మీలో మీరే ఏదో అనుకుంటున్నారు?" అన్నది తాయారు.
తనలోపల అనుకున్నవన్నీ -పైకే అనేస్తున్నట్లు మంగమ్మ కింకా తెలీదు.
"తరువాత?" అని అడిగింది మంగమ్మ,
ఏం తరువాతనో తాయారు కర్ధంకాలేదు. అది కొంతసేపు మంగమ్మ కేసి అదేపనిగా చూసి తలదించుకుంది.
"ఇలా ఎంతకాలం గడుపుతావు తాయారూ?" అన్నది మంగమ్మ.
"ఏం చేయ్యనమ్మా! ఎరక్కెరక్క ఈ గోతిలోకొచ్చి పడ్డాను. తిరిగి బయటికెళ్ళడం తెలవదు. ఓపికున్నంత కాలం, రెక్కలమీద బతుకుతాసచ్చినాననుకోండి - ఏ ధర్మప్రభువో అవతలకీడ్చేస్తాడు గానీ, శవాన్ని వుంచుకోడుగందా!" అన్నది తాయారు.
తాయారు నడిగి ఇంకా చాలా సంగతులు తెలుసుకోవాలనుకొంది మంగమ్మ. కానీ అడగబోయేసరికి ఒక్కటీ జ్ఞప్తికి రాలేదు. మంగమ్మ వోసారి లోపలికెళ్ళి తిరిగివచ్చి తాయారు చేతిలో పాతిక రూపాయలు పెడుతూ "నీకు అవసరమైనప్పుడల్లా నన్నడుగుతుండు నేనిల్లా యిచ్చానని చలపతితో అనబోకు" అన్నది.
