Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 5

 

    ఒక ఆలోచన వచ్చింది. సుందర్రావు పేట వెడితే!
    మళ్ళీ నువ్వక్కడికి రావద్దని చెప్పిందామె. అది హెచ్చరిక కావచ్చు. లేక యధాలాపంగా చెప్పి ఉండవచ్చు. చిత్ర గురించిన వ్యక్తిగత సమాచారం ఏమీ లేని నాకు ప్రస్తుతం అక్కడికి వెళ్ళడం మాత్రమే ఏకైక మార్గం కనబడింది.
    రిక్షా వాడితో పెద్ద గొడవ పెట్టుకొనవసరం లేకుండా సులువుగా బేరం దొరికింది. తెలిసిన ఇల్లే కాబట్టి పట్టుకునేందుకు కెంతో సేపు పట్టలేదు.
    అదెఇల్లు ఇంటి ముందు కుక్కలున్నాయ్ జాగ్రత్త అన్న బోర్డు.

                                    5
    గేటు తీసి లోపల అడుగు పెట్ట బోయేటంతలో భోంయ్ మని భయంకరమైన కుక్క అరుపు వినపడింది. ఆప్రయట్నంగా వెనకడుగు వేసి గేటు వేసేశాను.
    నేనిప్పుడు గేటు కివతల ఉన్నాను. అవతల పక్కగా సింహం లాంటి అల్సేషియన్ కుక్క ఉన్నది. అది నా వంక గుర్రుగా చూస్తోంది. అప్పుడప్పుడు మొరుగుతోంది. దాని మొరుగు చాలా భయంకరంగా ఉంది. మురిగే కుక్క కరవదన్న సామెత నిజమే అనుకుంటే గేటు కవతల ఉన్నది కుక్క కాదు, క్షణం లో ప్రాణ గండం తప్పింది కానీ, లేకపోతె ఈ కుక్క నన్ను చీల్చి చెండాడి ఉండేదని పించింది.
    అయితే మొన్నటి రోజున నేను వచ్చినప్పటికీ కుక్క లేదు. బోర్డున్నా ధైర్యంగా లోపలకు అడుగు పెట్టాను. ఏమీ జరుగలేదు. ఈరోజీ కుక్క ఎక్కడ్నించి వచ్చింది?
    ఆలోచిస్తూ ఇంకా అక్కడే నిలబడి వున్నాను. కుక్క ఇంకా భయంకరంగా మొరుగుతూనే ఉంది. ఇంతలో ఇంట్లోంచి ఎవరో వచ్చారు. మనిషికి యాభై ఏళ్ళు వుంటాయి. బుగ్గ మీసాలున్నాయి. పచ్చగా డబ్బపండు లాగున్నాడు. చూడగానే గొప్ప వాడని పిస్తోంది. "నమస్కారమండీ!" అంటూ అరిచాను. కుక్క మొరుగును చేదించుకుని నా కంఠం వినిపించడం కోసం.
    "ఎవరది" అంటూ అయన కూడా అరిచి, "జానీ క్వయిట్" అన్నాడు. కుక్క స్వరం ఆగిపోయింది. అయన నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. గేటు దగ్గరకు.
    "మీరెవరో నాకు తెలియదు. గేటు దగ్గర కాలింగ్ బెల్ మ్రోగించి వుంటే మా కుక్కే కాలింగ్ బెల్ కావలసిన అవసరం తప్పేది" అన్నాడు నవ్వుతూ అయన.
    "కాలింగ్ బెల్ నేను చూడలేదండీ. అయినా మొన్న మీ ఇంటి కొచ్చినప్పుడు ఏ కుక్కా లేకపోవడం తో కాస్త ధైర్యంగా లోపలకు అడుగు పెట్టబోయాను. అప్పుడే మీ కుక్క కాలింగ్ బెల్లు కావలసి వచ్చింది."
    "మొన్న మీరు మా ఇంటి కొచ్చారా?' ఆయన ముఖంలో కాస్త అనుమానం కనబడుతోంది.
    "అవునండీ , మొన్న మధ్యాహ్నం ఒంటిగంట కు, మీ ఇంటి తలుపులు ఆటోమేటిక్ వి కూడా కదా."
    అయన ముఖంలో అదో రకమైన నవ్వు కనబడింది. "తొమ్మిదిన్నరకే ఎండ గీర తీస్తోంది. ఎండన పడోచ్చినట్లున్నావు. కాస్త లోపలికి రండి మాట్లాడుకుందాం. బయటే నిలబెట్టి మాట్లాదేస్తున్నాను. పరధ్యానం ముందా వాణ్ణి!" అన్నాడు.
    నేను జంకుతూనే లోపల అడుగు పెట్టాను. కుక్క ఇంకేమీ మొరగలేదు. అది శిక్షణ పొందిన మంచి జాతి కుక్కై వుండాలి. గేటు కవతలే ఉండి మొరిగింది గానీ, దూకి బయటకు రావడానికి ప్రయత్నించలేదు. ఇంటాయనే నన్నాహ్వానించడం చూసి పిల్లిలా మెదలకుండా ఊరుకుంది.
    నేనా ఇంట్లో అడుగు పెట్టాను. ఏర్పాట్ల లో యే మార్పులూ లేవు. ఆరోజు నేను చూసిన విధంగానే ఉంది. ఒకసారి గదంతా పరిశీలించి చూశాను. కోట్టొచ్చి నట్లు గోడకు తగిలించిన లక్ష్మీదేవి పటం కనబడింది. ఆ రోజున ఈ పటం లేదు.
    "అలా కూర్చోండి" అన్నాడాయన.
    సోఫాలో కూర్చున్నాను. అదే అనుభవం. చాలా కంఫర్టబుల్ గా ఉంది.
    "ఇప్పుడు చెప్పండి. మా ఇంటికి మీరు మొన్న వచ్చేరా?" అడిగేడాయన.
    'అవునండీ, చిన్న పని మీద వచ్చాను?"
    "ఎవరిని కలుసుకున్నారు?"
    ఒక్క క్షణం తటపటాయించాను. యేమని చెప్పాలి? నిజం చెబితే చిత్రకూ కోపం రావచ్చు. అబద్దం చెబితే ఈయన్ను నమ్మించడం కష్టం. జాగ్రత్తగా నిజాన్ని, అబద్ధాన్ని కలగా పులగం చేయాలి.
    "మీరేమీ అనుకోనంటే చిన్న ప్రశ్నడుగుతాను . చిత్రాగారు మీకేమవుతారు?"
    'చిత్ర ఎవరు?" అన్నాడాయన అదోలా ముఖం పెట్టి"
    "ఆమెను కలుసుకునేందుకే నేనీ ఇంటికి వచ్చాను. ఆమె నా స్నేహితురాలు!"
    "ఎంత వయసుంటుందామెకు?" ముసలాయన భ్రుకుటి ముడతలు పడింది.
    "ఇరవైకి అటో ఇటో...."
    "ఈ ఇంట్లో ఉంటున్న స్త్రీ ఒక్కరే. ఆమె పేరు చిత్ర కాదు. ఆమె వయస్సు ఇరవై కి దరిదాపుల్లోనూ లేదు" అన్నాడాయన.
    "ఆశ్చర్యంగా ఉందే!" అన్నాను.
    "మీకంటే నాకెక్కువ ఆశ్చర్యంగా ఉంది. ఇది నా స్వార్జితం తో కట్టించిన ఇల్లు. దీనికి తెలిసి నేను ఆటోమేటిక్ తలుపులు పెట్టించలేదు. మీరవి ఆటోమేటిక్ వన్నారు. ఈ ఇంట్లో ఒక ఆడపిల్లను కలుసుకుంటున్నా నంటున్నారు. అదీ అసహజంగానే ఉంది. ఈ మధ్య కాలంలో మా ఇంట ఆ పేరుతొ ఆ వయసు పిల్ల మసల లేదు.
    "ఇంతకీ ఈ ఇంట్లో ఒకే ఒక ఆడపిల్లుందంటున్నారు . ఎవరామె?"
    "ఆడపిల్ల కాదు. స్త్రీ , ఆమె నా భార్య!"
    "మొన్నంటే మొన్న , మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల వరకూ ఈ ఇంట్లో మీరున్నారా?"
    "లేము, సినిమాకు వెళ్ళాము."
    "మీ కుక్క ను కూడా తీసుకు వెళ్ళారా?"
    "లేదు"
    "ఇంట్లో ఇంకెవరైనా మనుషులున్నారా?"
    "లేరు?"
    "మొన్న మధ్యాహ్నం ఒంటి గంటకు నేను మీ ఇంటికి వచ్చాను. మీ కుక్క లేదు. తలుపులు ఆటోమేటిక్ గా తెరచుకున్నాయి. లోపల ముగ్గుర్ని కలుసుకున్నాను. ఇద్దరు అబ్బాయిలు, ఒకమ్మాయి. అమ్మాయి పేరు చిత్ర. అబ్బాయిల పేర్లు నాకు తెలియవు."
    "కలుసుకుని ఏం చేశారు?"
    "యేవో వ్యాపార విషయాలు మాట్లాడుకున్నాం!"
    "ఏం వ్యాపారం?"
    "ఇంకా మొదలు కానిదే నేను వ్యాపారం చేద్దామను కుంటున్నాను. చిత్ర పెట్టుబడి పెడదామనుకుంటోంది. ఆమెకు డబ్బుంది. నాకు తెలివుంది. ఇంకా వ్యాపారం మొదలు కావడమే తరువాయి."
    "ఇంతకీ ఈ ఇల్లెవరిదో తెలుసా?" అడిగాడాయన.
    తల అడ్డంగా ఊపాను.
    "మా అబ్బాయి పోలీసాఫీసర్!"
    ఉలిక్కిపడ్డాను. కోరి చిక్కుల్లో పడలేదు గదా! చిత్ర నన్ను మళ్ళీ రావద్దని హెచ్చరించడానికి కారణమిదే నెమో. అయితే నన్ను కలుసుకునేందు కామె పోలీసాఫీసరింటికి నెందుకేన్నుకుంది?
    లేచి నిలబడ్డాను. 'చిత్రను కలుసుకుందామని వచ్చాను. వస్తాను."
    "ఏదైనా పుచ్చుకుని వెళ్ళకూడదు."
    "వద్దులెండి . అర్జంటు పని ఉంది" కదిలాను.
    "మీ పేరు?' అడిగాడాయన.
    "నరసింహమూర్తి,. ప్రకాశ్ నగర్లో ఉంటున్నాను. రూమ్ నెంబర్ 27" అన్ని అబద్దాలే చెప్పాను.    
    ఆ ఇంట్లోంచి బయట పడ్డాక బుర్ర మళ్ళీ తీవ్రంగా పని చేయసాగింది. చిత్ర గుండెలు తీసిన బంటులాగా వుంది. ఒక పోలీసాఫీసరింటికీ వజ్రాలున్న పెట్టెతో వచ్చింది. తన వ్యవహారాలన్నీ అక్కడే సెటిల్ చేసుకుంది. ఆ ఇంటి వాళ్ళకి చిన్న అనుమానమైనా కలగలేదు.
    నడుచుకుంటూ కొంతమేర వెళ్ళి రిక్షా ఎక్కాను. సిటిలో కాస్త సెంటరైనా గోపాల్ పూర్ కు పోనీయమన్నాను. బెరమాడలేదు.

                                  6
    గోపాల్ పూర్లో దిగి మళ్ళీ హోటల్లో దూరాను. కాఫీతాగి రోడ్డు మీదకు వచ్చెను. ఒకో షాపు వంకే చూస్తూ నడుస్తున్నాను. గాజుల దుకాణం లోంచి బయటకు వస్తున్న చిత్ర కనిపించింది. ఉవ్వెత్తున ఉత్సాహం పొంగింది నాలో. రెండంగల్లో ఆమెను సమీపించి , "నీ గురించి తెగ గాలిస్తున్నాను. ఎక్కడున్నావ్ చిత్రా!" అన్నాను.
    "మిస్టర్ అపరిచయస్తుల ఏకవచన ప్రయోగం నాకు నచ్చదని రెండోసారి చెప్పాలా?' అందామె తీవ్రంగా.
    ఉలిక్కిపడ్డాను.
    చిత్ర ఇలా మాట్లాడ్డం ఇది రెండో సారి.
    "కానీ నేను నీకు పరిచయస్తుడౌతానూ చిత్రా?
    "నాపేరు చిత్ర కాదని మళ్ళీ రెండోసారి చెప్పాలా?
    "అవసరం లేదు. నీ పేరు చిత్ర కాకపోవచ్చు . మొన్ననే నీతో అన్నాను. నీ అసలు పేరిదేతైనేం నువ్వు నీ నోటితో చెప్పిన పేరు చిత్ర."
    ఆమె విసుగ్గా నా వంక చూసి , "ఎందుకిలా వెంట పడ్డావ్?" అంది.
    'అలా అడుగు చెబుతాను. మొన్న నువ్వు సుందర్రావు పేటలో సూట్ కేసిచ్చావా? అందులో వన్నీ కాళీ అయిపోయాయి. ఎలా పోయాయో తెలియదు. దాంతో పాటే నువ్వు నాకిచ్చిన బహుమతులు పోయాయి."
    ఆమె పకపకా నవ్వి , "ఇంకా" అంది.
    "ఇంకేం లేదు. ఈ విషయాన్ని చెబుదామని సుందర్రావు పేట లో నూటపడమూడో నంబరింటికి వెళ్ళాను. అక్కడ నిన్ను కలుసుకోవచ్చని ఆశ పడ్డాను. కానీ ఆ ఇల్లు పోలీసాఫీసరుది. చిత్ర పేరుగల వారెవ్వరూ ఆ ఇంట్లో ఎన్నడూ మసలలేదని ఇంటాయన నొక్కి చెప్పాడు."
    ఆమె కుతూహలంగా నావంక చూసి "ఆతర్వాత?" అంది.
    "ఏముంది, ఇక్కడకు వచ్చాను. వెతకబోయిన తీగ కాళ్ళకు చుట్టుకున్నట్లు నువ్వు కనిపించావు!" అన్నాను.
    ఆమె వస్తున్నా నవ్వు నాపుకునేందుకు ప్రయత్నిస్తూ "ఏవండీ , ఒకసారి మా ఇంటి కోస్తారా?' అనడిగింది.
    "తప్పకుండా , నీ ఇల్లు తెలిస్తే ఏ బాధ లేదు" అన్నాను.
    "అయితే రండి. నాకో చిన్న సహాయం చేసి పెట్టాలి!" అందామె.
    "ఏమిటది?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS