Previous Page Next Page 
వసుంధర కధలు-6 పేజి 41

 

    "ఏం చేస్తావ్?' అన్నాడతను.
    "ఏదో ఒకటి చేస్తాన్లెండి. మీరటు కేసి తిరగండి -" అంది యమున. ఇలాంటి సమయాల్లో ఆమెకు భర్తంటే అనుకోకుండానే చిరాకు కలుగుతుంటుంది.
    వాసు అటుకేసి తిరగాలనే అనుకున్నాడు . కానీ భార్య తేలును చంపగలదా? ఒకవేళ ఆదామేను కుడితే! తేలు చంపబడుతుందన్న భయమూ, తేలు ఆమెను కుడుతుందన్న అనుమానమూ -- రెండూ కలిసి అతణ్ణి ఏ నిర్ణయానికీ తీసుకు రాలేకపోతున్నాయి.
    యమున కర్రతో తేలును పొడిచింది. తేలు గోడ వారనే నాలుగడుగులు ముందుకి కదిలింది. ఆమె "కోడి....కోడి.....కోడి...." అంటూ ఆగిన తేలుని మళ్ళీ పొడిచింది. అలా గోడవారన కొంతదూరం కదిలాక తేలు శరవేగంతో తనదారి మళ్ళించి యమునను సమీపించింది.
    కెవ్వుమని అరిచింది యమున'.
    తేలామేను కుట్టింది.
    యమున బాధతో మెలికలు తిరిగిపోతోంది. తేలు ఉన్నట్లుండి అక్కణ్ణించి మాయమైపోయింది.
    వాసు చటుక్కున మంచం దిగి భార్యను రెండు చేతుల్తో ఎత్తుకుని వచ్చి మంచంమీద పడుకో బెట్టి -- "నొప్పిగా వుందా యమునా!" అన్నాడు.
    ఆ సమయంలో యమునకు వళ్ళు మండిపోయింది -- "లేదండీ -- చాలా హాయిగా వుంది!" అంది.
    "నన్ను క్షమించి యమునా!" అన్నాడు వాసు.
    "ఈ బాధలో నేను ఎవరినీ క్షమించలేను. అయినా మీకేం భయం లేదు లెండి. పారిపోయిన ఆ తేలు ఏ మూల నుండో మిమ్మల్ని చూస్తూనే వుంటోంది. మీరు దాన్నయితే చంపలేరు. కానీ నా బాధ చూడగలరు కదా!" అంది యమున. ఆమె బాధ భరించలేక గట్టిగా అరుస్తోంది ఏడుస్తోంది భర్తను తిడుతోంది . విషం పైకెక్కకుండా ఆమె మోకాలుకీ గట్టిగా చీర కొంగుతో కట్టు కట్టింది. కానీ బాధ తగ్గలేదు.
    వాసు ఉప్పు కిరసనాయలు, ఉల్లిపాయ వగైరా లుపయోగించి కొన్ని గృహ వైద్యాలు చేశాడు. యమునకు ఉపశమనం కలిగినట్లు లేదు.
    "రాత్రి తెల్లవార్లూ ఈ బాధ నువ్వు భరించలేవు. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను. వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను...." అన్నాడు వాసు.
    "ఈ సమయంలో మీరిప్పుడెక్కడికి వెళ్ళొద్దు--" అంది యమున.
    "ఇంకా మన భోజనాలు కూడా కాలేదు. ఇప్పుడే వచ్చేస్తాగా ...." అంటూ వాసు ఆమె అనుమతి కోసం ఎదురు చూడకుండా బయటకు వెళ్ళిపోయాడు.
    యమున బాధతో మూల్గుతూ కూర్చుంది. అలా ఎంతసేపుందో ఆమెకే తెలియదు. కాసేపటికామెకు బాధ తగ్గకపోయినా వాసింకా రావడం లేదేమిటా అన్న బెంగ పట్టుకుంది. టైము చూద్దామంటే అలారం టైం పీసు బల్ల మీద అటు తిరిగి వుంది. మంచం దిగి టైము చూసే  ఓపికామెకు లేదు. ట్రాన్సిస్టర్ రేడియో మంచంమీడనే వుంది. ఆమె దాన్ని అన్ చేసింది.
    రేడియో లో ఇంగ్లీషు వార్తలు వస్తున్నాయి.
    "అబ్బా- టైం తోమ్మింది దాటిందా? ఏడున్నర కాకుండా బయల్దేరిన మనిషి ఇంత సేపే డాక్టరు దగ్గర ఆగిపోయారు చెప్మా?' అనుకుంది యమున. అప్పుడే ఆమెకు భర్త వెళ్ళాక తను తలుపులు వేసుకోలేదన్న సంగతి గుర్తుకు వచ్చింది. కానీ మంచందిగి వెళ్ళి తలుపులు వేసే శక్తి అమెకున్నట్లు లేదు.
    "నేనింత బాధలో వున్నానని ఆయనకు తెలుసు. నన్నిలా నిర్లక్ష్యంగా వదిలి వెళ్ళిపోయారు. ఇంట్లో ఏమైనా పొతే అయన కర్మ, నేనేం చేస్తాను...." అనుకుంది యమునా చిరాగ్గా.
    చూస్తుండగా టైము పదయింది. పదకొండయింది.
    యమున బాధ తగ్గడం లేదు. వాసు రావడం లేదు. యమునకు కంగారు పట్టుకుంది.
    చివరి కామె ఓపిగ్గా ఎలాగో ధైర్యం చేసుకుని -- మంచం దిగి కుంటుకుంటూ వీధి తలుపులు వేయడానికి వెళ్ళింది.
    అప్పుడే వీధి తలుపులు తోసుకుని వచ్చాడో వ్యక్తీ.
    "ఏమండీ వచ్చారా?' అంది యమున. ఆ ప్రశ్న వేశాక వచ్చిన వ్యక్తీ తన భర్త కాడని గుర్తించింది యమున. అతడి చేతిలో కత్తి వుంది.
    "అరవకు, అరిచావంటే చంపేస్తాను...." అన్నాడా వ్యక్తీ తలుపులు వేస్తూ.


                                     9
    మంచం మీద పడుకుని నవల చదువుకుంటోందామె . ఎవరో తలుపు తట్టారు.
    ఆమె నవల దిండు కింద పెట్టి లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా కనపడ్డ వ్యక్తిని చూసి ఆశ్చర్యంగా -- "నువ్వా అన్నయ్యా--" లోపలకు రా! " అంది!
    అతను మౌనంగా లోపలకు వచ్చాడు. ఆమె తలుపులు వేసి అతన్ని సమీపించి -- "నువ్వెంతో మంచివాడివి. నీ కారణంగా ....." అని ఏదో అనబోగా అతడు మాట్లాడవద్దన్నట్లు సైగ చేశాడు.
    "ఏం- ఏం జరిగింది?' అందామె.
    "నేనీపూట ఇక్కడే భోం చేస్తాను. ఈ రాత్రి ఇక్కడే పడుకుని ఉదయం వెళ్ళిపోతాను -" అన్నాడతను. అతనామే వంకనే చూస్తున్నాడు. కానీ అతడి కళ్ళామెనూ చూస్తున్నట్లనిపించదు. గుడ్డువాడి చూపులా ఉందది.
    "చాలా సంతోషం. ఇప్పుడె వంట చేస్తాను--" అంటూ వెళ్ళిపోయిందామె.
    అతనక్కడ మౌనంగా కూర్చుని ఉండిపోయాడు. తర్వాత ఆమె భోజనానికి పిలిస్తే వెళ్ళాడు. వడ్డిస్తే భోం చేశాడు.
    తర్వాత అమె గదిలోంచి ఓ మడత మంచం తెచ్చి హల్లో వేసింది. దాని మీద దుప్పటి పరిచి తలగడ వేసి -- "పడుకో అన్నయ్యా--" అంది . అతనా మంచం మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు. ఆమె తన గదిలోకి వెళ్ళి పడుకుంది.
    అతనికి వెంటనే నిద్ర పట్టినట్లుంది. సన్నగా గురక కూడా ఆరంభించాడు. ఆమెకు మాత్రం నిద్ర పట్టినట్లు లేదు. చదువుతున్న నవలను మాత్రం ఆమె పూర్తీ చేయలేదు. గదిలో దీపం ఆర్పేసి అతడి రాకలోని అంతర్యం గురించి ఆలోచిస్తూ మంచం మీద దొర్లుతున్నదామె. చాలా సేపటికి ఆమెకు నిద్రపట్టింది.
    ఆరాత్రి వేళ అతను ఉలిక్కిపడి లేచాడు. మంచం మీద కూర్చుని కళ్ళు నులుముకున్నాడు. ఒక్క క్షణం తర్వాత అతను మంచం దిగాడు. అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె గదిలోకి ప్రవేశించాడు.
    అప్పటికామేకు బాగా నిద్రపట్టినట్లుంది. వంటి మీద దుస్తులు అస్తవ్యస్తంగా వున్నాయి.
    అతనామెను సమీపించి పరీక్షగా చూశాడు. చూస్తున్న కొద్దీ మనిషిలో ఆవేశం పెరుగుతున్నదనిపించింది. చాలాసేపు అతను ఆచ్చాదన లేని ఆమె గుండెల వైపే చూసి నెమ్మదిగా ఆమెకు పక్కగా తనూ పడుకున్నాడు. అప్పటికీ ఆమెకు మెలకువ లేదు.
    అతనామెకు దగ్గరగా జరిగాడు. మీద చేయి వేశాడు. అప్రయత్నంగా ఆమె అతడికి దగ్గరగా జరిగింది. అతడుత్సహంగా ఆమెను కౌగిలిలో బంధించాడు.
    అమెఉలిక్కిపడి అతన్ని తోసేసింది.
    అతనామెను మళ్ళీ దగ్గరగా లాక్కున్నాడు. ఈసారి ఆమె అతన్ని విదిపించుకోలేకపోయింది. కౌగిలిలో బిగిస్తుంటే భయంగా -- "ఏమిటిది?' అంది.
    అతను జవాబివ్వలేదు. ఆమె బట్టలు విప్పడానికి ప్రయత్నిస్తున్నాడు.
    ఆమె మళ్ళీ అతన్ని తోసేసి -- "అరిచి నలుగుర్ని పిలుస్తాను. అవతలకు పో!" అంది.
    అతను మొల్లోంచి కత్తి తీశాడు -- "అరిచావంటే వెంటనే చస్తావ్ -- మర్యాదగా లొంగిపో --" అన్నాడు.
    ఆమె భయంగా అతడి చేతిలోని కత్తి వంక చూసింది. అది తళతళ మెరుస్తోంది. తర్వాత ఆమె అతడి కళ్ళ వంక చూసింది. అతడి చూపులు క్రూరతి క్రూరంగా వున్నాయి.
    "నన్ను చంపుతావా?' అందామె.
    "చంపే ఉద్దేశ్యం నాకు లేదు. కానీ నువ్వా అవసరం కల్పిస్తే చంపడానికి వేనుదీయను..."
    అతడి కంఠస్వరం కఠినంగా వుంది. అతడి చేతిలోని కత్తి కంటే -- కంఠంలోని కరుకుదనం , చూపుల్లోని క్రూరత్వం ఆమె నెక్కువగా భయపెడుతున్నాయి.
    "ప్లీజ్ నా జోలికి రాకు...."అందామె.
    అతడామెను సమీపించాడు.
    "ప్లీజ్----వద్దు!" అందామె.
    ఒకచేయి కత్తిని ఆమె గుండెలకు అన్పించి , రెండో చేయి ఆమె బట్టలను విప్పుతోంది.
    ఆమె కళ్ళలో ప్రాణ భయం -----మనసులో బెదురూ------శరీరమంతా అదోరకమైన కంపన -----భవిష్యత్తు గురించి ఎన్నో రకాల ఆలోచనలు.
    అతడి కత్తి ఆమె గుండెలపై అని వుంది. ఇప్పుడామె గుండెల పై ఆచ్చాదన లేదు.
    ఆమెకు అరవాలని వుంది. కానీ అరిస్తే అతను నన్ను చంపేస్తాడు.
    అతడామెను దగ్గరగా లాక్కుంటుంటే ఆమె శరీరం అసహ్యంతో కంపిస్తోంది. కత్తి మనసును భయపెడుతుంటే తనువు అతడికి లోంగిపోతోంది.
    అమెకిప్పుడు చేతనయింది ఒక్కటే -- ఏడుపు!
    అతడు సాచి ఆమెను లెంపకాయ కొట్టాడు -- "ఇడియట్! సంతోషంగా ఉండాల్సిన ఈ టైములో ఏడుస్తావా-- నవ్వు.....ముందు నవ్వు....."
    ఆమెకు నవ్వు రావడం లేదు. ఏడుపే వస్తుంది.
    నవ్వకపోతే అతడు కొడుతున్నాడు. ఆమెను హింసించి ఆనందిస్తున్నాడు.
    చివరి కామే నవ్వింది. పిచ్చి దానిలా నవ్వింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS