ఆ తర్వాత మాణిక్యాలరావు కోసం మాములుగా వెదకడం ఆరంభమయింది. అయితే అతను వూరంతా గాలించినా దొరకలేదు. దాంతో అందరికీ కంగారు ప్రారంభమయింది. శేషావతారం మేకపోతు గాంబీర్యం వహించాడు కానీ చంద్రవంక ఎడ్చేస్తోంది.
ఆఖరికి ఆ రాత్రి తొమ్మిది గంటల వేళ ఊరి చెరువులో మాణిక్యాలరావు శవం ఉన్నట్లు కనుక్కోవడం కరిగింది.
ఆ చెరువు యిప్పుడు వాడకం లో లేదు. అందులోకి మొసలి చేరిందన్న పుకారు కారణంగా ఎవ్వరూ ఆ ప్రాంతాల క్కూడా వెళ్ళడం లేదు. మాణిక్యాలరావు ఆ చెరవు దగ్గరకు ఎందుకు వెళ్ళాడో, ఎలా వెళ్ళాడో అన్నదో ప్రశ్న అయితే, అందులో మునిగి చనిపోవడం ఎలా జరిగిందన్నది రెండో ప్రశ్న.
"మావాడికి ఈత బాగా వచ్చు. చెరువులో యెలా చచ్చి పోయాడో నాకు పాలు పోవడం లేదు" అన్నాడు శేషావతారం శవాన్ని చూడగానే వచ్చిన దుఃఖాన్ని అణచుకొన్న కాసేపటికి.
ఊళ్ళో చాలామంది మనసుల్లో అమ్మవారు మెదిలింది. మాణిక్యాలరావు చెప్పిన ప్రకారం అమ్మవారతనికి ముందుగానే కనిపించి - ఇంక ఒక్కరోజు మాత్రమే అయుష్షు న్నదని అంది. ఆమాటే నిజమైంది.
ఈ విషయం ఏం చేయాలన్న విషయంలో కొంత తర్జన భర్జన జరిగింది. పోలీసులకు చెప్పాలని కొందరూ, వద్దని కొందరూ అనసాగారు.
'అసలే కొడుకు పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వాళ్ళను పోలీసులు ప్రశ్నలతో వేధిస్తారు. పోలీసులు వస్తే మాత్రం పోయిన కుర్రాడు బ్రతికోస్తాడా ?" అన్నారు కొందరు.
"ఇది అమ్మవారు తీసుకున్న నరబలి . పోలీసులు కలగ జేసుకుంటే ఆవిడ కోపం ఇంకా పెరుగుతుందేమో --" అన్నారు ఇంకొందరు.
"బాగుంది , ఒకోసారి ఇలాంటి విషయాల్లో ఏదో లొసుగులుంటుంటాయి. పోలీసులకు చెప్పడమే ఊరికి మంచిది" అన్నారు మరికొందరు.
శేషావతారం పిచ్చివాడిలా శూన్యంలోకి చూస్తున్నాడు.
6
పోలీసులు పరిశోధనలో పెద్ద విశేషాలేమీ బయటపడలేదు.
ఈత రాణి కుర్రాడు నీళ్ళ మధ్యలో చిక్కుకొని చనిపోయి వుండాలని వారు నిర్ణయించారు. అయితే వారు ఎందర్ని ప్రశ్నించినా మాణిక్యాలరావు నీళ్ళ మధ్యకు వెళ్ళవలసిన అవసర మేమిటో జవాబు దొరకలేదు. మాణిక్యాలరావును ఈత రాని వాడుగా అనుకొంటే సమస్య కొంతమాత్ర మైనా పరిష్కారమయ్యేది. అతను ప్రవాహం లో కూడా బాగా ఈత కొత్తగలడంటున్నారు . అటువంటప్పుడు చెరువులో వచ్చిన ఇబ్బందేముంటుంది ?
లభించిన సమాచారాన్ని బట్టి -- మాణిక్యాలరావు ను ఎవరో బలవంతంగా చెవురు మధ్యకు తీసుకెళ్ళి నీటిలో ముంచి -- తేలకుండా అదిమి పట్టి వుంచి వుండాలి. అలా చేయగల వ్యక్తీ మంచి ఈత గాడయి వుండాలి . బలం గల వాడై వుండాలి.
మాణిక్యాలరావు సహాధ్యాయులలో అటువంటి వాడు యెవరూ లేరు. ఊళ్ళో చాలామంది బలాధ్యులూ, గజ ఈతగాళ్ళూ వున్నారు కానీ మాణిక్యాలరావు ను చంపడానికి ఏ కారణం చూపిస్తారు.
మాణిక్యాలరావుది చావు కాదనీ హత్య అనీ తేలగానే చాలామందికి భయం పట్టుకుంది. మాణిక్యాలరావుది హత్య చేయవలసిన అవసరం ఆ వూళ్ళో ఎవరికీ లేదు కాబట్టి ఇది ఏదో మానవాతీత శక్తి పని అనుకోవాలి. అంటే అమ్మవారు తీసుకొన్న నరబలి అయుండాలి.
పోలీసులీ కేసును సీరియస్ గా తీసుకోలేదు. వివరాలు నమోదు చేసుకొని వెళ్ళిపోతూ -- పనికివచ్చే సమాచారం లభిస్తే అంత చేయమని కోరాను వారు.
పనికివచ్చే సమాచారం ఇంకేం లభిస్తుందని గ్రామ స్తులం అనుకొన్నారు. కానీ త్వరలోనే తమకు మళ్ళీ పోలీసులతో అవసర పడుతుందని అప్పుడు గ్రహించలేదు.
మాణిక్యాలరావు హత్య జరిగిన వారం రోజులకి ఊళ్లోకుర్రాళ్ళు ఊరి చివర పాడుబడ్డ అలయానికిపోయి ఆడుకుంటున్నారు.
ఆ ఆలయం ఏ శతాబ్దానిదో తెలియదు. కానీ అద్బుత మయిన కట్టడం . గుర్తింపు లేకుండా పడి వున్న ప్రాచీన శిధిలాలయాల్లో అదొకటి. ఊళ్ళో పిల్లలకు అట స్థలంగా ఉపయోగపడుతోంది. అందులో అయిదు చీకటి గుహలు వున్నాయి. ఆ గుహల్లో కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి వుంటుంది. కుర్రాళ్ళక్కడ అడుకుందుకో కొత్త అట కనిపెట్టారు.
ఏదో బొమ్మనో, పెద్దదయిన వస్తువునో ఆ అయిదింటి లోనూ ఓ గుహ లో దాస్తారు . దీపం సాయం లేకుండా వెళ్ళి ఆవస్తువు ఏ గుహలో వుందో కనుక్కోవాలి. ఈ ఆటలో రకరకాల రూల్సు , మార్కులు వేసే పద్దతులు వుంటాయి.
మొట్ట మొదట ఒక కుర్రాడు సంచీలో బొమ్మను పెట్టుకుని అయిదు గుహల్లోకి వెళ్ళి వస్తాడు. ఏ గుహలో తను బొమ్మ పెట్టింది తెలియడానికి వీల్లేని విధంగా సంచీని పట్టుకుంటాడతను. అతడు వెళ్ళి వచ్చాక ఒక్కక్కరే అయిదు గుహల్లోకి వెళ్ళి వస్తుంటారు.
బొమ్మను వదిలిన కుర్రాడు గుహలోంచి బయటకు వచ్చి వాడిని ప్రశ్న అడుగుతాడు. అతడు ఉందొ లేదో రహస్యంగా అతనికి చెబుతాడు. దాన్ని బట్టి అతను మార్కులు వేస్తాడు.
కరణంగారబ్బాయి మోహన్ మొదటిగుహలోంచి బయటకు వచ్చి "బొమ్మ కనబడలేదు" అన్నాడు చాచిన వాడితో రహస్యంగా. తర్వాత రెండో గుహలో కెళ్ళాడు. బయటకు వచ్చి "బొమ్మ కనబడింది" అన్నాడు. అయినా అతను మిగతా గుహల్లో కి కూడా వెళ్ళాలి. ఏ గుహలో అతనికి బొమ్మ కనబడింది మిగతా వాళ్ళకి తెలియకూడదు . మోహన్ మూడో గుహలోకి కూడా వెళ్ళి వచ్చి "ఇందాకా నేను చెప్పింది తప్పు. బొమ్మ మూడో గుహలో వుంది . అన్నాడు.
"బాగా ఆలోచించుకు చెప్పు. రెండో గుహలో నా మూడో గుహలోనా" అన్నాడు బొమ్మ దాచి నవాడు.
"సందేహం లేదు, మూడో గుహలోనే వుంది" అన్నాడు మోహన్ నమ్మకంగా.
"సరే - వెళ్ళు " అన్నాడు అతను. ఒకసారి చెప్పి న విషయాన్ని ఖండించినందున కొన్ని మార్కులు పోతాయి.
మోహన్ నాలుగో గుహలోకి వెళ్ళాడు. వెళ్ళినవాడు అయిదు నిమిషాలయినా బయటకు రాలేదు. అందరూ ఓపికగా ఇంకో అయిదు నిమిషాలు ఎదురు చూశారు. అప్పటికి అతడు బయటకు రాలేదు.
"మోహన్ - ఇంక బయటకు వచ్చేసేయ్"అని అరిచాడు ఒకడు.
"లోపలకు వెళ్ళి చూద్దాం"అన్నాడు ఒకడు.
"వెడదాం కానీ వాడేందుకు బయటకు రావడం లేదు" అన్నాడింకొకడు.
ఆ మాటలకు అందరికీ భయం కలిగింది. "వాడికేమైనా అయిందంతావా?" అన్నాడొకడు.
"ఏమో - మరికాసేపు చూసి పెద్దవాళ్ళకు చెబుదాం "
కనుచీకటి పడే సమయమయింది. కానీ మోహన్ మాత్రం గుహమోంచి బయటకు రాలేదు. అంతా కంగారుగా అక్కణ్ణించి బయల్దేరి కరణం గారింటికి వెళ్ళి జరిగింది చెప్పారు.
ఆ కబురు వింటూనే కరణం గారికి కాళ్ళూ చేతులూ ఆడలేదు. అయన ఆడవాళ్ళకి ఏ విషయమూ చెప్పకుండా దేవుడి గదిలో కి వెళ్ళి దణ్ణం పెట్టుకొని ఇంట్లోంచి బయటకు వచ్చి - నలుగుర్ని పోగేసుకుని ఆ శిధిలాలయం చేరుకున్నాడు.
టార్చి లైటు వేసుకొని గుహలో ప్రవేశించే సరికి వాళ్ళకు కనబడ్డ దృశ్యం అత్యంత భయంకరమైనది.
గుహలో తలపగిలి పడి వున్నాడు మోహన్. అతని ప్రాణం యెప్పుడో పోయింది. కొడుకు శవాన్ని చూస్తూ కుప్పలా కూలి పోయాడు కరణం గారు.
పోలీసులు మళ్ళీ రంగంలో ప్రవేశించారు. శవాన్ని పరీక్షించి , పరిస్థితుల నాకళింపు చేసుకొని వారు కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నారు.
చనిపోయిన యిద్దరిలో ఒకడు మునసబు గారబ్బాయి. రెండో వాడు కరణం గారబ్బాయి. ఇద్దరూ గ్రామాధికారులే! అంటే ఇదేదో గ్రామాదికారుల పైన పగ పెట్టుకుని ఎవరో చేసిన వ్యవహారమయుండవచ్చును.
గ్రామాదికారుల కూళ్ళో చాలా లావాదేవీ లుంటూవుంటాయి. చాలామందితో పేచీలు వుంటూ వుంటాయి. ఈ హత్యలకు అదే కారణమయే అవకాశ ముంది.
గుహలో మోహన్ తల పగిలింది. అతడి తల క్రింద రాయి వుంది. క్రింద పడిపోయినపుడు తలకు రాయి తగిలి ప్రమాదం జరిగిందనుకోవచ్చు. కాని రాయి తగిలినప్పుడు మోహన్ పెద్దగా కేక పెట్టాలి. గుహలోంచి కేక పెడితే బయటకు వినిపిస్తుందని ప్రయోగ పూర్వకంగా పోలీసులు తెలుసుకున్నారు. మరి మోహన్ కేక ఎందుకు పెట్టలేదు? ఎవరయినా అతని నోరు నొక్కే వుంచారా ?
మోహన్ ని హత్య కావడానికి అవకాశముంది. అతడి సహాధ్యాయులేవరయినా ఆ పని చేశారనుకునెందుకు అవకాశం కనబడడం లేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు సుమారు పదిహేను మంది కుర్రాళ్ళు కలసి జరిగినది చెబుతున్నారు.
వాళ్ళందరూ బయట వుండగా మోహన్ ఒక్కడూ లోపలకు వెళ్ళడం , అంతకు మునుపు ముగ్గురు కుర్రాళ్ళు అయిదు గుహలలోకి వెళ్ళి సురక్షితంగా బయట కొచ్చారు.
ఈ గుహల అట సుమారు పాతికేళ్ళుగా కొనసాగు తోంది. ఇంతవరకూ ఒక్క చిన్న ప్రమాదం కూడా జరగలేదు.
పోలీసులు చాలామందిని ప్రశ్న లడిగారు. వారికి పనికి వచ్చే సమాచారం లభించలేదు. అయితే ఈ పర్యాయం విషయాన్ని వారంత తేలికగా తీసుకోలేక పోయారు.
అమ్మవారు నరబలి కోరుతున్నదన్న పుకారు ఊళ్ళో ఉన్నట్లుగా గ్రహించి పోలీసులకు ఆ పుకారేలా పుట్టిందన్న ఆధారం కోసం చేసిన ప్రయత్నంలో పూజారి రంగయ్య పై అనుమానం కలిగింది. వారు రంగయ్య ను కలుసుకుని రకరకాల ప్రశ్నలు వేశారు.
ఆర్ధికంగా పూజారి రంగయ్య పరిస్థితి అట్టే బాగోలేదు. అమ్మవారిని ప్రజలాదరించి కానుకలు, దక్షిణ లూ దండిగా సమర్పించుకుంటేనే తప్ప, అతని ఆర్ధిక పరిస్థితి బాగుండదు. అవసరం మనిషిని ఎంతకయినా దిగజార్చ గలదు కాబట్టి, రంగయ్య ఈ హత్యలు చేసినా ఆశ్చర్యం లేదు.
పోలీసులకు రంగయ్య చెప్పిన సమాధానాలు అంత తృప్తి కరంగా లేవు. కానీ అతగాడికి దుర్భేద్యమయిన ఎలిబీ లున్నాయి. హత్యా సమయానికే అతడి కంతటి ఎలిబీ లుండడం కూడా పోలీసుల అనుమానం పెరగడానికి కారణముంది. ఎందుకంటె ఆ ఎలిబీలు వాటంతటవి ఏర్పడినట్లు కాక కావాలని కల్పించుకున్నాయని పించే విధంగా వున్నాయి.
హత్యలు జరుగుతాయని రంగయ్యకు తెలిసి వుండాలని పోలీసులు తీర్మానించుకుని అతడినో కంట కనిపెట్టడానికి ఓ కానిస్టేబుల్ ని ఉపయోగించారు. ఆ కానిస్టేబుల్ పేరు అబ్బులు.
8
అబ్బులు పోలీసుల మనిషి అని ఊళ్ళో వాళ్ళకి తెలియదు. మామూలు దుస్తుల్లో వుంటూ ఏదో పని మీద వచ్చినవాడిలా ఓ రైతు ఇంట్లో మకాం పెట్టాడు. అతని డ్యూటీ రంగయ్యకు అనుక్షణం కనిపెట్టి వుండడం.
