Previous Page Next Page 
వసుంధర కధలు-8 పేజి 3


    'ఇరవై అప్పుడే పాతిక అయింది" అన్నాడు ప్రదీప్.
    'అయితే నీకే మంచిది కదా - మరొక్క రెండు రోజులు వ్యవధి కావాలి ...." అన్నాడు.
    "నువ్వు కంగారు పడడం లేదు. తాపీగా మాట్లాడుతున్నావు. ఇది మోసగాళ్ళ లక్షణం" అన్నాడు ప్రదీప్ అనుమానంగా.
    నేను నువ్వి "నువ్వెలాగనుకున్నా నాకు ఇబ్బంది లేదు. నేను రమను నా ట్రాక్ లోకి రప్పించడానికి ప్రయత్నిస్తున్నాను. అదంత సులభం కాదు. డబ్బమే దగ్గర్నుంచి అప్పుగా తీసుకోవాలి!" అన్నాను.
    'అర్ధమయింది...." అని వెళ్ళిపోయాడు ప్రదీప్.
    ప్రదీప్ కేం అర్ధమయిందో నాకు తేలియాడు కానీ నేను మాత్రం ఆరోజు మళ్ళీ రమ యింటికి వెళ్ళాను.
    లక్ష్మణరావు ఇంట్లో కొన్ని ఆధారాల కోసం వెతకాలన్నాను. రమ నాకు సహకరించింది.
    మేమిద్దరం కలిసి వ్యాపారం చేసే రోజుల్లో లక్ష్మణరావు తన రివాల్వర్ నొక ప్రత్యేకమైన స్థలంలో దాచేవాడు. అది సాధారణంగా ఎవరూ అనుమానించలేనిచోట గోడతో కలిసి వుండిపోయే అలమారాలో దాచేవాడు. దాన్ని తానెప్పుడు కొత్తగా ఇల్లు కట్టినా అలాంటి అలమారాలు ఏర్పాటు చేసుకుంటానని అతను నాతొ అనేవాడు.
    నేను లక్ష్మణరావు గదిని శోదిస్తుంటే రమ నాతొ కాసేపు కూర్చుని తర్వాత వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన రెండు నిమిషాలకు నేనా అలమరాను గుర్తించ గలిగాను. లక్ష్మణరావు అలమారాను గుర్తించడానికి గోడ మీద ఎటువంటి సూచనలిస్తాడో నాకు తెలుసు. వాటి ప్రకారం ఆ అలమారాను పట్టాను. పైన కాస్త గట్టిగా నొక్కితే లోపలకు పోయి క్రింద నుంచీ ఓపెనింగ్ వచ్చింది. నేనా అల్మారాలో రివాల్వర్ ని చూశాను.
    చటుక్కున దాన్ని తీసి జేబులో వేసుకున్నాను.
    అల్మారాలో ఇంకా ఏవో కాగితాలు, తాళం చెవులు వగయిరా వున్నాయి.    
    "రమా!" అని పెద్దగా కేకపెట్టాను. రమ పరుగున వచ్చింది. అక్కడి అల్మారాను చూసి ఆశ్చర్యపోయింది. అందులోని తాళం చెవులు చూసి "అమ్మయ్య - న గదిలోని బీరువా తెరవడానికివె పనికోస్తాయనుకొంటాను" అంది.
    నాకా వివరాలతో నిమిత్తం లేదు. ఆమె కది చూపించి అక్కణ్ణించి బయటపడ్డాను.

                                    5
    ప్రదీప్ కు ఫోన్ చేశాను. రాత్రి పన్నెండింటికి మా యింటికి వచ్చి డబ్బు తీసుకుని పొమ్మని చెప్పానతడికి. ప్రదీప్ సరే నన్నాడు.
    ఆ తర్వాత రమకు ఫోన్ చేసి, రాత్రి ఒంటి గంటకు మా యింటికి వస్తే హంతకుణ్ణి చూపిస్తానన్నాను. రమ సరేనని చెప్పింది.
    ఆరోజు రాత్రి పన్నెండు గంటల సమయానికి ప్రదీప్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. నా గుండె అదురుతోంది. శరీరంలోని రక్తం వేగంగా ప్రవహిస్తోంది. అనుకున్న పని నేను సాధించగలనా అన్నది నా అనుమానం.
    ప్రదీప్ చాలా కరెక్టుగా వచ్చాడు. అతన్ని చూస్తూనే నేను జేబులోంచి తాళం చెవులు తీసి -- ' అదిగో  ఇనప్పెట్టె  న్యాయంగా నీకెంత కావాలో అంతా తీసుకుని వెళ్ళిపో! అన్నాను.
    ప్రదీప్ తాళం చెవులు అందుకుని "ఇటీజ్ గుడ్ డెసిషన్? నాక్కావలసిన డబ్బు దొరికితే ఇక ముందు నిన్ను బాధించను. కానీ నీ ధైర్యం చూస్తుంటే నాకేదో అనుమానంగా వుంది. అయినా నాకు భయం లేదు. నీలాంటి పిరికివాళ్ళు నాన్నేమీ చెయ్యలేరు. చెయ్యాలని కూడా అనుకోరు" అన్నాడు.
    నేను ఒక్కడుగు ముందుకు వేసి - "ఏమన్నావ్? అంటూ ప్రదీప్ ను వీపు మీద బలంగా గుద్దాను. ప్రదీప్ తాళం చెవులు పక్కకు విసిరేసి నామీద పడ్డాడు. నాకు ముష్టి యుద్దాలు చేతకావు. అయినప్పటికీ శక్తి కొద్దీ పోరాడాను. ప్రదీప్ నన్ను చావగొట్టాడు. ఆఖరికి రెండు చేతులు ఎత్తి దణ్ణం పెట్టి నన్ను వదలమన్నాను.
    "నా గురించి అన్నీ తెలుసుండీ ఇలా ఎందుకు తిరగబడ్డావ్?" అన్నాడు ప్రదీప్.
    "పిరికిగోడ్డు అని ఎవరయినా నన్నంటే నేను సహించలేను" అన్నాను.
    "నీలాంటి వాడికి సహనం చాలా అవసరం. అది నీకు నేను నేర్పుతాను. ఇప్పుడు నేను నిన్ను వరిసగా పిరికిగోడ్డు, పిరికిగోడ్డు అని పదిసార్లు అంటాను. నువ్వు నోరు మూసుకుని పడుండాలి" అన్నాడు ప్రదీప్.
    నాకు నోట్లోంచి రక్తం కారుతోంది. బట్టలు చిరిగిపోయాయి. వళ్ళంతా నొప్పులు.
    ప్రదీప్ తాళం చెవులు అందుకుని ఇనప్పెట్టె లోంచి డబ్బు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. అప్పుడే నేను మంచం మీద తలగడ క్రింద వున్న రివాల్వర్ ని తీసి ప్రదీప్ కి గురి పెట్టాను.
    ప్రదీప్ ఆశ్చర్యంగా నావంక చూశాడు. ఇలాంటిదీ జరుగుతుందని అతనూహించినట్లు లేదు. నేనతడి కేసి చూసి నవ్వాను. అయిదు రోజుల్నించి బొమ్మ పిస్తోలుతో అభ్యాసం చేశాను. నా గురి తప్పదని నాకు తెలుసు.
    ప్రదీప్ గుండెలకు గురిపెట్టి రివాల్వర్ పెల్చాను. పెద్దగా అరిచి క్రింద పడిపోయాడు. ప్రదీప్, రక్తం నేల మీద ప్రవహిస్తోంది.
    నేను అలాగే రివాల్వర్ తో నిలబడ్డాను. ప్రదీప్ కదలక అగేవరకు ఎదురు చూశాను. టైము పన్నెండున్నర అయింది. ప్రదీప్ కదలడం లేదు.
    ప్రదీప్ ని సమీపించాను. వాడి కళ్ళు మూతలు పడి వున్నాయి. మనిషిలో చలనం లేదు.
    అదే నాక్కావలసింది. వాడి ముఖంలో ఆశ్చర్యం లాంటి భావాలు కనబడకూడదు.
    ఓ అరగంట సేపు నేనూ అదే గదిలో స్పృహ తప్పి పడిపోయినట్లు పడి వున్నాను. ఒంటి గంటకు రమ అరుపుతో నాకు మెలకువ వచ్చింది. ఆమె గదిలోని పరిస్థితిని చూసి భయపడి అరిచింది.
    "రమా! వీడే నీ అన్నను చంపిన హంతకుడు. తన రహస్యం కనుగొన్నానని నన్ను బెదిరించడానికి వచ్చాడు. రివాల్వర్ తో బెదిరించాడు. నా ఇనప్పెట్టె ను దోచాడు. నేను ప్రతిఘటించాను. ఆత్మరక్షణ కోసం వీణ్ణి చంపేశాను" అన్నాను.
    "ఇప్పుడెం చేస్తావ్?" అంది రమ.
    "నేరం దాచి లాభం లేదు. పోలీసుల్ని పిలు" అన్నాను. తను వారించినా నేను వినలేదు. పోలీసులు వచ్చారు.
    ప్రదీప్ కిరాయి హంతకుడని పోలీసులకు తెలుసు. నేను లక్ష్మణరావు హత్య విషయం రహస్యం పరిశోదిస్తున్నట్లు రమ వాళ్ళకు చెప్పింది. లక్ష్మణరావు రివాల్వర్ తోనే హత్య జరిగింది. అది వాడు లక్ష్మణరావు నుండి కాజేసి వుంటాడనడానికి సందేహం లేదు. ప్రదీప్ జేబు లో నా ఇనపెట్టే లోని డబ్బుంది. ప్రదీప్ గురించి నేనే కధ చెప్పినా పోలీసులు నమ్మారు. పోలీసులకు నా గురించి చెప్పడానికి ప్రదీప్ బ్రతికి లేడు.
    నేను తీసుకున్నా రిస్కు ఫలించింది.
    ప్రదీప్ పదిమందికీ హత్యలు చేసి పెడుతుంతాడు. అందుకే నేనతడిని చంపి ఆ విషయం పదిమంది ముందు ఒప్పుకున్నాను.
    దీన్ని బట్టి నేను తెలుసుకున్న దేమిటంటే ఓ హత్యను దర్జాగా బయటపడాలంటే హత్య ఒక్కటే చేయాలి." చావులు మాత్రం రెండుండాలి.
    ప్రదీప్ వంటి కిరాయి హంతకులున్నంత కాలం ఇలాంటి పధకాలకు డోకా లేదు.

                                    ----------


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS