నేనేమీ మాట్లాడలేదు. శివరావు కుర్చీలోంచి లేచి ఒక్క ఉదుటున అతనిదగ్గరకు వచ్చి "మీరేనా డిటెక్టివ్ రామారావు గారు చాలా సంతోషంగా వుందండీ నాకు. నా హత్య కేసు మీరేకదూ పరిశోదిస్తుంట" అంటూ చేయి ముందుకు సాచాడు.
నకిలీ డిటెక్టివ్ తెల్లబోయాడు. అప్రయత్నంగా నే చేతులు సాచి షేక్ హ్యాండిచ్చాడు. ఇంకా, నమ్మలేనట్లు చూస్తున్నాడతను. ఒక్కక్షణం అనంతరం తమాయించుకుని "సందేహం లేదు. మీరే శివరావు!" అన్నాడు.
"అదేంటండీ . అసలు సందేహ మెందుకొచ్చింది మీకు"అన్నాడు శివరావు ఆశ్చర్యాన్నిభినయిస్తూ.
"ఏమీ లేదు. మీరు మళ్ళీ ఎలా బ్రతికారు"
"ఆ నా ప్రాణం గట్టిది. పోస్టు మార్టం టైములో ఆగిపోయిన నా గుండె మళ్ళీ కొట్టుకోవడం ఆరంభించింది. దాంతో కొట్టుకుంటున్న కొన్ని గుండెలు మళ్ళీ ఆగిపోవడాని కన్నట్లు నేను బ్రతికి వచ్చాను."
"ఇంపాజిబుల్!"
"ఇట్స్ పాసిబుల్ " అన్నాడు శివరావు.
నకిలీ డిటెక్టివ్ నాకేసి చూసి "నేను మిమ్మల్ని హెచ్చరిద్దామని వచ్చాను. మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. నా హెచ్చరికలక్ష్యం చేయకండి. ప్రమాదం తప్పించుకోవడం మీ చేతుల్లోనే ఉందన్న విషయం మీకూ తెలుసును. వస్తాను మరి!"అని గబగబా వెళ్ళిపోయాడు.
'అతను శేషగిరి మనిషి కదూ" అన్నాడు శివరావు సాలోచనగా.
ఆవునన్నట్లుగా తలడించాను.
"వచ్చినవాడు శివరావేనో కాదో తెలుసుకుందుకు వచ్చాడు. ఈరాత్రి శేషగిరికి నిద్రపట్టదు. ఆ తర్వాత మరి జైల్లోనే నిద్రపోతాడు" అని 'ఇంక మీరు వెళ్ళి పడుకోండి మేష్టారు!" అన్నాడు శివరావు.
నేను ముందు వీధి తలుపులు వేసి వచ్చాను. తర్వాత శివరావు వైపు చూస్తూ "అర్ధరాత్రి వీధి తలుపు తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండు. ఒకసారి అలాంటి సందర్భం లోనే నా బంధువు కొకాయనకు ప్రాణ ప్రమాదం వచ్చి తప్పింది"అన్నాను.
"ఇలాంటి విషయాల్లో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు నాకు." అన్నాడు శివరావు సాలోచనగా.
14
"అవును కామిని నే మాట్లాడుతున్నాను."
'అర్జంటుగా మా ఇంటికి రావాలి. నేను శివశంకరాన్ని. ఇదివరలో ఒక పర్యాయం మా ఇంటికోచ్చావు. నువ్వు చచ్చిపోయాడంటున్న శివరావు ప్రస్తుతం మా యింటిలో ఉన్నాడు."
బహుశా కామిని షాక్ తిందనుకుంటాను. మళ్ళీ మాట్లాడడానికి కొన్ని క్షణాలు పట్టింది.
"సరే, ఇప్పుడే బయల్దేరి వస్తున్నాను" అవతల ఫోన్ క్లిక్ మంది.
నేను వెంటనే బయల్దేరి వచ్చి "కామిని బయల్దేరి వస్తోంది" అని శివరావు కు చెప్పాను.
శివరావు తన సరంజామాతో సిద్దంగా ఉన్నాడు. కుర్చీ కింద టేపు రికార్డర్ పెట్టాడు.
ఒక అరగంటలో వచ్చింది కామిని. ఆమె వచ్చే ముందు రికార్డర్ అం చేసి ఉంచాడు శివరావు.
కామిని శివరావు ను చూస్తూనే తెల్లబోయింది. "మైగాడ్ నువ్వా?"
"ఎస్ డార్లింగ్ " అన్నాడు శివరావు.
"అదేమాట. అదే రూపం" కామిని అతన్ని విచిత్రంగా చూస్తూ అంది.
'అదేమిటి డార్లింగ్ ?" నీ మాటలు నాకర్ధం కావడం లేదు."
కామిని కుర్చీలో చతికిల బడింది. "ఎవర్నువ్వు?" ఎందుకొచ్చావ్?" అంది శివరావు వంకతీవ్రంగా చూస్తూ.
'నేను లేక నీ బిజినెస్ పడిపోయింది గదా. అందుకని తిరిగి వచ్చాను. పనిలో పనిగా నన్ను హత్య చేసిన వాళ్ళను పట్టివ్వడం నా వల్లనే జరిగితే బాగుంటుంది కదా అని తోచి"
"మాటలు కట్టి పెట్టు నువ్వు శివరావు వి కాదు" అంది కామిని.
"ఎలా చెప్పగలవ్!" శివరావు వేళాకోళంగా అన్నాడు.
"శివరావు చచ్చిపోయాడు. మోహన్ అతన్ని పొడిచి చంపేశాడు" అంది కామిని.
"పోడిచేడన్నమాట నిజం కానీ , నేను చావలేదు."
"ఇంపాజిబుల్ . శివరావు చచ్చేదాకా అక్కడే ఉన్నాన్నేను. నాడీ ఆగిపోయేకనే అక్కణ్ణించి కదలలేదు నేను."
"ఓహో! అయితే శివరావు హత్యకు నువ్వే ప్రత్యక్ష సాక్షిన్నమాట!"
'ఆహా" అంది కామిని.
"మిస్ కామినీ. నేను చచ్చి బ్రతికాను. మీరందరూ చనిపోయాడనుకుంటున్న శివరావుని నేనే. అయినా కూడా నాముందే అబద్దాలు చెబుతున్నావంటే నువ్వెంత గుండెలు తీసిన బంటువో తెలుస్తుంది" అన్నాడు.
కామిని చిత్రంగా చూసింది. శివరావు వంక, ఒక్క నిముషం ఆగి "మోహన్ ని రక్షించడం కోసం మాధవరావు గారు పోలీసులకు డబ్బిచ్చి నకిలీ శివరావు ని తయారు చేయించాడన్న మాట. ఇప్ప్దుదు కేసు రూపమే మారిపోతుంది. నువ్వెవరివో నాకు తెలియదు. నాకు లక్ష రూపాయల ఆదాయాన్ని పోగొట్టాలని చూస్తున్నావు. నేనది సహించను. సహించలేను. నేను శివరావు హత్య కళ్ళారా చూశాను. మోహన్ హత్య చేశాడు. ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్లో ఇప్పుడే చెప్పి వస్తాను. నువ్వో వేళ నిజంగా శివరావు వె అయుండినప్పటికీ హత్యా ప్రయత్నం నేరాని కైనా మోహన్ కు కొంత శిక్ష పడుతుంది. ఆఖరి ప్రయత్నంగా మాధవరావు గారిని హెచ్చరిస్తాను" అంది.
"నన్ను హత్య చేసిందెవరో నాకంటే నీకు బాగా తెలుస్తుందను కుంటున్నావా కామినీ!" అన్నాడు శివరావు వ్యంగ్యంగా.
"తెలుస్తుంది. ఎందుకంటె నువ్వంటున్న నువ్వు నువ్వు కాదు." అంది కామిని.
'సరే, నేను శివరావు ని కాదనుకో! అప్పుడు కూడా నీ సాక్ష్యానికి సవాలుంది. ఆ సవాలు ఈ శివశంకరం గారి వద్దనే వుంది."
కామిని నవ్వింది. "ఎవరి సవాలునూ నేను లెక్క చేయను."మోహన్ హంతకుడు. దీన్నెవరూ అబద్దమన లేరు."
'అలాగా! అయితే హంతకుడు శేషగిరి అని శివశంకరంగారంటున్నారు. ఈకేసులో అయన కూడా ప్రత్యక్ష సాక్షి"అన్నాడు శివరావు.
కామిని తెల్లబోయి నావంక చూసింది. "ఇంతకాలం మీరు కల్పించబడ్డ సాక్షి అనుకుంటున్నాను. శేషగిరి గారిని మీరు హంతకుడంటున్నారంటే ఇందులో ఏదో మోసముంది!"
"మోసం నీలో వుంది."అన్నాడు శివరావు.
కామిని కళ్ళు ఎరుపెక్కాయి. ఆమె నా వంక తీవ్రంగా చూసి "మేస్టారూ! అబద్దమాదకండి. నిజంగా మీరు శివరావు హత్యను కళ్ళారా చూశారా?" అనడిగింది.
నేను క్షణం తటపటాయించి జరిగినది వివరంగా చేప్పానామేకు.
నేను చెప్పినది వింటూనే కామిని ముఖం గంబీరంగా అయిపొయింది. వరండా లో కాస్సీపు నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆ నిశ్శబ్దాన్ని చేధిస్తూ కామిని అంది. "శివశంకరం గారు నిజమే చెబుతున్నారు. ఇప్పుడంతా నా కర్ధమైంది. మోహన్ చేతిలో శివరావు చచ్చిన కొన్ని క్షణాలకు శేషగిరి ఇక్కడకు వచ్చి పరిస్థితి నర్దం చేసుకుని అతన్ని రక్షించడం కోసం కత్తి పిడి మీద వేలిముద్రలు తుడిచేసి వుంటాడు."
శివరావు నవ్వాడు బిగ్గరగా. "కామినీ! నీ ఊహ బలాన్ని కొనియాడకుండా వుండలేను. మోహన్ నీ కేసులో ఇరికించాలని కధను చాలా అందంగా మలిచావు కానీ, శేషగిరి కి మోహన్ ని రక్షించాల్సిన అవసరమేముంది?" అన్నాడు.
కామిని నవ్వి, "ఎంతయినా రక్తసంబంధం కదా!" చూస్తూ చూస్తూ ఏ తండ్రి ప్రమాదంలో వదిలిపెట్టేస్తాడు!" అంది.
తెల్లబోయాను నేను.
