కూచిపూడి
కళాసాగరము
(నృత్యశాస్త్రము)
__రచయిత, నాట్యాచార్య
హేమాద్రి చిదంబరదీక్షితులు
ఓం
వినాయక ప్రార్ధన
శ్లో!! శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజమ్,
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్య విఘ్నెపశాంతయే!!
సరస్వతి ప్రార్ధన
శ్లో!! సరస్వతి త్వియం దృష్టా వీణాపుస్తుకధారణీ
హంసవాహన సమాయుక్తా విద్యాదాన కరీమమ
ప్రధమభారతి నామ ద్వితీయంచ సరస్వతి
తృతీయం శారదాదేవి చతుర్ధం హంసవాహన.
పంచమం జగతి ఖ్యాతం షష్ఠం వాగీశ్వరి తధా
కౌమారిసప్తమం ప్రోక్తం మష్టమం బ్రహ్మచారిణి.
నవమంబుద్ధి ధాత్రీచ దశమం వరదాయిని
ఏకాదశంక్షుద్రఘంటాద్వాదశం భువనేశ్వరి
బ్రాహ్మీద్వాదశ నామానిత్రి సంధ్యంయః పఠేన్నర:
సర్వశిద్దికరీ తస్య ప్రసన్న పరమేశ్వరి
సమేవసతు జింహాగ్రే బ్రహ్మరూపాసరస్వతి!!
ఈశ్వర ప్రార్ధన
శ్లో!! కైలాసాచలవాసాయ కుందేందు ధవళాయచ
నాట్యశాస్త్ర ప్రవక్తాయ _ మహాదేవాయతే నమః
నందికేశ్వర ప్రార్ధన
శ్లో!! నందీశ్వర నమస్తుభ్యం _ శివశక్తి పరాయణ
నాట్యశాస్త్ర తత్వజ్ఞ ప్రసాదం కురుసర్వదా.
భూదేవి ప్రార్ధన
శ్లో!! విష్ణు శక్తి సముత్పన్నే _చిత్రవర్ణేమహీతలే
అనేకరత్న సంపన్నే భూమిదేవి నమోస్తుతే!!
శ్లో!! సముద్రవసనే దేవి, పర్వతస్తనమండలే,
నాట్యం కరిష్యే భూదేవి, పాదతాడక్షమస్వమేః
నటరాజ ప్రార్ధన
శ్లో!! నమోస్తు నటరాజాయ. గౌరీ సౌందర్యరూపిణే,
బృవోః కృపవిహారాయ, ఆనందజలజాయతే!!
శివస్థుతి
ఆజ్గికం, భువనం, యస్యా, వాచికం సర్వవాజ్మయమ్,
ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివమ్!!
సభావందనం
శ్లో!! విద్వాంసః కవిరేఖజ్ఞాగాయకాః పరిహాసకః
ఇతిహాసపురాణజ్ఞా తత్సభాయై నమో నమః
తా!! విద్వాంసులు, కవులు, చిత్రకారులు, గాయకులు, పరిహాసకులు, ఇతిహాసములు తెలిసినవారు, పురాణములు తెలిసినవారు కలిగిన ఈ సభకు నమస్కారములు.
దేవి ప్రార్ధన
కాంభోజిరాగం ఆది.తాళం.
రావే విజయపురి కనకదుర్గాంబ
రావమ్మ మము బ్రోవ ఓ శ్యామలాంబ,
ఓంకారి హ్రీంకారి, క్లీంకారి, ఓం శక్తి
శూలాయుధపాణి పాశాంకు శధరి !!రా!!
మందార సుమప్రియ రక్తాంబరథారి
రాజీవలోచని రాజరాజేశ్వరి !!రా!!
భండదైత్యహారి ఐంమ్ క్లీం, సౌః, యని నిన్ను
ఆరాధింతును ఆదరింపగవేగ !!రా!!
కామితార్థదాయి కౌమారి కల్యాణి,
కదలిరావేమమ్మ కాదంబవనవాసి !!రా!!
అనవరతము నిన్ను ఆం, హ్రీం, క్రోం, యని బిల్వ
అవలోకించవ ఆదిశక్తి నీవు !!రా!!
దర్శనమివ్వవె దనుజ సంహారిణి
దాసానదాసుని దీక్షితు బ్రోవను !!రా!!
స్వామి, శిద్దేంద్ర, గురుస్థుతి
షణ్ముఖప్రియ, ఆది.తాళం.
ప: వందన మందుకో. యోగీంద్రా...మా
కూచిపూడి పుర శిద్ధేంద్రా !!వం!!
