Previous Page
డింగ్ డాంగ్ బెల్ పేజి 49

    "మరి తన రియాక్షన్ ఏమిటి?" రాహుల్ అడిగాడు.

    "ఓసారి అయిదు నిముషాలపాటు గాఢంగా వాటేసుకుని వదిలిపెట్టింది" సిన్సియర్ గా చెప్పాడు అంకిత్.

    "అబ్బ! నాకు సిగ్గేసింది బాసూ?" అనిమానంగా అడిగాడు రాహుల్.

    "అపశకునం మాటలు మాట్లాడకు. పైన తథాస్తు దేవతలుంటారు" కోపంగా అన్నాడు చేతన్ తన కళ్ళజోడు సవరించుకుంటూ.

    పది ...ఇరవై... ముప్పయి నిముషాలు గడిచాయి.

    మృదువని రాలేదు. గంట గడిచింది.మృదువనిరాలేదు. హైదారాబాదు వెళ్ళే రైలు ఒకటో నెంబర్ ప్లాట్ పామ్ మీద ఆగింది.

    కాసేపటికి అది బయల్దేరడానికి రెడీ అయింది.

    "బాసూ... మృదువని" అరిచాడు రాహుల్.

    మృదువని వీళ్ళని చూసి పరుగెత్తి రైలు క్యాచ్ చేసింది.

    అంకిత్ మృదువనిని పిలుస్తూ ఆమెకోసం మరో కంపార్ట్ మెంట్ లో ఎక్కాడు. రాహుల్, చేతన్ ఫాలో అయ్యారు.

    ఛేజింగ్ మొదలైంది. నెక్స్ ట్ స్టేషన్ లో గాలించారు.ఆ తరువాత ప్రతీ స్టేషన్లోనూ గాలించారు.

    రైలు హైదారాబాదు చేరేవరకు మృదువని దొరకలేదు.
                    
    సికింద్రాబాదు లో రైలు ఆగింది. స్టేషన్ మొత్తం గాలించారు. రైలులో మొత్తం కంపార్ట్ మెంట్ లను గాలించారు.

    అర్దరాత్రి పన్నెండు దాటింది.

    రైలు వెళ్ళిపోయింది.

    "బాసూ! ఇలాగైందేమిటి? మళ్ళా మొదటికొచ్చింది. మృదువని మనల్ని పరుగెత్తిస్తోంది" నీరసంగా అన్నాడు రాహుల్.

    చేతన్ అప్పుడే ఏదో గుర్తొచ్చినట్టు ఆగి రాహుల్ గబగబా పిడిగుద్దులు గుద్దాడు.

    "ఢిల్లీరైల్వేష్టేషన్ లో అపశకునపు మాటలు మాట్లాడావు. శ్తెషణ్ లోనే వున్న తథాస్తు దేవతులు తథాస్తు అని ఉంటారు. నీవల్లే ఇదంతా" కోపంగా అన్నాడు.

   
                                                            ***

    "ఒరే రాహుల్... చేతన్!నాకెందుకో మృదువనిహైదారాబాదు లోనే వుందని నా నమ్మకం. రేపట్నుంచీ మళ్ళా మృదువని కోసం వెతుకులాట మొదలెడదాం" డిక్లేర్ చేసాడు అంకిత్.

   
                                             ***

    "బాసూ! మనింట్లో దొంగలుపడ్డారు. తాళం ఎవరో పగలగొట్టారు.నా జీన్స్ ప్లాంట్లు... అండర్ వేర్లే.." మొత్తుకుంటూలోపలకు పరుగెత్తి అదే వేగంతో వెనక్కి వచ్చేసాడు.

    "నా లంగోటీలు..." అంటూ చేతన్ వెళ్ళి సేం టు సేం యాజిటీజ్ గా బయటకు పరుగెత్తుకువచ్చాడు.

    అంకిత్ లోపలకివేల్లిఅక్కదిద్రిశ్యం చూసి అబ్బురపడ్డాడు. ఆ తరువాత ముచ్చటపడ్డాడు.

    మృదువని గబగబా అన్నం  తింటోంది.తనే గ్యాస్ స్టవ్ మీద అందించి తలమీద మెల్లగా తట్టాడు.

    అన్నం తిని "నాకు నిద్ర వస్తోంది" అంది ఆవులిస్తూ.

    "మాకు అర్ధమైంది" అంటూ రాహుల్, క్క్ష్హెతన్ లు బయటకు వచ్చారు. వాళ్లతోపాటు అంకిత్.
   
                                             ***

    తెల్లవారేక రాహుల్, చేతన్ లకు అంకిత్ కనిపించలేదు. లోపల గదిలో బ్లాంక్ ట్ లో ఇద్దరూ దూరి కబుర్లు చెప్పుకుంటున్నారు.

    "నా జాబ్ కు రిజైన్ చేశాను. హాయిగా నిన్ను పెళ్ళి చేసుకుని నీతోనే ఉంది పోతాను. అన్నట్లు మన పెళ్ళి అయ్యాక  కూడా ఆ తోకలు... అదే రాహుల్ తోక,చేతన్ తోకలు మనతావువుమ్టారా?" అని అడుగుతోంది మృదువని.
   
                                             

                                            _:అయిపోయింది:_


 Previous Page

WRITERS
PUBLICATIONS