Previous Page
భస్మనేత్రం పేజి 45

    మనం ఇండియాలో స్వాములను, బాబాలను ఎలానమ్ముతామో... ఇక్కడ కూడా... (నమ్మకాలను మినహాయింపుఏముంటుంది?) కొంతమంది ప్రెస్ పీపుల్ అతడ్ని పరీక్షించారు. అతని ఎదురుగా నిలుచునే వాళ్లకు కేఫేన్సన్ మాటలు వినిపించేవి 'మిస్టర్ జేమ్స్.. ఏంటి.. నేన్ను సందేహిస్తున్నావ్? అంతకన్నా మరో డేంజర్ విషయం ఎంతో తెలుసా... మీరిప్పుడు డేంజర్ లో వున్నారు. మీ గర్ల్ ప్రెండ్ కేథరిన్ విషయం... అతడి హేజ్జెండ్ కు తెలిసింది. మీ ఇల్లీగల్ కాంటక్ట్సకు ఇకనైనా గుడ్ బై చెప్పడం మంచిది..." అంటూ ఎదురుగ వున్న జేమ్స్ తో చెప్పారు కేఫిన్సన్. నిజానికి ఆ సమయంలో కేఫిన్సన్... కళ్ళు మూసుకుని జేమ్స్ ఎదురుగా నిలబడి వున్నది. జేమ్స్ అయోమయంలో పడిపోయాడు. ఇదంతా తన యిల్యుషణ్ కాబోలు అనుకుంటూ... ఆ రోజు ఎప్పటిలాగానే తన గర్ల్ ప్రెండ్ ను కలుసుకున్నాడు. ఓ రెస్టారెంట్ లో పిజ్జాలుతిని, ఆ రాజుకి బిల్ట్ రొమాంటికి  కబుర్లు చెప్పుకుని గుడ్ నైట్ చెప్పుకున్నారు. జేమ్స్ రోడ్డు క్రాస్ చేస్తుండగా ఓ కారు వచ్చి అతడ్ని గుద్దేసింది స్పృహా కోల్పోతున్న జేమ్స్ ఆ కారు కేథరిన్ హేజ్జెండ్ దిగా గుర్తుంచాడు. ఎవరో దారినపోయే వాళ్ళు హాస్పిటల్ కు తరలించాడు.జేమ్స్ ఈ విషయాన్ని ఫోన్స్ న్ కు గుడ్ బై చెప్పాడు. అ క్షణం నుంచి జేమ్స్ కేఫిన్సన్ అతనిలో మాట్లాడలేదు. ఎంత ప్రయత్నించినా కుదర్లేదు. నీ మనసుతో నా మనసు సంభాషించలేకపోతోందని చెప్పాడు. నేను చెప్పింది నువ్వు నమ్మనండునే ఇలా జరిగిందని స్పష్టంచేశాడు. జేమ్స్ ఆ రోజు నుంచి కేథరిన్ కు ఎలాగో ఈ విషయం తెలిసింది. వెంటనే జేమ్స్ దగ్గరకి వెళ్ళి ఇదంతా తన భర్త కేఫిన్సన్ తో అడిస్తొన్న నాటకమని, కేఫిన్సన్ హిప్నాటిజమ్ తెలిసిన మనిషిని చెప్పినా... జేమ్స్ నమ్మలేదు.

    విచిత్రంగా జేమ్స్ కు ఓ రోజు విచిత్రమైన కళ వచ్చింది. ఆ కలలో కేఫిన్సన్ యాక్సిడెంట్ లో చనిపోయారు.

    అంతకన్నా విచిత్రంగా కేఫిన్సన్ అదేరోజు తత్రి రోడ్డు క్రాస్ చేస్తూ యాక్సిడెంట్స్ చనిపోయాడు.

       
                         ***


                     చిత్ర 'వి' చిత్రాలు

    హాలెండ్ లో ఒంటికన్నుతో ఓకే సంవత్సరంలో పన్నెండుమంది జన్మించారట.

    అందులో నలుగురు పుట్టిన వెంటనే చనిపోగా... మరో ఇద్దరు పిల్లల తల్లులు, పిల్లలు పుట్టాక చనిపోయారు. ఆ ఇద్దరు పిల్లలు నష్టజాతకులని, ఆ పిల్లల తండ్రులు వాళ్ళని అనాథాశ్రమంలో వదిలేశారట. ఇద్దరు పిల్లలో ఓ పిల్లాడు వెంటనే చనిపోతే, మరో పిల్లాడ్ని ఓ సైసిస్ట్ దత్తత తీసుకుని పెంచాడు. ఆ పిల్లాడు పద్నాలుగెల్ల వయసులో చనిపోయాడు. ఆ సైంసిస్ట్ ఆ పిల్లడిమీద పరిశోధనలు చేయడం వల్లనే చనిపోయాడని అనుమానమున్నా అధారాల్లేక వదిలేశాడు. మిగతా ఆరుగురిలో నలుగురు కొద్దికాలం తర్వాత చనిపోతే, ఆ మిగతా ఇద్దరు ఓ యాక్సిడెంట్ లో ఓకే రోజు  వివిధ ప్రాంతాల్లో మరణించారట.

   
                                                                               ***

    సీరియల్ గా వస్తున్న సమయంలో పాఠకులు అందించిన కొన్ని ఆశక్తికర విషయాలు-

    అమెరికాలో డేబీమూర్ అనే ఓ సైంసిస్ట్ ఓ వ్యక్తిని అసిస్టెంట్ గా నియమించుకొని అతని మీద ఓ ప్రయోగం చేశాడట. పూర్తిగా అతని చెప్పుచేతల్లో వుండేలా చేశాడట. అతనిచే దోపీడీలు, దొంగతనాలు, హత్యలు కూడా చేయించారట. ఫోలీసులు ఎంత ఇన్వెస్ట్ గేషన్  చేసిన అసలు హంతకుడ్ని పట్టుకోలేకపోయారు . ఆ అసిస్టెంట్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న, అతనేవిషయాలు  పట్టుకోలేక పోయాడు. ఫోలీసులు అ అసిస్టెంట్ ని పిచ్చివాడిగా భావించి వదిలేశాడు. ఆ అసిస్టెంట్ సరాసరి సైంసిస్ట్ దగ్గరకి వెళ్ళిపోయాడు.


    ఫోలీసులు అసలు హంతకుడిని పట్టుకోడానికే ఈ నాటకమాడారన్న విషయం ఆ సైంసిస్ట్ కు తెలీదు. అసిస్టెంట్ ని వెంబడించిన ఫోలీసులు సైమ్సిస్ట్ ని పట్టుకుని అతని ఇల్లు సోడా చేస్తే డబ్బు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు దొరికాయి. తన మేధస్సును దేశ ప్రయోజనాకి కాకుండా వినాశానానికి, తన స్వార్ధానికి ఉపయోగించుకున్న ఆ సైంసిస్ట్ భస్మనేత్రం సీరియల్ లోని సైంసిస్ట్ అగర్వాల్ కు దగ్గరి ఫోలీకలు వున్నట్టు అనిపిస్తున్నాయి.

   
                                                                                             -సి.అనూరాధాకామేష్ (విశాఖపట్నం)

 

                                                        ***

       
           ఆకు పసరతో కంటికి అమోఘశక్తులు?!
   

    దక్షణాప్రికాలోని ఓ ఆటవిక తెగవాళ్ళు వాళ్లకు పిల్లలు పుట్టగానే వాళ్ల కళ్ళలో ఏదోద్రవం లాంటి ఆకు పసరు పోస్తారట. రోజూ ఆ అకుపసరు వాళ్ళ కళ్ళలో   పిండి  పది నిమిషాలపాటు కళ్ళు ముసి వుంచుతారు.

    అలా ఆ అకుపసరు పెద్దయ్యేదాకా పోస్తూనే వుంటారు. ఆ పసరులో దివ్య శక్తులుంటాయని, ఆ పసరు కంట్లోకి చొచ్చుకు వెళ్ళి అతీంద్ర శక్తులు యిస్తాయని నమ్మకమట. ఆ అకుపసరు ప్రభావంతో వాళ్ళకి కంటి జబ్బులు రావని నమ్మకం. అంతేకాకుండా వాళ్ళు తీక్షణంగా చూస్తే శత్రువులు పిల్లికూనలుగా మారిపోతారట.

    పులులు, సింహలతో పోరాడివలసి వచ్చినప్పుడు ఆ ఆటవికులు వాటి కళ్ళలోకి సూటిగా చూస్తారట. దాంతో ఆ క్రూర జంతువులు భయంతో పారిపోవడం చేస్తాయి.

    మూడేళ్లకు ఒక్కసారి జరిగే జాతరలో తమ కంటికి వున్న శక్తులను వాల్లకుల దేవత ముందు ప్రదర్శించరట. బాలభారతంలో బాలదుర్యోదునుడికి తల్లి గాంధారి ఆకు పసరు శరీరానికి పూస్తుందట. ఇలాంటి విషయాలు తర్కానికి అందకున్నా. మనల్ని ఆశ్చర్య చకితుల్ని చేస్తాయి.

   
                                                                         -అప్పన రామారావు (పేద గంట్యాడ)

 

                                                         ***

 

    జాపాన్ లో జింగ్ జో అనే వ్యక్తి శరీరంలో అధిక విద్యుత్ వుందిట. అతనికి అమితంగా కోపం వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తిని పట్టుకుని కుదిపితే చాలు...అవతలి వ్యక్తి కరెంట్ షాక్ కొట్టినట్టు విరుచుకుపడిపోతాడట. అందరూ అతడ్ని కరెంట్ మనిషి అంటారు. ఈ విషయం తెలిసిన కొందరు అతడికి అలాంటి శక్తి లేదని కొట్టిపారేస్తారు. శాస్రీయపరమైన విశ్లేషణ కు సిద్దపదాల్సిందిగా జింగ్ జొని కోరారు.

    చిత్రంగా అతను అదే రోజు రాత్రి నుంచి కనిపించకుండా పోయాడు.

    అతని ఒంట్లో కరెంట్ వుందనేది కేవలం ప్రచారమేనని, అందుకే పారిపోయాడని కొందరు అంటే, పదిమంది దృష్టిలో తనో ప్రత్యేకమైన వ్యక్తిగా గిర్తుంపబడి జనం దృష్టిలో పడ్డం ఇష్టంలేకే పారిపోయాడని మరికొందరన్నారు.

    ఇందులో నిజానిజాలు ఎలావున్నా ఆ మధ్య ఓ పత్రికలో ఓ మనిషి శరీరంలో విద్యుత్ వుందని చదివిన గుర్తు.
   
                                                -వి.విశ్వనాథ్,జ్యోతి (బెంగుళూరు)
   
                              ***

    యూరప్ లో సామ్యేల్ అనే వ్యక్తి అదృశ్యం అవటం ఇప్పటికీ మిస్టరీయే. ఆ సంఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే పాతికేళ్ళ క్రితం వరుసుగా ఓకే నెలలో అర్ధరాత్రులు 25 వరకు హత్యలు జరిగాయి.హంతకులందరూ ఓకే టైం లో మెడ కొరికివేయబడి వుండడం వలెనే చనిపోయారని డాక్టర్స్ నిర్ధారించారు. ఓ ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం జేమ్స్ అనే వ్యక్తిని ఓ అపరిచిత వ్యక్తి తన పళ్ళతో మెడకొరికి చంపివేయడం ప్రత్యక్ష సాక్షి చూశాడు. కాని ఆ ప్రత్యక్ష సాక్షి కథనాన్ని అందరూ తేలిగ్గా కొట్టిపారేశారు. ఆ తర్వాత కూడా అదే విధంగా మరికొన్ని హత్యలు ప్రతిరోజూ అదే టైం లో జరగటంతో ప్రత్యక్ష సాక్షి కథనాన్ని నమ్మక తప్పలేదు. అయితే ఆ హత్యలు చేస్తుంది వాంపేర్ అని కొంతమంది ప్రచారం చేశారు. వాంపేర్ కు రెండు పళ్ళు లాంటి కోరలుంటాయని, వాటితో మనుషుల మెడలను కొరికి, రక్తం తాగుతుందని అక్కడి ప్రజల నమ్మకం. వీరిని తెలుగులో 'రక్తపిశాచు' లని అంటారు. అయితే కొంతమంది డాక్టర్స్ వీటిని ముక్తకంఠంతో ఖండించారు. ఇది ఎవరో ఉన్మాది చేష్టలని, ఒక విధమైన సైకలాజికల్ ప్రాబ్లెమ్ అని చెప్పారు. అక్కడి పోలీసులు హంతకుడి కోసం అన్వేషణ సాగించారు. కాని చిత్రంగా ఆ హంతకుడు తన శరీరాన్ని, తన పళ్ళతోనే గాయపరచుకొని విచిత్రమైన పరిస్థితిలో తన గొంతు తనే నులుముకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మెడ మీద వున్న అతని చేతివ్రేళ్ళ ముద్రలను బట్టి ఆ విషయం నిర్ధారించారు. అయితే ఇప్పటికీ ఆ హంతకుడు మెడ కొరికి అందరినీ ఎందుకు చంపాడన్న విషయం మిస్టరీయే.   

                                                                             ఎ-వసంతరామ్ పిళ్లే , శబరి
   
       
                     * * *  

    * మానవుని కన్ను పదిహేడు వేల రంగులను గుర్తించగలదు.
    * భూమిమీద ప్రతిక్షణం దాదాపు పద్దెనిమిది వందల చోట్ల ఉరుములు, మెరుపులు, తుఫానుతో కూడిన వానజల్లులు కురుస్తుంటాయి. భూమిమీద ప్రతి సెకనుకు వంద పర్యాయాలు పిడుగులు పడతాయి.
    * భూమ్మీద ఏటా యాభైవేలకు మించి  భూకంపాలు వస్తుంటాయి. వీటిలో ఎక్కువశాతం చాలా తక్కువ ప్రభావం కలిగి వుంటాయి, వాటిని మనం గుర్తించలేనంతగా!


               
                                    -మానస, విశ్వంత్, జగదీశ్వర్ (చెన్నై)   

 

                     _______________000______________


 Previous Page

WRITERS
PUBLICATIONS