Previous Page Next Page 
మిస్టర్ 'యూ' పేజి 4

 

    "మనుషులందరిలోకి కూడా నీకు నచ్చిన వ్యక్తీ ఎవరు?" అన్నారు జడ్జీలు .
    "మదర్ ధేరీసా అంటాడు చూడు " అంది ఒక గొంతు గుసగుసగా.
    "కాదు! మహాత్మాగాంధి అంటాడు " అంది ఇంకో గొంతు.
    గొంతు సవరించుకున్నాడు రాజు.
    "మనుషులందరిలోకి నాకు నచ్చిన వ్యక్తీ ఎవరంటారా ? ఎక్కువ ఆలోచించవలసిన పని లేదు. నాకు అందరిలోకి కూడా నచ్చిన వ్యక్తీ కామన్ మాన్. అంటే సగటు మనిషి ."
    అనుకోని ఆ సమాధానానికి అందరూ అవాక్కయ్యారు .
    అక్కడున్న వాళ్ళయితే అలా ఆ జావాబు విని స్టన్ అయిపోయారు గానీ, ఆ ప్రోగ్రాం ని ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న ప్రజలందరూ హర్షాతిరేకులయ్యారు.
    కారణం ?
    సింపుల్!
    ప్రపంచజనాభాలో అత్యధికశాతం మంది కామన్ మెన్ కావడమే!
    రిజల్టు డిక్లేర్ చేశారు.
    విన్నర్ .....
    రాజన్!
    ఈ రాజన్ ఎవరూ?
    మన రాజే! కంప్యూటర్ లిస్టులో అతని పేరు 'రాజన్ ' అని పడింది.
    జడ్జీలు ముగ్గురిలో ఒక తమిళుడు వున్నాడు. కట్టేలాంటి స్వభావం, నిప్పులాంటి మనిషి , ఏ ప్రలోభానికి లొంగడు.
    బట్టల తయారీ దారు బ్రాడ్ మాన్ చెప్పినట్లుగా --
    బలహీనతలేని మనిషి వుండదు !
    ఆ తమిళ జడ్జికి ఉన్న ఏకైక బలహీనత --
    భాషా దురభిమానం!
    'రాజన్' అన్న పేరు చూడగానే అయన మార్కులన్నీ రాజుకే పడిపోయాయి.
    అతని వీక్ నేస్ ని కనిపెట్టి కంప్యూటర్ లోని తప్పు ఇన్ ఫర్మేషన్ ఫీడ్ చేసిన ఘనత - ఇంకెవరూ -- బ్రాడ్ మాన్ దే!
    అండ్ ద విన్నర్ ఈజ్ ....... మిస్టర్ రాజన్ .......లేడీస్ అండ్ జెంటిల్ మెన్.
    ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ హేండ్ ! అన్నాడు కంపెరీ.
    రాజు డయాస్ మీదికి వచ్చాడు.
    అతనికి కప్ అందించబోయాడు ఒక విఐపి.
    వద్దన్నట్లు తల అడ్డంగా ఆడించాడు రాజు.
    "నో థాంక్స్ ! నేను ఈ టైటిలు గెల్చుకోవడానికి ఇక్కడికి రాలేదు" అన్నాడు నెమ్మదిగా.
    "మరి?"
    "ఇట్లాంటి పోటీల్లో ఎన్ని రకాల గూడు పుఠానీలు , ఎన్ని రకాల రాజకీయాలు , అరచాకీయాలూ ఉంటాయో స్వయంగా తెలుసుకుని బట్ట బయలు చేయడానికి వచ్చాను. నేను తెలుసుకున్నది ఇదీ ....." అని పాయింట్స్ గా పాలిటిక్సు అన్నీ వివరంగా చెప్పాడు రాజు.
    తర్వాత ఎంతో ఉద్విగ్నంగా అన్నాడు. 'కామన్ మాన్ కి " కడుపు నిండా తిండి, కట్టుకోవడానికి బట్టా లేనంత కాలం, ఇట్లాంటి ఫాన్సీ పోటీలు ఉండకూడదని నా దృడ నమ్మకం !"
    అతను తిరుగు ప్రయాణానికి ఎయిర్ పోర్టు చేరుకునేదాకా , అక్కడున్న వాళ్ళెవరూ షాక్ లో నుంచి బయటపడలేదు.
    
                           *    *    *

    న్యూ సిటీ ఎయిర్ పోర్టు . ఇంద్రలోకంలా ధగధగ లాడిపోతోంది.
    రెండు కిలోమీటర్ల పోడుగుంది ఆ ఎయిర్ పోర్టు. అంతా ఎయిర్ కండిషన్డ్ . అందులోనే ఒక ఫైవ్ స్టార్ హోటలుంది. డ్యూటీ ఫ్రీ షాపింగు .
    విలాసవంతమైన జీవితానికి కావాల్సినవన్నీ ఆ ఎయిర్ పోర్టులోనే చవగ్గా దొరుకుతాయి -- లగ్జరీ కార్లతో సహా!
    అక్కడ అమ్మకానికి కుప్పలు తెప్పలుగా ఉన్న బంగారు నగలూ, వజ్రవైడూర్యాలు చూస్తె అబ్దుల్ రజాక్ వర్ణించిన హంపీ విజయ నగర వీధులు గుర్తు వస్తాయి.
    హంపీ విజయనగరంలో రత్నాలు రాసులు పోసి అమ్మేవాళ్ళని కూడా అబ్దుల్ రజాక్ చూసి చెప్పింది.
    రాజుని అవేమీ ఆకర్షించలేదు. అతను ఎయిర్ పోర్టు లోనే ఉన్న ఒక సైబర్ కేఫ్ లోకి వెళ్ళి , ఆంధ్రా న్యూస్ కోసం ట్రై చేశాడు.
    అక్షరాలు స్క్రీన్ మీద కనబడుతున్నాయి.
    "రాక్షసి కోనలో రాక్షసుడు -- నిజ నిర్ధారణ ప్రయత్నాలు !"
    రాక్షసి కొనలో రాక్షసుడు -- అప్ డేట్  రాకాసి కోన సమీపంలో రాక్షసుడు ఒకడు సంచరిస్తున్న వదంతి గురించి మనం తెలుసుకున్నాం. "రాక్షసుడి (?) చేతికి చిక్కి గాయపడి , తప్పించుకు వచ్చినా చావుని తప్పించుకోలేకపోయిన గిరిజనుడు డుముకు వంటికి అతుక్కుని ఉన్న పొడుగాటి వెంట్రుకలని పరిశీలించిన నిపుణులు అవి మనకి తెలిసిన ఏ జంతువు తాలుకూవీ కావు అని నిర్ధారించారు.
    ఈలోగా , రాక్షసుడన బడే ఒక మహా కాయుడిని చూసినట్లుగా పల్లె ప్రజల దగ్గర్నుంచి అనేకమైన రిపోర్టులు వస్తున్నాయి.
    ఈ కలియుగం రామాయణ కధకి మరో మలుపు ఏమిటంటే, రాకాసి కోన ప్రాంతంలోనే ఒక పల్లెలో ఒక రామాలయం ఉంది. ఆ రామాలయంలో మొదట నుంచి కూడా అనేకమైన కోతులు ఉన్నాయి. అయితే ఇప్పుడూ ఆ రాక్షసుడి తాలుకూ రిపోర్టులు రావడం మొదలయ్యాక, ఆలయంలోకి కోతులు రావడం ఉదృతమయింది. అన్ని కోతులని ఒక్కసారిగా ఒక్కచోట చూసి ఎరగని జనం వాటికి "వనరసైన్యం " అని పేరు పెట్టారు.
    ఈ కారణంగా , ఈ చుట్టుపక్కల ప్రజలలో రాక్షసుడంటే , భయమూ, రాముడి పట్ల భక్తీ ఒక్కసారిగా పెరిగిపోయాయి. రాత్రింబగళ్ళు రామనామ సప్తాహం జరుగుతోంది. "లంకా దహనం" పౌరాణిక నాటకం ప్రదర్శించబడింది. రాక్షసుడి పీడ విరగడయితే ఇక్కడ రామలీల ఉత్సవాలు ప్రతి ఏటా జరిపిస్తామని జనం మొక్కుకుంటున్నారు.
    కళ్ళర్పడం మర్చిపోయి, స్క్రీన్ వైపే చూస్తూ ఉండిపోయాడు రాజు.
    "అదుగో పులి , అంటే ఇదిగో తోక " అన్న సామెతకి అర్ధం ఏమిటో అతనికిప్పుడు పూర్తిగా బోధపడింది. "అదిగో రాక్షసుడు " అంటే "ఇవిగో వాడి కొమ్ములు" అనేటట్లుగా వున్నారు మూడ జనం.
    కొందరి అమాయకత్వాన్ని ఎక్స్ ప్లాయిట్ చేసే కొందరి అఘాయిత్యం!
    ఇదే కదా లోకం తీరు !
    ఎప్పుడెప్పుడు వెళ్ళి ఊరు చేరుకుంటానా అనిపిస్తోంది రాజాకి.
    సరిగ్గా అప్పుడే.
    పబ్లిక్ అడ్రెస్ సిస్టం లో అనౌన్స్ మెంటు వినబడుతోంది.
    "యువర్ అటేన్షన్ ప్లీజ్ ....... న్యూసిటీ నుంచి న్యూడిల్లీ వెళ్ళే ఎఎఎ 111 విమానంలో . అనుకోని టెక్నికల్ ప్రాబ్లం రావడం వల్ల ఆ ప్లయిట్ కాన్సిల్ అయిందని చెప్పడానికి చింతిస్తున్నాం. త్రిబుల్ ఏ త్రిబుల్ వన్ విమానంలో బుక్ అయి వున్న మూడు వేలమంది ప్యాసింజర్లనూ, సాధ్యమైనంత త్వరలో డిస్టినేషన్ కి చేర్చడానికి గానూ అరేంజ్ మెంట్స్ , అతి త్వరలో చేయబడతాయి.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS