గీ. తలమొగంబున వయ్యాళితరమువాని
స్థిర మొగంబున దేవుఁడెపుడు సుస్థిరముగాను
సిరియు నాయువు సౌభాగ్య సిద్ది జయము
పఱగఁజేయుత మీసభాపతికి నెపుడు.
సీ. భానుండు తగ మీకు భవ్యతేజం బిచ్చు
కరుణఁ జంద్రుఁడు మీకుఁ గాంతి యిచ్చు
అంగారకుఁడు మీకు మంగళంబుల నిచ్చు
బుధుఁడు నెమ్మది మీకు బుద్ది నిచ్చు
నెఱి బృహస్పతి మీకు నిర్మల మతి యిచ్చు
నరయ శుక్రుఁడు మీకు హర్ష మిచ్చు
రాహు వెప్పుడు మీకు బాహాబలం బిచ్చు
కేతువు మీకు విఖ్యాతి నిచ్చు
గీ. ఘనత కెక్కిన యీ నవగ్రహము లెపుడు
బలిమి నేకాదశస్థానఫలము లొసగఁ
ఋత్ర పౌత్రాభివృద్దిచే భూతలమున
మీరు వర్ధిల్లుఁ డాచంద్రతరకముగా
సీ. ధరణిపుత్రుని పినతల్లి తమ్ముని సుతు
తాత యల్లువి రాణి తండ్రి కొడుకు
కొడుకుతండ్రికి తండ్రి కోడలిసుతు బంటు
కరియైన వానబ్బ కగ్రసుతుని
తమ్ముని యేలిక తండ్రి వియ్యంకుని
కూతునేర్పునఁ జేరగొన్నవాని
తనయునిఁద్రుంచిన ఘనునౌషదము దెచ్చు
వానయ్య సుతుని తద్వరకుమారు
గీ. నవ్య కోడలి కోడలి యన్న యండ్రి
భామయోద్దను కొలువున్న భామ జనకు
తనయుచేతను గూలిన ఘనుని తల్లి
ధరుఁడు మీ కిచ్చుఁబుత్ర పౌత్రాభివృద్ది.
మ. నునుమైఁగల్మిపడంతి డాకరమునందున్ బూరుగో మ్మొండుచే
తను వేయంచు'లవాలు మేలోసఁగనౌ డాలున్ బవల్ రే యొన
ర్పను జూపున్ నేఱిచూపు లాసగొను'చూపట్టే జగాజట్టి బొ
ట్టనవ్రేలన్ వెలిబుగ్గగన్న యొడయండా! నన్ను ఁబాలింపుమా!
సీ. శృంగారరాయని చెలువు మీఱిన కొండ
ఫణి రాజు పేరిటి పసిఁడి కొండ
పుష్పజాతులనెల్ల భూషింపఁగల కొండ
కల్పవృక్షము లైదుఁ గల్గు కొండ
చిలుకలు కోవెలల్ చెలఁగి కూసేడి కొండ
మృగరాజకో ట్లేల్ల మేలఁగు కొండ
ఘోరపాపము వాపు కొనేఱు గల కొండ
తలఁచిన మోక్షంబు దగులు కొండ
గీ. అమరవరులకు వైకుంఠ మైన కొండ
ఆళువారికిఁ బ్రత్యక్ష మైన కొండ
అర్ధి జూచిన బ్రహ్మాండమైన కొండ
యేను గనుఁగొంటి శ్రీ వెంకటేశు కొండ
కృష్ణ నవరత్నములు
సీ. నరక బాణాసుర మురజరాసంధాది
పావులచేఁ జాల బాధలఁ బడి
భూదేవి విన్నపంబులు సేయక్షీరాబ్ధి
శాయి దయాళుఁడై జగతి మీఁద
యాదవ వంశంబునందుఁదా వసుదేవు
సూనుఁడై జన్మించి సురలు మెచ్చ
ధరణిభారముఁ బాపి దనుజులఁ బరిమార్చి
ధర్మంబు నిలిపి యదురు మడఁబె
అ. నట్టిదేవదేవు నాదినారాయణుఁ
బుండరీకనయను భుజగశయనుఁ
గమలనాభుఁగొలిచి కల్మషంబుల నెల్లఁ
దోలువాఁడ ముక్తి నేలువాఁడ.
సీ. పురుడు వెళ్ళనినాఁడే పూతనఁ బరిమార్చె
శకటాసురునిఁ గొట్టెఁ జరణహతిని
బడఁ ద్రోబ్బే మద్దులు బకునిఁ గీటడఁగించే
దావాగ్ని ద్రావి వత్సకునిఁ గూల్చె
గోవర్దనం బెత్తి గోవుల రక్షించెఁ
గాళీయనాగంబు గర్వమడఁబె
ధేనుకాసురుఁ బట్టి తిట్తోల్చే మహిపుత్తుఁ
దునిమి రక్కసునిఁ దుత్తుమురు సేసె
గీ. వెలయు వనమెల్లఁ బేఱికిపో వీచే లీల
వత్సవాతూలు నాతృణావర్తుఁ గేడపే
సురచిరాంగుండు గోపాల సుందరుండు
దనుజదమనుండు గేవలదైవ మెట్లు ?
సీ. గోపాలకులతోడ గోవులఁ గాచె నా
కాళింది తటమునఁ గమలభవుఁడు
వత్సముల్ గొనిపోవ వానిరూపము దాల్చి
వనజేశునకుఁ దల వంగఁ జేసే\
బాల్యంబుబునాఁడు గోపాలకులును దాను
వెన్నలు పాలుని వేజ్జి యాడె
చేడేలతో జలక్రీడ లాడఁగఁ జొచ్చి
యందఱచీరలు నపహరించే
ఆ. రహిఁ బాదాఱు వేల రాజకన్యకలను
నన్ని రూపులగుచు ననుభవించే
రాసకేళిఁ గూడె రామల నెల్లను
గృష్ణుమహిమ లెన్నఁ గెవలంబే.
సీ. వెలయ నక్రూరుకు విశ్వరూపము సూపె
వలువకై చాఁకాలి వానిఁ జంపె
మఱి రుబ్జఁ జక్కని మనిసిగాఁ జేసేఁ
ఋష్ప లావి కొసంగే భూరిమహిమ
కంసునిధేనువుల్ ఖండించి వైచెను
గువలయా పీడంబు పోవ రడంచే
బాణూరామల్లుల సమయించె భుజగర్వ
రూడిని గంసుని రూప మణఁచె
గీ. కంసుతండ్రిని బట్టంబు గట్టి కాచె
దేవకీదేవి దైన్యంబు త్రెంచి వైచెఁ
గేలిమై శిశుపాలునిఁ గీటడంచె
భక్త వత్సలు శ్రీకృష్ణుఁ బ్రస్తుతింతు.