Previous Page Next Page 
క్రాస్ రోడ్స్ పేజి 3


    
    ఫైవ్ స్టార్ హోటల్ని గుర్తుకు తెస్తున్న అక్కడ వాతావరణంలో పేషెంట్స్ నిట్టూర్పులుగాని, మందుల వాసనగాని మచ్చుకైనా లేవు.
    
    పొడవుగా వున్న లాబీ చివరకు వచ్చారా ముగ్గురు ఎదురుగా రికార్డు రూమ్ కనిపించింది.
    
    పరబ్రహ్మం చేతిలో వున్న కీతో రికార్డు రూమ్ డోర్సుని ఓపెన్ చేశాడు.
    
    ఆ ఇద్దరూ లోపలికి రాగానే డోర్స్ క్లోజ్ చేసి లోపల నుంచి లాక్ చేసేశాడు.
    
    ఆ హాలంతా గాడ్రేజ్ ఫైలింగ్ అల్మెరాలు వరసక్రమంలో నీట్ గా అరేంజ్ చేసున్నాయి.
    
    ఒక్కో అల్మెరాపైనా సంవత్సరాల్ని సూచించే ప్లాస్టిక్ చిప్స్ వ్రేలాడ దీసున్నాయి.
    
    పరబ్రహ్మం ముందుకు సాగిపోతున్నాడు.
    
    అతని వెనుకే ఈ ఇద్దరు వ్యక్తులు మెల్లగా నడుస్తున్నారు. 1986... 1985.... 1984.... 1983.... 1982.... ఇయర్స్ కి సంబంధించిన అల్మరాల్ని దాటి వెనుక సంవత్సరాలకేసి సాగిపోతున్నారా ముగ్గురు.
    
    1962.... 1961.... 1960....
    
    అంకెల్ని చూస్తున్న ఆ ఇద్దరు ఆగంతకుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
    
    1959 అల్మెరా దగ్గర ఆగిపోయాడు పరబ్రహ్మం.
    
    ఆ అల్మెరాలో పన్నెండు అరలు క్రింది నుంచి పైవరకూ ఉన్నాయి. వాటిమీద నెలల పేర్లున్నాయి. ఒక అరలో తిరిగి ముఫ్ఫై ముఫ్ఫై ఒక చిన్న అరలున్నాయి వాటిమీద తేదీలున్నాయి.
    
    సైంటిఫిక్ ఫైలింగ్....
    
    ఏమాత్రం కన్ ఫ్యూజ్ కాకుండా టక్కున కావాల్సిన ఫైల్ ని పికప్ చేసుకోగల సౌలభ్యం.
    
    డాక్టర్ పరబ్రహ్మం డిసెంబర్ నెల అరదగ్గరకు చేతుల్ని చాపి లాస్ట్ ఫైల్ ని పికప్ చేశాడు.
    
    దాని మీద 1959 డిసెంబర్ 31 డెలివరీ కేసెస్ అని టైప్ చేసిన స్లిప్ అంటించి వుంది.
    
    ఫైల్ ని ఆ యువకుడికి అందించాడు పరబ్రహ్మం.
    
    ఆ యువకుడు ఆతృతగా ఫైల్ ని ఓపెన్ చేశాడు.    

    "జీరో అవర్స్ టూ జీరో అవర్స్.
    
    డిసెంబరు 31...
    
    పదకొండు డెలివరీలు" అని ఇండెక్స్ పేపరుమీద స్పష్టంగా వ్రాసుంది.
    
    ఆ యువకుడిలో టెన్షన్ రెట్టింపయింది. నడివయస్కుడు కూడా ఊపిరి బిగబట్టి ఫైల్ లోకి తొంగిచూస్తుండగా ఫైల్ లోని ఒక్కొక్క పేజీని తిరగవేయసాగాడా యువకుడు.
    
    ఫైల్ ని తిరగేస్తూ ఆ యువకుడు విచిత్రమైన ఉద్విగ్నతకు లోనయ్యాడు.
    
    ఫైల్ లోని ఏడవపేజీ దగ్గర ఆగిపోయాడా యువకుడు. అందులో ఒక డెలివరీ గురించిన వివరాలు స్పష్టంగా రాసున్నాయి.
    
    మదర్    :   యశోధర
    
    ఫాదర్    :   రామన్ హో...
    
    డెలివరీ డేట్    :   డిసెంబర్ 31, 1959
    
    సమయం    :   రాత్రి 8.05
    
    బర్తు    :   మేల్
    
    బరువు    : 9.1 పౌండ్స్
    
    కలర్    :   ఫ్యూర్ వైట్
    
    ఆ వివరాలన్నీ ఒకసారి చదువుకొని ఒకింత సర్వెస్ గా ఫీలయ్యాడు. అతనితో వచ్చిన నడివయస్కుడు అతని భుజం ప్రక్కనుంచి తొంగి తొంగి చూశాడు.
    
    రామన్ హో ఎక్కడాయన...? ఎవరతను...? ఎక్కడ పుట్టాడు? ఎక్కడ ఎదిగాడు....? మనీ మెషిన్ లా వందల కోట్లు సంపాదించిన మనీ మేకర్...
    
    ప్రతి కనురెప్పపాటు కాలంలో కోట్లాదిరూపాయలు తన బ్యాంక్ ఎకౌంట్స్ లో జమ అయ్యేలా చేసుకోగలిగిన మేగ్నిఫిషియంట్ పర్సనాలిటీ...
    
    rise up from the ashes...
    
    తన ముందున్న బూడిదను బంగారపు రజనుగా మార్చుకోగలిగిన జీనియస్ ఏడి ఎక్కడ?
    
    ఆ పేజీ దగరే మరికొద్దిసేపు ఆగిపోతే ఘనీభవించిన గతం జలపాతమై పోతుంది. One must hear his roar. కానది సమయం కాదు. అందుకే నడివయస్కుడు షార్ప్ గా రియాక్టు అవుతూ "మేకిట్ ఫాస్ట్.... ఐ సే" అన్నాడు చిన్నగా ఆ యువకుడి భుజాన్ని తడుతూ.
    
    ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు వరద ప్రవాహంలా ఆ యువకుడ్ని ముంచెత్తుతున్నా అతనికి కాలం విలువ.... కార్యసాధన అవసరం, ముంచుకొస్తున్న ప్రమాదాల పరిణామం తెలుసు కనుక చప్పున ఆ పేజీని తిప్పాడు.
    
    ఎనిమిదవ పేజీలోని వివరాల్ని చదువుతూనే ఎగ్జయిట్ మెంట్ తో కేక వేయబోయి తనను తాను బలవంతంగా నిగ్రహించుకున్నాడు. అతని చేతులు వణుకుతున్నాయి. రెప్ప వేయటం మర్చిపోయాడు. అప్పటివరకు అతని అంతరాళంలోనూ ఉన్న రవ్వంత అనుమానం క్రమంగా కరిగిపోసాగింది.
    
    ఆ యువకుడు ఫైల్లోంచి తల పైకెత్తి నడివయస్కుడి కేసి చూస్తూ చిరునవ్వుతో సంజ్ఞ చేశాడు.
    
    అతనికి విషయం అర్ధమైపోయింది.
    
    ఆ పేజీలోని వివరాల్ని మౌనంగా తన ఫోటోగ్రాఫిక్ మెమొరీలో నిక్షిప్తం చేసుకున్నాడా యువకుడు.
    
    ఆపైన ఫైల్ ని మూసేసి డాక్టర్ పరబ్రహ్మానికి అందించాడు. ఏమయిందన్నట్లు నడివయస్కుడు కనుబొమ్మల్ని ఎత్తి ప్రశ్నించాడు. "ట్వంటీ ఫైవ్ పర్సెంట్" అన్నాడా యువకుడు పొడిగా చిన్నగా వచ్చిన దగ్గర్నుంచి డాక్టరు పరబ్రహ్మం ఆ యువకుడికేసి రెప్పవేయకుండా చూస్తున్నాడు. తను చూస్తున్నది కలో నిజమో అర్ధం కాక అతను ప్రపంచ వింతలన్నింటినీ ఒకేసారి చూసిన దిగ్భ్రమకు లోనవుతున్నాడు.
    
    ఓప్రక్క భయం, మరోప్రక్క ఉత్కంఠ, ఇంకోప్రక్క గర్వం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూండగా ఆ యువకుడి అవసరం గుర్తుకు రాగా ముందుకు కదిలాడు. రెండడుగులు వేసి మరో రేక్ దగ్గర ఆగిపోయాడు.
    
    అగంతకులిద్దరూ పరబ్రహ్మం దగ్గరకు వెళ్ళారు.
    
    పరబ్రహ్మం ఆ రేక్ లోంచి మరో ఫైల్ తీసి ఆ యువకుడికి అందించాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS