Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 2

" కావాలంటే వీళ్ళ నడుగు. నా మాట ఏనాడు నమ్మావు గాబట్టి యీనాడు నమ్మటానికి" అంటూ ఆయన వెళ్ళిపోయాడు.

    ఆవిడ విళ్ళిద్దరినీ  ఉరిమి చూసి " ఏం నాయనా! మిరు నమస్కారం పెట్టటానికి యీయనతప్ప ఎవరూ దొరక లేదా మికు? ఈయనతో ఏం పనిబడింది, ఏం కావలసి వచ్చింది?" అంది.

    " నమస్కారం పెట్టడం మర్యాద లక్షణం. పెద్దవాళ్ళకి పెట్టడంలో తప్పులేదు గాబట్టి పెట్టాము. పంగనామాలు పెటామా? తిన్న యింటికి వాసాలు లెక్క పెట్టామా? వుత్త నమస్కారం పెట్టాము. అంతే! అదీ మిరు ఇంటి గల వారని మేము ' టులెట్' బోర్డు చూసి వచ్చాం గాబట్టి..." అబ్బులు కళ్ళజోడు సవరించుకుని ఇంటావిడని నాలుగు కళ్ళతో ఎగాదిగా చూసి గట్టిగా చెప్పేశాడు.

    " నమస్కారాలు పెట్టించుకోవటం యిష్టం లేకపోతే మానేస్తాం" వ్యాకర్ణ చెప్పేశాడు.


    " మికు మా ఇంట్లో అద్దెకు దిగుదామని వచ్చారా?" అంది ఆవిడ.

     " అవును."
   
    " మికు పెళ్ళియిందా?" పై నుండి క్రిందివరకూ పరిక్షి స్తూ అంది.

    " కాలేదు."

    " అయితే మిరు మరోయిల్లు చూసుకోండి."

    " అదేమిటండీ! పెళ్ళి గాకపోవడం మా నేరమా? పెళ్ళయిన వాళ్ళకే అద్దేలకి స్తే మాలాంటి బ్రహ్మచారులు పేవ్ మెంటు మిద పడి ఏడ్వాల్సిందే? పెళ్ళి చేసుకున్న వాడు ఉత్తముడని పెళ్ళి కానివాడు పేచీ కోరని ఎక్కడుం దని మేమడుగు తున్నాము. అదీ గాక..."

    " వీళ్ళు నాకు నమస్కారం కూడ పెట్టారేవ్" అంటూ ఇంటాయన గుర్తు చేశాడు.

    " మిరు కాసేపు నోరు మూసుకోండి" అని ఆయన్ని గద్దించి వీళ్ళవైపు తిరిగింది ఆవిడ." మిరు మరో ఇల్లు చూసుకోండి" అంది ముఖం ముట ముట లాడిస్తూ.

    " బ్రహ్మచారుల మైనా మేము చాల మంచి వాళ్ళ మండి. మిరు కాదూ కూడదు పెళ్ళయిన వాళ్ళకే ఇల్లు అద్దెకిస్తామంటే ఓ పని చేస్తాం. మా చదువు పూర్తికా లేదు. మా కిప్పుడెవరూ పిల్లనివ్వారు కాబట్టి మావాడు, నేను పెళ్ళి చేసేకుంటాం అన్నాడు వ్యాకర్ణ.

    " ఏమిటీ?" అంటూ ఇంటావిడ కనుగుడ్లు పెద్దవి చేసింది.

    " ఇద్దరు మగాళ్ళు గాని ఇద్దరాడ వాళ్ళుగాని పెళ్ళాడ టంలో తప్పులేదండి, ఇప్పుడది పేషన్ కూడా. ఇతర దేశాలలో ఎంత మంది పెళ్ళి చేసుకుంటున్నారో మికేం ఎరుక? మా వాడు నేను పెళ్ళి చేసుకుంటాం ఓ కంచంలో తింటూ (హొటలు వాడు పెడితే) ఓ మంచం మిద పడుకుని ( మాకు మంచాలే లేవు) ఓ గదిలోనే కాపురం పెడతాము. పిల్లలు కనటం ఎలాగూ ఆసాధ్యం కాబట్టి పెళ్లాడటానికి అభ్యం తరం లేదు ఏమంటారు?"

    " ముందిక్కడి నుంచి పోమ్మంటాను. ముఖాలు చూస్తుంటేనే తెలుస్తుంది. రౌడీ మూక రౌడీమూకని, నాకు ఆరుగురు కూతుళ్ళు. మిరు చూడబోతే తోకలేని కోతుల్లా వున్నారు."

    " ఏ మండోయ్! మాటలు మర్యాదగా రానివ్వండి. మికు ఆరుగురు కూతుళ్ళో ఏడుగురు కొడుకులో ఎవరి కెరుక?" అన్నాడు వ్యాకర్ణ.

    " మి అమ్మాయిలను పెళ్ళికాని అబ్బాయిల కివ్వరా అండీ?" అనుమానం బయట పెట్టాడు అబ్బులు, అమాయకంగా.

    " ఆ... ఆ... ఏమిటా వ్యంగం. నే అనుకుంటూనే వున్నా, మొన్నీ మధ్య మా మొడో అమ్మాయి శకుంతల పేర ప్రేమలేఖ రాసింది మి రేనని ... ఏకంగా మా ఇంట్లోనే మకాం పెట్టి మా అమ్మాయి బ్రతును నట్టేటిలో  కీడ్చి మా పరువు గంగలో కలిపి..."

    " ఈ ఊళ్ళో గంగ లేదండి, క్రిష్ణ తప్ప" గుర్తు చేశాడు వ్యాకర్ణ. 
 


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS