Previous Page Next Page 
స్టార్ వార్స్ పేజి 2

    బాహ్యా ప్రపంచంలో తనకు సంభందం లేదన్నట్టు దైవసన్నిధిలో సున్నా అయన ఏ క్షణంలో బయటకు వస్తాడా అని ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అయనకోసం ఎదురుచూస్తున్నారని ఆయనకు తెలియదనుకోవడం పోరపాటు__అన్నిటికన్నా పూజాకార్యక్రమం ఆయనకు ముఖ్యం. సుబ్రహ్మణ్యస్వామి పూజ పూర్తీకానిదే అయన మంచినీళ్ళు కూడా నిర్దుష్టమైనా వేళలున్నాయి. ఆ విషయం తెలిసిన అతడి స్తేనోలు, సెక్రటరీలు గడియారాలవైపు ఓరకంట చూస్తూ వదయారు అఫీఎసు రూములో కూర్చున్నారు.

   
                                                           *     *    *     *
   
    ఆ ఇంటి ఫోర్స్ చూస్తెచాలు, ఆ ఇంటిని_ ఆ ఇంట్లోనివార్ని అంచనా వెయవచ్చు. ఫోర్స్ లో ఆగివున్న లేత గూలాభీరంగు రోల్స్ రాయిస్ కారు మీద సూర్యకిరణం అందంగా మెరిసి తప్పుకుంటోంది. వరండా అంచున్న వరుసగా కుమ్దీలిన్నాయి. పాలరాయి తెల్లగా మెరుస్తోంది. మెయిన్ డోర్ తెరుచుకుని లోపలకి అడుగుపెట్టగానే మంచు సముద్రమని భ్రమింపజేసే తివాచీ నేలమీద పరచివుంది. ఆ హాలు ఓ మూల చాక్ లేట్ కలరు సోఫాలున్నాయి. మరో మూల బిర్లా మందిర్ గర్బగుడిలో దర్శన మిచ్చే పాలరాతివిగ్రహాన్నిపోలిన విగ్రహముంది. ఆ వుగ్రహం అయిదడుగుల పోడవుంది. దానికున్న వెండి తాపడం కన్ స్తీల్ద్ లైటింగ్ లో అందంగా మెరుస్తోంది. సెంట్రల్లీ ఎయిర్ కండిషన్దుఅయిన ఆ హాలులో సున్నితమైనా పరిమళం వ్యాపిస్తోంది. ఆ హాలుకి  అంటిపెట్టుకుని స్మాల్ కారిడార్. ప్రక్కనే  ఓ బెడ్ రూమ్. చాలా పెద్దదయిన ఆ గది అందంగా వుంది. వుడెన్ ఫర్నిచర్, రాక్స్, కార్డ్ లేస్ ఫోన్లు రెండు, ఇంటర్ కమ్, స్టీరియో రికార్డు ప్లేయిర్ కం టేపిరికార్డర్... ఎవరో మనస్తత్వవేత్త అన్నట్టు గదినిబట్టి ఆగది లో వుంటున్న వ్యక్తిని అంచనా వేయవచ్చు. అంతకుమించి ఇంపోర్టెంట్ ఎయిర్ కండిషనర్, పొందికయిన బెడ్ గదిలో వుంటున్న వ్యక్తీ లగ్జరీని తెలియజేస్తున్నాయి.

    ఆ గది యజిమానురాలి పేరు కావ్య... వయారు ఏకైకకూమార్తె. డీల్లీ యూనివర్సీటీలో ఎమ్.బి.ఏ.పూర్తీచేసింది. తండ్రి వ్యాపారంలో చేదోడు వాదోడుగా వుంటున్న ఆమె అ క్షణాన బాట రూమ్ లో వుంది. బెడ్ రూమ్ లో వున్నా టేప్ రికార్డర్ కి బాత్ రూమ్ లోస్పీకర్ కలపబడి వుంది. బాత్ టబ్ లో పన్నీరు కలిపిన గోరువెచ్చని నీళ్ళలో జలకాలాడుతున్న ఆమె స్పీకర్ నుంచి మద్రంగా వినిపిస్తున్న జేసుదాసు పాటలు వింటోంది. అప్పుడు ఇంటర్ కం మోగింది__ ఆమె స్వప్నం భగ్నమయింది. ఆ ఫోను చేసింది తండ్రి వడయారు. విషయం వింటూనే తటాలున బాత్ టబ్ నుంచి లేచింది. టవలుతో శరీరం తడి అద్దుకుంది. తడిపోడిగావున్నా తువ్వలుని హేమ్గర్ కి తగిలించి  అలాగే డ్రెస్సింగ్  టేబుల్ దగ్గరకు  నడించింది.
   

                                                                0     0     0     0
   
    గిన్నీస్ బుక్  ఆఫ్ వరల్డ్ రికార్ద్సు లో చోటుచేసుకున్న ఇండస్ట్రీయ లిస్స్తులు భారతదేశంలో వున్నారంటే నమ్మశక్యంగా వుండకపోవచ్చు. కాని ఇది అక్షరసత్ర్యం. భారతదేశానికి ఆ ఘనత సంపాదించిపెట్టిన సంస్థ "హీరో సైకిల్" నిర్మాణసంస్థ__ గుజరాత్ సైకిల్స్. 1956లో లూథియానాలో ప్రారంభమయిన ఈ సంస్థ అతిసాధారాణమయింది. కేవలం రెండు దశాబ్దలలో సైకిల్స్ ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రధమస్థానం వహిస్తుందని  ఆ రోజున ఏ ఒక్కరూ ఊహించలేదు. అమెరికాకు చెందిన హప్సికార్పోరేషన్స్ సాలుసరి 200 కోట్ల సైకిళ్ళు ఉత్పత్తి చేస్తుంటే గుజరాత్ సైకిల్స్ 1985నాటికి 203 కోట్ల సైకిళ్ళు ఉత్పత్తి చేసి ప్రపంచ పఠంలో కీర్తిబావుఠాను ఎగురవేసింది. ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి 9000 కోట్ల  సైకిళ్ళు ఉత్పత్తి అవుతుంటాయి. అమెరికా, చైనా, రష్యా, జపాన్, తైవాన్, ఇటలీ దేశాల పోటీకి తట్టుకోవడమేగాక 'నెంబరు వన్' స్థానాన్ని నిలుపుకోవడానికి మనవారు చేసిన కృషి శ్లాఘనీయం. భారతదేశానికే  గర్వకారణమయిన 'గుజరాత్ సైకిల్స్' సంస్థలో మేజర్ శేర హోల్డర్ ఏం.వి. అయ్యా_విజయ రహస్యం అందరకీ తెలిసినదే. సగటు మనిషికి నిత్యావసర వస్తువు, వీలయినంత చౌకగా అందజేయడం! సగటుమనిషి సాధారణంగా ఫాన్సీ_ లగ్జరీ వస్తువుల కొనిగోలు చేయదు. వస్తువు ధరకి, మన్నికకు ప్రాధాన్యత ఇస్తాడు. ఈ రెండు విషయాలలో ఒక పర్యాయం సగటు మనిషిని ఒప్పించగలిగితే ఇహ ఆ వస్తువుకి ఎక్కడ లేని ప్రచారం, ఆదరణ లభిస్తుంది. ఇదే సూత్రాన్ని డిటర్జెంట్స్  విషయంలో కూడా అనుసరించటం జరిగింది. ఆ డిటర్జెంట్స్_ "నిర్మా" వాషింగ్ పౌడరు, వాషింగ్ సోపు 1987లెక్కల వాషింగ్ పౌడరు,కేక్ ఉత్పత్తిచేసి డిటర్జెంట్స్  ఇండస్ట్రీలో మకుటంలేని మహారాజులయిన ప్రాక్టర్ అండ్ గేంబుల్,లివర్ బ్రదర్స్ ఆధిపత్యాన్ని త్రోసిరాజంది. ఈ సంస్థలోకూడా మేజర్ షేర్ హొల్దర్ఏం.వి.అయ్య.

    దీనితో జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక రంగంలో మాదాల వెంకట్రామయ్యకి చక్కనిగుర్తింపు, గౌరవం లభించాయి. అతడి అభి ప్రాపాయలను, ఆలోచనలకు, పధకాలకు  ఎంతో విలువ ఇస్తున్నారు.

    అంతర్జాతీయ పారిశ్రామిక రంగంలో అనతికాలంలోనే పోటీడారిల్ని ఏం.వి.అయ్య.ఏ విధంగా ద్వీతీయ తృతీయ రంగాలకు తప్పింఛాడో, అదే విధంగా స్వదేశంలోనే తన స్థానాన్ని నిలుపుకోవడానికి మరింత చొరవ ప్రదర్శించివలసిన అవసరం ఏర్పడింది. ఏం.వి.అయ్య ఏమాత్రం అలక్ష్యంగా వున్నా మొదటి స్థానంనుండి జారిపోవడం ఖాయం.

    ఏం.వి అయ్య పాలిట సింహస్వప్నమయిన ఆ వ్యక్తీ వడయారు. అంద్రాకు చెందిన ఎం.వి. అయ్య నిత్యావసర వస్తువల్ని అల్ప ఆదాయం గలవారి అవసరాలను ద్రుష్టిలో పెట్టుకుని వస్తు ఉత్పత్తి చేస్తే వదియారు మిడిల్ క్లాసు వారి అవసరాలను, అభిలాషను దృష్టిలో  పెట్టుకున్నారు. భారతదేశంలో ఎడ్యు కసీ పెరగడం__ రోడ్ల నిర్మాణం పెంపోందడంలో  మిడిల్ క్లాసు నేస్సేసిటీ, ఫాన్సీ 'టూ__ వీలర్స్' అయ్యింది. ఫలితంగా మోటారు సైకిళ్ళకు, స్కూటర్లకు విపరీతమైనా డిమాండ్ పెరిగింది. ఈ విషయాన్ని ముందుగా గ్రహించిన వారిలో వడయారు ఒకడు. ఇఇరంగంలో ప్రధమస్థానం 'బజాజ్ ఆటో' కంపెనిదీ! 1987లో 610కోట్ల రూపాయల స్కూటర్లను  ఉత్పత్తి చేసింది ఈ సంస్థ ఇటలీకి చెందిన పియోగ్గియో అండ్ కంపెనీ వారి స్కూటర్లు మార్కెట్ లో  బజాజ్  స్కూటర్లకు ప్రత్యామ్యాయం అయ్యేయ్యేగాని పోటీదారుకాలేదు. ఈ విషయంలో వడయారు ముందుచూపు శ్లాఘనీయం. ఎం.వి.అయ్య."హీరో సైకిల్స్" ద్వారా గుర్తింపు పొందడం చూసిన వడయారు భారతదేశానికి చెందిన 'అట్లాస్, ఎ_ వన్, టి.ఐ' సైకిల్స్ ఎజెన్సీ కోసం కూడా ప్రయత్నించలేదు. ఇతర రంగాలపై దృష్టిని నిలిపాడు. స్కూటర్ల ఏజెన్సీ సంపాదించే విషయంలో కూడా తొందరపడలేదు. అందరూ బజాజ్ పియాగ్గియో కంపెనీ స్కూటర్ల ఏజెన్సీలకోసం పోటీపడుతున్న సమయంలో వదయారు 'హొండా' మోటారు సైకిల్ ఏజెన్సీకోసం ప్రయత్నించాడు. వదయారు వ్యాపారదక్షతకు ఇది మచ్చుతునగా కాక, నేస్సిసిటీగా మారింది. లీటరు పెట్రోలు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది__ మెకానికల్ ప్రాబ్లమ్స్ ఏమిటి? అన్న విషయానికి ప్రాధాన్యత వచ్చింది. ఫలితంగా జపాన్ కి చెందిన 'హొండా' మోటారు సైకిల్ కి బ్లాక్ పెరిగింది. 'హొండా' ఏజెంటుగా వడయారుకి పట్టిందల్లా బంగారమయిమ్ది. ఒక సైకిల్ లేదా ఒక సబ్బు  తాయారు చేసి అమ్మడంవల్ల వచ్చే లాభం కొన్ని వందల రెట్లు వుంటుంది. సైకిళ్ళు సబ్బులు అమ్మకం ఎక్కువుగా వున్నా బిజినెస్ ఆపరేషన్ కూడా అదే స్థాయిలో వ్యయభరితంగా వుంటుంది. పైపెచ్చు ఏరియా వారీగా సబ్ డీలర్లను అపాయింట్ చేసి, వారు ఇచ్చిన డిపాజిట్లతో వడయారు వ్యాపారం నడుపుతున్నాడు_ అదీ అతడి వ్యాపారదక్షత!

   
                                                                  0             0             0
   


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS