పెనుచీకటాయే లోకం
మాంగల్యబలం (1959)
సంగీతం : మాస్టర్ వేణు
గానం : ఘంటసాల, పి. సుశీల
నిర్మాత : దుక్కిపాటి మధుసూదనరావు
దర్శకుడు : ఆదుర్తి సుబ్బారావు
సరోజ:
పెనుచీకటాయే లోకం
చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ
విధియే పగాయే ||పెనుచీకటాయే||
సరోజ :
చిననాటి పరిణయగాధ
ఎదిరించ లేనైతినే
ఈనాటి ప్రేమగాధ - తలదాల్చలేనైతినే
కలలే నశించిపోయే
విషమాయె మా ప్రేమ
విధియే పగాయే ||పెనుచీకటాయే||
చంద్రం:
మొగమైన చూపలేదే
మనసింతలో మారెనా
నా ప్రాణసతివని తెలిపే - అవకాశమే పోయేనా
తొలినాటి కలతల వలన
హృదయాలు బలి కావలెనా
విషమాయె మా ప్రేమ
విధియే పగాయె ||పెనుచీకటాయే||
వాడినపూలే వికసించెనే
మాంగల్యబలం (1959)
సంగీతం : మాస్టర్ వేణు
గానం : ఘంటసాల, పి. సుశీల
నిర్మాత : దుక్కిపాటి మధుసూదనరావు
దర్శకుడు : ఆదుర్తి సుబ్బారావు
సరోజ : వాడినపూలే వికసించెనే - చెర
వీడిన హృదయాలు పులకించెనే
చంద్రం : తీయని కలలే ఫలియించెనె - ఎల
కోయిల తనగొంతు సవరించెనే
సరోజ : వేయిరేకుల విరిసింది జలజం
చంద్రం: తీయ తేనియ కొసరింది భ్రమరం
సరోజ : లోకమే ఒక ఉద్యాన వనము
లోటులేదిక మనదే సుఖము
||తీయని||
చంద్రం :పగలే జాబిలి ఉదయించేనేలా
సరోజ : వగలే చాలును పరిహసమేలా
చంద్రం : తేటనీటను నీ నవ్వుమొగమే
తేలియాడెను నెలరేనివలెనె
||వాడిన||
సరోజ : జీవితాలకు నేడే వసంతం
చెదిరిపోవని ప్రేమానుబంధం
ఆలపించిన ఆనందగీతం
ఆలకించగ మధురం మధురం
||వాడిన||
పాడవోయి భారతీయుడా!
వెలుగు నీడలు (1961)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : ఘంటసాల, సుశీల బృందం
నిర్మాత : దుక్కిపాటి మధుసూదనరావు
దర్శకుడు : ఆదుర్తి సుబ్బారావు
పాడవోయి భారతీయుడా! ఆడి
పాడవోయి విజయగీతికా! ||పాడవోయి||
నేడే స్వాతంత్ర్య దినం! వీరుల త్యాగఫలం !
నేడే నవోదయం - నీదే అనందం! ||పాడవోయి||
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలేజేసి
సంబరపడగానే సరిపోదోయి
సాధించినదానికి సంతృప్తిని పొంది
అదే విజయమనుకుంటే పొరబాటోయి
ఆగకోయి భారతీయుడా - కదలి
సాగవోయి ప్రగతి దారులా ||ఆగకోయి||
ఆకాశం అందుకొనే ధరలోకవైపు
అదుపులేని నిరుద్యోగమింకొకవైపు
అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు
అలముకొన్న నీ దేశం ఎటు దిగజారు?
కాంచవోయి నేటి దుస్థితి - ఎది
రించవోయి ఈ పరిస్థితి ||కాంచ వోయి||
పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు
భాషాద్వేషాలు చెలరేగె నేడు
ప్రతిమనిషి మరియొకనీ దోచుకునేవాడే
తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునే వాడే
స్వార్ధమీ అనర్ధ కారణం - అది
చంపుకొనుటే క్షేమదాయకం ||స్వార్ధమీ||
సమసమాజ నిర్మాణమె నీ ధ్యేయం
సకలజనుల సౌభాగ్యమె నీ లక్ష్యం
ఏకదీక్షతో గమ్యం చేరినవాడే
లోకానికి మన భారతదేశం
అందించునులే శుభసందేశం!
ఓ రంగయో! పూలరంగయ్యో!
వెలుగు నీడలు (1961)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : ఘంటసాల, సుశీల
నిర్మాత : దుక్కిపాటి మధుసూదనరావు
దర్శకుడు : ఆదుర్తి సుబ్బారావు
పనివాళ్ళు:
ఓ ! రంగయో!
పూలరంగయో!
ఓరసూపు సాలించి సాగిపోవయో!
పొద్దు వాలిపోతున్నదోయి - ఇంత
మొద్దునడక నీకెందుకోయి?
||ఓ రంగయో||
సుగుణ:
పగలనక రేయనక - పడుతున్న శ్రమనంతా
పరులకొరకు ధారపోయు మూగజీవులు
చంద్రం:
ఆటలలో పాటలలో ఆయాసం మరచిపోయి
అనందం పొందగలుగు ధన్యజీవులు
||ఓ రంగయో||
సుగుణ:
కడుపారగ కూడులేని తలదాచగ గూడులేని
ఈ దీనుల జీవితాలు మారుటెన్నడో
చంద్రం :
కలవారలు లేనివారి కష్టాలను తీర్చుదారి
కనిపెట్టి మేలు చేయ గలిగినప్పుడే !
||ఓ రంగయో||
కలకానిది విలువైనది
వెలుగు నీడలు (1961)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : ఘంటసాల
నిర్మాత : దుక్కిపాటి మధుసూదనరావు
దర్శకుడు : ఆదుర్తి సుబ్బారావు
కలకానిది విలువైనది - బ్రతుకు
కన్నీటి ధారలలోనే బలిచేయకు
||కలకానిది||
గాలివీచి పూవులతీగ నేలవాలిపోగా
జాలివీడి అటులే దాని వదలివైతువా ?ఓ -
చేరదీసి నీరుపోసి చిగురించనీయవా?
||కలకానిది||
అలముకొన్న చీకటిలోనే అలమటించనేల ?
కలతలకే లొంగిపోయి కలవరించనేల ?
సాహసమను జ్యోతిని - చేకొని సాగిపో -
||కలకానిది||
అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగునదాగి సుఖమున్నదిలే
ఏదీ తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి
అదియే ధీరగుణం!
||కలకానిది||
