Previous Page Next Page 
దగ్గు తగ్గాలంటే ఏం చేయాలి? పేజి 189

 

1. ఒక కప్పు నీటిలో అర టీ స్పూన్ అల్లం తురుము, కొద్దిగా టీ పొడి, రెండు మూడు తులసి ఆకులు వేసి పది నిమిషాల పాటు మరిగించి దింపాలి. చల్లారిన తరువాత ఈ కషాయాన్ని తాగితే గొంతులో గరగర పోతుంది.

 

2. మూడు కప్పుల నీళ్ళలో రెండు తమలపాకులు వేయాలి. నాలుగు మిరియాలను పొడిగా చేసి ఇందులో కలపాలి. అన్నీ కలిపి 15 నిమిషాలపాటు మరగబెట్టి దింపేయాలి. ఇందులో టీ స్పూన్ తేనె కలుపుకుని ఉదయం, సాయంత్రం తాగాలి. ఈ కషాయం తాగడం వల్ల పొడి దగ్గు తగ్గడమే కాకుండా ఛాతీలో పట్టినటుగా ఉన్నా కూడా ఉపశమనం లభిస్తుంది.

 

3. కప్పు నీటిలో మూడు మల్బరీ ఆకులను వేసి పది నిమిషాల పాటు మరగబెట్టి దింపి చల్లార్చాలి. ఇందులో కోడిగుడ్డులోని తెల్ల సొన కలుపుకుని తాగాలి. దీర్ఘకాలంగా బాధిస్తున్న దగ్గు తగ్గుతుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS