Previous Page Next Page 
కరివేపాకులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసా...? పేజి 226

 

కరివేపాకు లేని తాలింపు ఉండదంటే అతిశయోక్తి లేదు. ఉప్మాలోనూ, పులిహోరలోనూ కరివేపాకు లేకపోతే రుచే రాదు. అయితే కరివేపాకు వల్ల వంటకాలకు రుచి, సువాసన తప్ప ఎలాంటి ఉపయోగం లేవనుకోవడం పెద్ద పొరపాటు. కరివేపాకులో ఎన్నో విధాలైన ఔషధ విలువలున్నాయి. మరి అవి ఏమిటో ఒకసారి చూద్దామా..

1. కరివేపాకును కొబ్బరినూనెలో మరిగించి, వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయని తెలుసు.

2.కరివేపాకు, వేప కలిపి ముద్దగా నూరి ఒక స్పూను ముద్దను అరకప్పు మజ్జిగలో కలిపి పరగడుపున తీసుకుంటే చర్మసమస్యలు తగ్గిపోతాయి.

3.బ్లడ్‌షుగర్ ఉన్నవారు ప్రతిరోజూ కరివేపాకును విరివిగా వాడటం వల్ల ఆ వ్యాధి అదుపులోకి వస్తుందని తెలుసు.

4.కరివేపాకును మెత్తగా నూరి నెయ్యి లేదా వెన్నతో కలిపి కాలిన గాయాలపై రాస్తుంటే మచ్చలు పడకుండా త్వరగానూ మానుతాయని చదివారు.

5.ఒళ్లంతా దురదలతో బాధపడేవారు కరివేపాకు, పసుపు సమానంగా తీసుకుని పొడిగొట్టుకుని రోజూ ఒక స్పూను మోతాదులో నెలరోజులపాటు తీసుకుంటే దురదలు తగ్గుతాయి.

6.కరివేపాకు రసాన్ని పెరుగు లేదా వెన్నలో కలిపి కళ్లకింద పూస్తుంటే కంటికింది వలయాలు మాయమవుతాయని చదువుకున్నారు.

7.నీళ్లవిరేచనాలతో బాధపడేవారు గుప్పెడు కరివేపాకును ముద్దగా చేసి ఒకటి రెండు స్పూన్ల మోతాదులో అరకప్పు మజ్జిగలో కలిపి రోజుకు మూడు నాలుగు సార్లు సేవిస్తే వెంటనే తగ్గుతాయని తెలుసు.

8.మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ఒకస్పూన్ కరివేపాకు రసాన్ని రోజూ రెండుపూటలా తీసుకుంటూంటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చని తెలుసు


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS