భగవంతుడికి భక్తుడికి అనుసంధానం ధ్యానం

 

ధ్యానం ద్వారా భగవంతుని చేరడం ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నత అనుభూతిగా పరిగణింపబడుచున్నది. తీవ్రసాధనలు, కఠోర తపస్సు, భగవత్కౄప – వీటి ద్వారా ఈ అనుభూతి కలుగుతుంది. చాలా తక్కువమంది సాధకులు మాత్రమే  ఈ స్థితికి అర్హులై ఉంటారు. అత్యధికశాతమంది ప్రారంభనుండే క్రమేపి వెళ్లవలసినవారై ఉంటారు. ఇటువంటి ప్రారంభ సాధనే ప్రార్థన.

భౌతిక ప్రపంచం, మనకి కనిపిస్తున్న సృష్టి, దానిలోని వస్తువులు కనిపించడం సహజం. కానీ వాస్తవం వేరే ఒకటి ఉంది. అది సత్యం.ఆ సత్యమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నదనీ జీవితానుభవాలు మనకు తెలియచేస్తాయి. ఆ సత్యవస్తువైన భగవంతునితో అనుసంధానము ఏర్పరచుకోవాలని భావించడం సహజం. స్పష్టంగా కాకపోయినా ఏదో అస్పష్టమాత్రంగా గ్రహించిన ఆ భగవంతుని వైపుగా చేతులు జోడిస్తాడు మానవుడు. తనకు మార్గం చూపమనీ, ఆ పరిపూర్ణ స్త్యస్వరూపమైన భగవంతుని మన స్ఫూర్తిగా వేడుకొంటాడు.  

అయితే భగవంతున్ని ధ్యానించే మార్గలు ఎన్ని ఉన్నా ప్రార్ధన ద్వారానే దేవ దేవుడి అనుగ్రహం సాధ్యం కాగలదు. మనిషి మనిషికి మారవచ్చు. కాని, దాని ముఖ్యోద్దేశం అందరికీ ఒకటే. ఒక జీవికి భగవంతునికి మధ్య ప్రత్యేకమైన బాంధవ్యమును పెంపొందించటానికి పనిసి వచ్చే సాధనమే ప్రార్థన. అంటే సౄష్టికి, సౄష్టికర్తకు మధ్యవుండే బంధాన్ని బలపరిచేదే ప్రార్థన.

సాధారణంగా దేనినైనా స్వీకరించే స్థితిలో ఉండటం మనస్సు ప్రవౄత్తి. అందుచేతనే ఆధ్యాత్మిక జీవితంలో తొలిమెట్టు ప్రార్థన. ఈ ప్రార్థనా ఫలితంగా భగవంతుని అనుగ్రహజనితవీక్షణం, విశ్వాసం, ప్రేమ, బలిమి రూపాలలో ప్రసరించిమన మనస్సును నింపుతుంది. మొత్తానికి ప్రార్థన మనిషికి ఆధ్యాత్మిక జ్ణ్జానమును పొందుటకు కావలసిన మనో వికాసమును కలుగజేస్తుంది.

◆ వెంకటేష్ పువ్వాడ

 


More Purana Patralu - Mythological Stories