మీరు ఎప్పుడైనా దేవాలయాలకు వెళ్లారా? ఇదేం ప్రశ్న అని అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే దేవాలయాలకు మీరు అస్సలు వెళ్లి ఉండరు. వెళ్లడం సంగతి  అటుంచితే అసలు ఆ మందిరాల గురించి మీరు కనివిని ఎరిగి ఉండరు. మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తే కొన్ని విచిత్రమైన దేవాలయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. 

◆ఖజురహో టెంపుల్

ఈ టెంపుల్ మధ్యప్రదేశ్ లో చతర్పూర్ అనే జిల్లాలో ఉంది. భారతదేశంలో లో అత్యంత ప్రాచుర్యం కలిగిన మందిరాలలో ఇది ఒకటి. ఈ దేవాలయం శృంగార శిల్పాల కు ప్రసిద్ధి. ఇటువంటి శిల్పాలు దేవాలయం వెలుపల లోపల రెండువైపులా ఉంటూ మనల్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తాయి సాధారణంగా ఏదైనా దేవాలయం అనగానే మనకి పవిత్రమైన భావన కలుగుతుంది అక్కడ ఏదో ఒక దేవుడి యొక్క ప్రతిమ మనకు కనిపిస్తుంది కానీ ఈ దేవాలయంలో మాత్రం ఎటు చూసినా ఇటువంటి శృంగార శిల్పాలు ఉంటాయి అవి కూడా ఆనైతికంగా ప్రకృతి విరుద్ధంగా చేసే కామ క్రీడలను కూడా ఈ శిల్పాలలో చెక్కారు. అద్భుతమైన మరియు అనూహ్యమైన హస్తకళ, వాస్తుశిల్పం మరియు శిల్పకళకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖాజురాహో మనస్సులో ఇదే ప్రశ్న తలెత్తుతుంది, ఈ సృష్టిలను ఎవరు సృష్టించారు? వాటిని తయారు చేయడానికి ఎంత సమయం పట్టింది? కానీ ఖాజురాహో వద్ద ఆలయ నిర్మాణం ఒక శాపం వల్ల జరిగిందని చెబుతారు. వీటిని చందేలా రాజులు నిర్మించారు అని అంటారు. అయితే మహాత్మా గాంధీ లాంటి వారు కూడా ఈ శిల్పాలను తప్పుపట్టారు అంటే ఇది ఏ స్థాయిలో ఉన్నాయో మీరే నిర్ణయం తీసుకోవచ్చు. మనం కుటుంబ సమేతంగా కలిసి వెళ్లలేని దేవాలయం ఏదైనా ఉంది అంటే ఖజురహో దేవాలయం అని ఘంటాపదంగా చెప్పగలను. అయితే ఇటువంటి దేవాలయాన్ని నిర్మించేటప్పుడు ఎవరు ఎందుకు అడ్డు చెప్పలేదు పోనీ నిర్మించాక అయినా ఎందుకు ఎవరు దానిని తొలగించే ప్రయత్నం చేయలేదు ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న మీకు గనక సమాధానం తెలిసినట్లయితే కింద కామెంట్ బాక్స్ లో రాయండి.

◆అమితాబచ్చన్ టెంపుల్

అవునండి మీరు విన్నది నిజమే నిజంగానే అమితాబ్ బచ్చన్ గారికి ఒక వీర అభిమాని ఒక దేవాలయాన్ని కట్టి పూజించాడు మన భారతీయులు విపరీతంగా సినిమా లను  సినిమా నటులను కొలుస్తూ వుంటారు. క్రికెట్ కి సచిన్ ఎలాగైతే దేవుడు గా చెబుతారు అలాగే సినిమాకి అమితాబచ్చన్ ఒక దేవుడు. అతని మీద అత్యంత భక్తితో కోల్కతాలో ఒక భారీ మందిరాన్ని కట్టించాడు ఒక అభిమాని. అంతటితో ఆగకుండా ప్రతి రోజు ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు అక్కడ మిగతా అభిమానులు అందరితో కలిసి  పండగ చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక మానవమాత్రుడి కి ఇలా గుడి కట్టి పూజించడం సబబేనా.. ఒక్క అమితాబచ్చన్ ఏ కాదండీ జై లలిత, రజినీకాంత్ ఖుష్బూ నరేంద్ర మోడీ అంతెందుకు మన తెలుగు హీరోయిన్ త్రిష కి కూడా గుడి కట్టించిన మహానుభావులు ఉన్నారు. పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్ళింది అంటే ఇదే కాబోలు. దైవంతో పోటీ పడడం ఏంటి? మీకు ఇది నచ్చిందా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి

◆గడియారం బాబా దేవాలయం

మామూలుగా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కానుకగా ఏది సమర్పిస్తాము.. ఒక ఫలము పుష్పమో.. ఇంకా బాగా డబ్బు ఉంటే కొన్ని బంగారు నగలు పట్టు వస్త్రాలు ఇలాంటివి దేవుడికి కానుకగా మనం సమర్పించుకుంటాము. కానీ ఈ టెంపుల్ లో మాత్రం భక్తులు తమ కోరికలు నెరవేరి ఎందుకు దేవుడికి గడియారాలు కానుకలుగా ఇస్తారట. ఇలా గడియారం కానుక ఇచ్చిన కొన్ని రోజుల్లోనే తమ కోరికలు నెరవేరుతాయని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు.  ఈ విషయం అటు ఉంచితే అందరికీ తలరాతల్ని మార్చే దేవుడికి గడియారాల తో పనేంటి.. ఇది ప్రజల విశ్వాసానికి చెందిన విషయం కాబట్టి నేను ఇంతకన్నా ఎక్కువ గా ఏమీ చెప్పలేక పోతున్నాను కనీసం మీరైనా ఆలోచిస్తారు కదూ

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories