గయ రహస్యం.. ఈ ప్రాంతంలో సూర్యాస్తమయం తర్వాత ఎవ్వరూ ఉండరు..!


 గయ రహస్యం.. ఇక్కడ పెద్ద సంఖ్యలో మరణించిన వారికి పిండప్రదానాలు, తర్పణాలు, పితృకార్యాలు నిర్వహిస్తుంటారు.   గయ ఫల్గు నది ఒడ్డున ఉంది. ఈ నది ఒడ్డునే పితృకార్యాలు నిర్వహిస్తుంటారు.  ఇక్కడ మరణించిన వారికి పిండ ప్రదానాలు నిర్వహించడానికి ప్రపంచ నలుమూలల నుండి వస్తుంటారు. అయితే గయ ప్రాంతంలో ఒక మర్మమైన ప్రదేశం ఉందట.  ఈ ప్రదేశంలో సూర్యాస్తమయం తర్వాత ఒక్క వ్యక్తి కూడా కనిపించరట.  దీని వెనుక  రహస్యం ఏంటో తెలుసుకుంటే..

ప్రేతశిల పర్వతం..

బీహార్‌లోని గయలో ఉన్న ప్రేత శిల పర్వతం చాలా రహస్యమైనదని చెబుతారు. అకాల మరణం చెందిన పూర్వీకులకు పిండ దానం చేయడంలో ప్రసిద్ధి చెందిన ప్రదేశమిది. ఈ పర్వతం మీద తర్పణం,  పిండ దానం నిర్వహిస్తారు. సనాతన గ్రంథాలలో ప్రతశిల పర్వతాన్ని  ప్రేతశిల  తీర్థం అని పిలుస్తారు. ప్రేతశిల  పర్వతంపై యమ  ధర్మరాజు ఆలయం ఉందట. పితృ పక్ష సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తమ పూర్వీకులకు మోక్షం కోసం ప్రేత శిలకు వస్తుంటారు.

అకాల మరణం చెందిన పూర్వీకులకు తర్పణం,  పింఢదానం పితృ పక్ష సమయంలో అష్టమి తిథిలో చేస్తుంటారు. అట్లాగే సాధారణ రోజులలో కూడా, ప్రేతశిల పర్వతం మీద  పూర్వీకుల కోసం శ్రాద్ధం, తర్పణం,  పింఢదానం చేస్తారు. సాయంత్రం వేళల్లో అంటే సూర్యాస్తమయం తర్వాత ఇక్కడ ఉండకూడదని చెబుతారు. అకాల మరణం చెందిన పూర్వీకుల ఆత్మలు ఇక్కడ నివసిస్తాయని. అందువల్ల  సూర్యాస్తమయం తర్వాత అక్కడ ఉంటే ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగే ప్రమాదం ఉందని చెబుతారు. అందుకే ప్రేతశిల పర్వతం మీద సూర్యాస్తమయం తర్వాత ఎవ్వరూ ఉండరు. అయితే ఇది ప్రభుత్వం నుండి వచ్చిన నియమం కాదు. మతపరమైన నమ్మకం అని,  స్థానిక ప్రజలు గట్టిగా నమ్ముతారు.  స్థానిక ప్రజలు తప్పకుండా ఈ నియమాన్ని పాటిస్తారని కూడా చెబుతున్నారు.

                             *రూపశ్రీ.


More Purana Patralu - Mythological Stories