English | Telugu

సాహోలో ప్రభాస్ క్యారెక్టర్‌పై డౌట్‌ ఇదేనా..?

on Feb 8, 2018

బాహుబలి సిరీస్‌ తర్వాత ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తర్వాత ఎవరితో..? ఎలాంటి సినిమా చేస్తాడనే క్వశ్చన్ రాకుండా.. బాహుబలి-2 సెట్ మీద ఉండగానే తన తదుపరి సినిమా అనౌన్స్ చేసేశాడు. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సాహో అనే సినిమా చేస్తున్నానని.. 150 కోట్ల బడ్జెట్‌తో తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తామని కూడా చెప్పాడు. బర్త్‌డే గిఫ్ట్‌గా టైటిల్ టీజర్‌ను కూడా వదిలాడు. సరే ఈ సంగతి పక్కనబెడితే.. అసలు సాహో స్టోరీ ఏంటీ..? ప్రభాస్ క్యారెక్టర్ ఏంటీ అంటూ సోషల్ మీడియాలో పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి.

ఇక తాజాగా వినిపిస్తున్న కథనం ప్రకారం.. ఈ మూవీలో ప్రభాస్ ఒకే పాత్రలో రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తాడట. డీజేలో అల్లు అర్జున్‌ బ్రాహ్మణుడుగా పోలీసులతో సహకరించే పాత్రలో కనిపించినట్లుగానే.. సాహోలో కూడా ఒక క్రిమినల్‌గా.. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా రెండు షేడ్స్‌లో అలరిస్తాడని ఫిలింనగర్ టాక్. ఆల్‌మోస్ట్ షూటింగ్ కంప్లీట్ స్టేజ్‌కు వచ్చిన ఈ సినిమా దుబాయ్‌లో కీలక షెడ్యూల్ జరుపుకోవాల్సింది. అయితే అక్కడి ప్రభుత్వాల నుంచి అనుమతి రాకపోవడంతో అది వాయిదా పడింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ నిర్మిస్తోన్న సాహోని.. 2019 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here