దేవ్‌గణ్‌తో పెళ్లంటే కాజోల్‌తో తండ్రి కొన్ని వారాలు మాట్లాడలేదు!
on Oct 17, 2020
దేశవ్యాప్తంగా అభిమానులున్న యాక్టర్లలో అజయ్ దేవ్‌గణ్, కాజోల్ జంట ఒకటి. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న దేవ్‌గణ్ ఉత్తమ నటుడిగా పలు అవార్డులను అందుకున్నాడు. మరోవైపు తన చార్మింగ్ బ్యూటీతో పాటు అద్భుతనమైన నటనా విన్యాసాలతో కాజోల్ ప్రేక్షకుల హృదయాల్ని దోచుకుంది. ప్రేమలో పడిన ఆ ఇద్దరూ 1999 ఫిబ్రవరి 24న పెళ్లి చేసుకుని, దంపతులుగా మారారు. అయితే ఈ పెళ్లికి కాజోల్ తన తల్లిదండ్రులను ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. నటి కూడా అయిన తల్లి తనూజ కన్విన్స్ అయ్యింది కానీ, బెంగాలీ డైరెక్టర్-ప్రొడ్యూసర్ అయిన తండ్రి షోము ముఖర్జీ కన్విన్స్ కాలేదు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి కాజోల్ దూరమవుతుందనే ఉద్దేశంతో ఆయన ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. కాజోల్ పట్టుబట్టడంతో కొన్ని వారాల పాటు ఆయన కూతురితో మాట్లాడలేదు కూడా.
కాజోల్, దేవ్‌గణ్ ఫ్రెండ్ సర్కిల్ కూడా వాళ్ల వైవాహిక బంధం ఎక్కువ కాలం కొనసాగుతుందని నమ్మలేకపోయారు. కారణం.. అజయ్ ఇంట్రావర్ట్ అయితే, కాజోల్ అందుకు పూర్తి భిన్నమైన వాగుడుకాయ మనస్తత్వం ఉన్న అమ్మాయి. ఏదీ మనసులో దాచుకోదు. ఈ భిన్న మనస్తత్వాలు ఒకదగ్గర ఎలా ఇముడుతాయనేది అందరి సందేహం. కానీ పెళ్లి తర్వాత వాళ్లందరి ఊహలను తారుమారు చేస్తూ 21 సంవత్సరాలుగా కాజోల్, దేవ్‌గణ్ అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. వారి మధ్య బంధం మునుపటి కంటే మరింత దృఢంగా మారిందని వారి సన్నిహితులు చెప్పే మాట. ఆ ఇద్దరికీ ఇద్దరు పిల్లలు. పదిహేడేళ్ల అమ్మాయి నైసా ప్రస్తుతం సింగపూర్‌లో చదువుకుంటుంటే, పదేళ్ల కొడుకు యుగ్ ముంబైలోని స్కూల్లో చదువుకుంటున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
