ఫస్ట్ ఫిల్మ్ హిట్‌తో రెమ్యూనరేషన్ పెంచేసిన హీరోయిన్
on Oct 17, 2020
నాని కథానాయకుడిగా నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళీ ముద్దుగుమ్మ ప్రియాంకా అరుల్ మోహన్. మొదటి సినిమాతో విజయం అందుకోవడంతో పాటు నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకని, తమ సినిమాలోకి ఆమెను తీసుకుందామని వెళుతున్న దర్శక, నిర్మాతలకు రెమ్యూనరేషన్ విషయంలో చుక్కలు చూపిస్తున్నారట. ప్రస్తుతం రూ. 75 లక్షలు డిమాండ్ చేస్తున్నారట. ఒక్క హిట్ ఉన్న హీరోయిన్ కి అంత ఇవ్వడానికి నిర్మాతలు ఆలోచిస్తున్నారట.
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటించనున్న సినిమా 'మహా సముద్రం'. 'ఆర్ఎక్స్ 100' విజయం తరవాత అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో ఓ కథానాయికగా అదితి రావు హైదరిని తీసుకున్నారు. మరో కథానాయిక పాత్రకు ప్రియాంకను అనుకున్నారు. ఉన్నట్టుండి ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ఆమె విషయంలో ఆలోచిస్తున్నారట. ఇతర హీరోయిన్ల వైపు చూస్తున్నారట. ఆప్షన్లో ఎవరైనా ఉన్నారేమో అని.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
