యాంకర్‌గా అవతారమెత్తిన వితిక!
on Sep 30, 2020
వితికా శేరు నటిగా ఆశించిన రీతిలో పేరు సంపాదించుకోలేక పోయింది. తెలుగమ్మాయి కావడం వల్లో, మరో కారణం వల్లో ఆమెకు తగినన్ని అవకాశాలు రాలేదు. ఆ తర్వాత తెరపై తన సరసన హీరోగా నటించిన వరుణ్ సందేశ్‌ను పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడింది. అయినప్పటికీ ఆమెలోని సృజనాత్మక శక్తి కుదురుగా ఉండనివ్వలేదు. భర్తతో కలిసి బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసింది.
ఇప్పుడు తన కెరీర్లో మరో అంకానికి ఆమె తెరతీసింది. అతి త్వరలోనే ఆమె టీవీ రంగంలో యాంకర్‌గా కొత్త అవతారంలో కనిపించనుంది. "యాంకర్‌గా పరిచయం అవుతున్నందుకు చాలా ఉద్వేగభరితంగా ఫీలవుతున్నా. టీవీలో నన్ను నేను చేసుకోవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ప్రతి ఆదివారం రాత్రి 7 గంటలకు ఈటీవీ తెలుగులో సామజవరగమన షో చూడండి." అని తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేసింది వితిక. యాంకర్‌గా ఆమెను వీక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాల్సిందే.
Also Read