యువ హీరోలకు విశ్వక్ సేన్ ఛాలెంజ్...
on Oct 15, 2020
యువ కథానాయకులు సందీప్ కిషన్, కార్తికేయ గుమ్మకొండ, సాయి సుశాంత్ రెడ్డి, అలాగే నటులు అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటికి 'ఈ నగరానికి ఏమైంది?', 'ఫలక్ నుమా దాస్', 'హిట్' సినిమాల హీరో విశ్వక్ సేన్ ఒక ఛాలెంజ్ విసిరారు. అది ఏంటంటే... వర్కౌట్స్ లో భాగంగా ఒక టేబుల్ మీద చేతులు పెట్టి కాళ్లతో అటు నుంచి ఇటు... ఇటు నుంచి అటు... జంప్ చేయాలి. దీనిని బెంచ్ హోప్స్ అంటారు అన్నమాట. ఈ విధంగా విశ్వక్ సేన్ ప్రతిరోజూ చేస్తుంటారు.
హీరోలను 40 బెంచ్ హోప్స్ చేయమని విశ్వక్ సేన్ ఛాలెంజ్ చేశారు. ఆల్రెడీ దీనిని సందీప్ కిషన్ స్వీకరించారు. బెంచ్ హోప్స్ చేస్తానని చెప్పిన సందీప్ 'ఈ ఛాలెంజ్ ఎందుకు?' అని విశ్వక్ ని ప్రశ్నించారు. కొన్ని ఛాలెంజ్ లు ప్రారంభించడానికి ప్రత్యేక కారణాలు అంటూ ఏమీ ఉండవు. తర్వాత అవి పాపులర్ అవుతుంటాయి. ఆ విధంగా ఈ ఛాలెంజ్ కూడా పాపులర్ అవుతుందేమో చూడాలి.
Also Read