టైటిల్ క్లాస్ పోస్టర్ మాస్!!
on Nov 6, 2018
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న రామ్ చరణ్ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ దీపావళి కానుకగా ఈ రోజు రిలీజ్ చేశారు. టైటిల్ క్లాస్ గా ఉన్నప్పటికీ పోస్టర్ మాత్రం మాంచి మాస్ గా ఉంది. ఒక చేత్తో గొడ్డలి పట్టుకుని మరో చేత్తో గన్ ని అందుకోబోతున్న లుక్ లో రామ్ చరణ్ టెర్రిఫిక్ గా ఉన్నాడు. మెగా అభిమానులు ఫస్ట్ లుక్ కి ఫిదా అయిపోతున్నారు. ఫస్ట్ లుక్ చూస్తే నే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. ఇటీవల బోయపాటి సాఫ్ట్ టైటిల్ తో జయజానకి సినిమా చేశాడు. టైటిల్ క్లాసే అయినా అందులో బోయపాటి మార్క్ యాక్షన్ మాత్రం బోలెడంతగా ఉంది. అలాగే `వినయ విధేయ రామ` టైటిల్ ఎంత సాఫ్ట్ గా ఉందో టైటిల్ లోగా కానీ, పోస్టర్ కానీ చాలా ఫోర్స్ గా ఉంది, ఒక చక్రం పై టైటిల్ , దానిపైన ధనస్సు సంధిస్తున్నట్టుగా టైటిల్ రాయడంతోనే బోలెడు కథ చెప్పేసాడు బోయపాటి. భారీ యాక్షన్ సినిమాలు చేయడంలో బోయపాటి స్పెషలిస్ట్ ఆయన లిస్ట్ లో ఈ సినిమా కూడా చేరనుంది. రామ్ చరణ్ కు ఇది 12వ సినిమా. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందింస్తున్నారు. కైరా అద్వానీ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. వివేక్ ఒబేరాయ్ ఇందులో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ నెలాఖరు వరకు షూటింగ్ కంప్లీట్ కానుంది. సంక్రాంతి కానుకగా జనవి 11న సినిమా రిలీజ్ చేయనున్నారు. రేపు సినిమా టీజర్ ను విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది చిత్ర యూనిట్.